MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌

Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌

మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి హిట్‌, మరోటి ఫట్. అయితే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రావాల్సిందే. ఆ మూవీతోనే త్రిష టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాల్సింది. మరి అదేంటి? ఎలా మిస్‌ అయ్యిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 31 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహేష్‌, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ
Image Credit : facebook/@trishakrishnanfans

మహేష్‌, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ

మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో `అతడు`, `సైనికుడు` చిత్రాలు వచ్చాయి. `అతడు` మూవీ హిట్‌ అయ్యింది. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన `సైనికుడు` మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి చేయలేదు. కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ రావాల్సింది. నిజానికి ఆ సినిమా ద్వారానే త్రిష టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ జస్ట్ లో పోయింది. మరి ఆ సినిమా ఏంటి? ఎందుకు రిజెక్ట్ అయ్యింది? అనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మహేష్‌ బాబుతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాల్సిన త్రిష
Image Credit : Asianet News

మహేష్‌ బాబుతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాల్సిన త్రిష

త్రిష తమిళ చిత్రాలతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. `జోడి` చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత `మౌనం పెసియాదే` మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. `స్వామి`తో హిట్‌ అందుకుంది. దీంతో త్రిష కోలీవుడ్‌ హాట్‌ కేక్‌లా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసింది. అలాంటి సమయంలోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. మహేష్‌ బాబుతో మూవీతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ త్రిష ఫోటో చూసిన డైరెక్టర్‌ రిజెక్ట్ చేశాడు. ఈ అమ్మాయి సెట్‌ కాదని చెప్పేశాడు.

34
అర్జున్‌ మూవీ ఆఫర్‌ త్రిష మిస్సింగ్‌
Image Credit : facebook/@trishakrishnanfans

అర్జున్‌ మూవీ ఆఫర్‌ త్రిష మిస్సింగ్‌

ఆ సినిమానే `అర్జున్‌`. ఇది మహేష్‌ బాబు హీరోగా వచ్చిన చిత్రం. దీనికి గుణశేఖర్‌ దర్శకుడు. హీరోయిన్ల ఎంపిక జరుగుతున్నప్పుడు త్రిష ఫోటో కూడా వాళ్లకి వచ్చింది. బాగానే ఉందని అంతా అనుకున్నారు. కానీ హీరోయిన్‌ క్యారెక్టర్‌కి ఈ ఫేస్‌ సూట్‌ కాదని చెప్పి దర్శకుడు నో చెప్పాడట. దీంతో త్రిషని పక్కన పెట్టారు. ఆమె స్థానంలో శ్రియాని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా ఛాన్స్ మిస్‌ కావడంతో త్రిష వాళ్లు చాలా ఫీల్‌ అయ్యారట. అదే సమయంలో `వర్షం` మూవీ చిత్రీకరణ జరుగుతుంది. మహేష్‌ బాబు ఆఫీస్‌లో త్రిష ఫోటోలు చూశాడట ఎంఎస్‌ రాజు.. ఈ అమ్మాయి బాగుందని చెప్పి ఫోన్‌ చేశాడట. డైరెక్ట్ గా చెన్నై వెళ్లాడట.

44
వర్షం మూవీతో త్రిష టాలీవుడ్‌ ఎంట్రీ
Image Credit : Instagram

వర్షం మూవీతో త్రిష టాలీవుడ్‌ ఎంట్రీ

చెన్నైలో త్రిషని చూసిన ఎంఎస్‌ రాజు.. డైరెక్ట్ గా కొంచెం ఫ్యాటీగా ఉందని తగ్గించాలని చెప్పాడట. అంతే త్రిష ఆనందానికి అవదుల్లేవ్‌. వాళ్ల అమ్మ అడిగి మరి కన్ఫమ్‌ చేసుకుందట. ఆ ఆఫర్‌ రావడంతో తల్లికూతురు ఎగిరి గంతేశారట. అలా త్రిష.. `వర్షం` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ బ్లాక్‌ బస్టర్‌ మూవీతోనే ఆమె పరిచయం కావడం విశేషం. ఈ చిత్రం కోసం ఆమె చాలా కష్టపడిందట. 75 రోజులు వర్షంలోనే యాక్టింగ్‌ చేసిందని చెప్పారు ఎంఎస్‌ రాజు. ప్రస్తుతం ఆయన `అగధ` చిత్రాన్ని రూపొందించారు. తనే దర్శకుడు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్‌ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
త్రిష
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిపై వశీకరణ ప్రయోగం, మెగాస్టాను సొంతం చేసుకోవాలని విషప్రయోగం చేసింది ఎవరు?
Recommended image2
Singeetham Life Story: సినిమాకి కొత్త రుచులు చూపించిన సింగీతం.. 60 చిత్రాలు, ఎన్నో అద్భుతాలు, ఎవరికీ తెలియని నిజాలు
Recommended image3
Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత..
Related Stories
Recommended image1
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Recommended image2
Karmakhya Movie Review: `కర్మాఖ్య` మూవీ రివ్యూ.. అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved