MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్

Soundarya: ఎంపీ గా గెలిచుంటే సౌందర్య తెలుగు వారికి ఏం చేయాలనుకుందో తెలుసా? చివరి ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్

Soundarya: సినిమాల నుంచి పాలిటిక్స్ లొకి వెళ్లి ఏదో సాధించాలని అనుకుంది దివంగత నటి సౌందర్య. మరీ ముఖ్యంగా తెలుగువారికి ఆమె ఎంతో చేయాలని తపన పడింది. ఎంపీగా గెలిస్తే ఆమె ఏం చేయాలని ఆరాటపడింది.  తెలుగు ప్రేక్షకుల గురించి స్టార్ హీరోయిన్ ఏమన్నదో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 01 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సావిత్రి తరువాత అంతటి ఇమేజ్..
Image Credit : facebook

సావిత్రి తరువాత అంతటి ఇమేజ్..

తెలుగు సినిమాలో సావిత్రి తరువాత అంత సహజసిద్ధమైన నటనతో, హోమ్లీ ఇమేజ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న నటి సౌందర్య. కన్నడలో జన్మించినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు ఆమెను తమ సొంత ఇంటి ఆడపడుచుగా ఆదరించారు. ఒక చివరిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన బాల్యం, సినిమాలు, పెళ్లి, రాజకీయం తో పాటు ప్రజాసేవ గురించి, ఆమె పంచుకున్న మాటలు ఇప్పటికీ అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇంతకీ సౌందర్య ఏం చెప్పింది. ముఖ్యంగా తెలుగువారి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డాక్టర్ కావాలనుకుని... యాక్టర్ అయ్యి.
Image Credit : MAA TV

డాక్టర్ కావాలనుకుని... యాక్టర్ అయ్యి.

సౌందర్య బెంగళూరులోని ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమె ఆశయం డాక్టర్ కావడమే తప్ప, నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. ఆమె తండ్రి కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా ఉండటం వల్ల సినిమాల పరిచయం ఏర్పడింది. కాలేజీకి వెళ్తూనే మొదటి సినిమాలో నటించిన సౌందర్య, ఒక సినిమాతో నటన ఆపేద్దాం అనుకుందట. 

కానీ, ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య. అలాగే భవిష్యత్తులో సినిమా దర్శకత్వం (Direction) చేయాలనే బలమైన తపన కూడా తనలో ఉందని తన చివరి ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, చిన్నప్పటి నుంచి రిలేటివ్ కావడంతో పెద్దల అనుమతితోనే వివాహం చేసుకున్నామని వెల్లడించారు .

Related Articles

Related image1
Hypnic Jerk: నిద్రలో సడెన్ గా జారిపడ్డట్టు అనిపిస్తుందా? ఉలిక్కిపడి లేస్తున్నారా? ఏందుకిలా జరుగుతుంది?
Related image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
35
తెలుగువారికి ఎంతో రుణపడి ఉన్నాను..
Image Credit : MAA TV

తెలుగువారికి ఎంతో రుణపడి ఉన్నాను..

సౌందర్య అవ్వడానికి కన్నడ హీరోయిన్ అయినా.. ఆమెకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది మాత్రం తెలుగు సినిమాలే. టాలీవుడ్ లోనే ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఆతరువాత తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. కానీ సౌందర్యను తెలుగు హీరోయిన్ అనే అనేవారు. అందుకే ఆమెకు కూడా తెలుగు ఆడియన్స్ అంటే చాలా అభిమానం. తెలుగు ప్రేక్షకులతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆమె ఎప్పుడు చెబుతూ ఉండేది. 

ఓ ఇంటర్యూలో కూడా తెలుగువారి గురించి చెపుతూ.. సౌందర్య ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. "నేను ఈ రోజు 'సౌందర్య'గా ఉన్నానంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజలు మాత్రమే. ఈ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. నన్ను వాళ్ళ ఇంట్లోని ఒక అమ్మాయిగా భావించి ఎంతో అభిమానించారు. తెలుగు ఇండస్ట్రీ నాకు ఇచ్చిన గుర్తింపును జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను" అని అన్నారు.

45
ఎంపీ అయ్యి ఉంటే... తెలుగు వారికి ఏం చేసేది?
Image Credit : facebook

ఎంపీ అయ్యి ఉంటే... తెలుగు వారికి ఏం చేసేది?

హీరోయిన్ గా సినిమాలు తగ్గుతున్న టైమ్ లో పెళ్లి చేసుకున్న సౌందర్య.. వెంటనే పాలిటిక్స్ లోకి వెళ్లింది. దేశ రాజకీయాల్లో ఎదగాలని చూసిన సౌందర్య.. కెరీర్ బిగినింగ్ లోనే మరణించడం అభిమానులను కలచి వేసింది. ఇక రాజకీయాల గురించి గురించి మాట్లాడుతూ – ''సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఆరాటం నాకు ఉంది. అది మామూలుగా సాధ్యం అయ్యే పని కాదు. రాజకీయాల్లోకి వస్తేనే ప్రభుత్వ సపోర్ట్‌తో ప్రజలకు ఇంకా ఎక్కువ ఏదో చేయవచ్చు. ఒకవేళ ఎంపీ (MP) అయితే, ప్రభుత్వ సహకారంతో ప్రజలకు ఏదో ఒక మంచి సేవ చేసే అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా నన్ను ఆదరించిన తెలుగు ప్రజలకు ఏదైనా మంచి చేయాలని ఉంది. అని సౌందర్య అన్నారు.

55
ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయాలనే కోరిక
Image Credit : actress.Soundarya/instagram

ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయాలనే కోరిక

తాను సాధించిన స్టార్‌డమ్‌కు కారణమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన ఉన్నట్టు ఆమె స్పష్టం చేశారు. అంతటి ప్రజాదరణ పొందిన సౌందర్య, ఎంపీ అయ్యి ఉంటే కచ్చితంగా ప్రభుత్వ సహకారంతో తెలుగు ప్రజలకు, మహిళలకు, పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉండేవారని తన కామెంట్స్ ద్వారా స్పష్టమవుతోంది. దురదృష్టవశాత్తూ రాజకీయ ప్రచారంలో భాగంగా విమాన ప్రమాదంలో సౌందర్య మరణించారు. ఆమె ఈ లోకంలో లేకపోయినా.. తన సినిమాలు, మాటలు, తెలుగు ప్రజలపై ఆమెకున్న ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సౌందర్య
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Recommended image2
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Recommended image3
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Hypnic Jerk: నిద్రలో సడెన్ గా జారిపడ్డట్టు అనిపిస్తుందా? ఉలిక్కిపడి లేస్తున్నారా? ఏందుకిలా జరుగుతుంది?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved