MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • NBK: బాలకృష్ణకి ఆ విలన్ అంటే ఎంత పిచ్చో తెలుసా, షూటింగ్ అయిపోయినా సెట్ లోనే.. అదీ అసలైన క్లైమాక్స్

NBK: బాలకృష్ణకి ఆ విలన్ అంటే ఎంత పిచ్చో తెలుసా, షూటింగ్ అయిపోయినా సెట్ లోనే.. అదీ అసలైన క్లైమాక్స్

నందమూరి బాలకృష్ణకి ఎంతో ఇష్టమైన విలన్ ఒకరు ఉన్నారు. తన పార్ట్ షూటింగ్ అయిపోయినా ఆ విలన్ నటన కోసమే బాలయ్య సెట్ లో ఉండేవారట. ఇంతకీ ఆ నటుడు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2026, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna
Image Credit : Asianet News

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణకి సరైన మాస్ కథ పడితే రికార్డులు బ్రేక్ అవుతాయి. మాస్ చిత్రాలతోనే బాలయ్య ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ హిట్ మూవీ. ఇండస్ట్రీ రికార్డులని ఈ చిత్రం తిరగరాసింది. ఈ మూవీలో సిమ్రన్, అంజలి ఝవేరి, సంఘవి నటించారు. జయప్రకాశ్ రెడ్డి విలన్ పాత్రలో నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్
Image Credit : aha

బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్

ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య రాజసం కనబడుతుంది. బాలయ్య చెప్పిన డైలాగులు, ఆయన గెటప్, ఫైట్స్ అభిమానులకు పిచ్చెక్కించాయి. కానీ ఓ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ ఈ మూవీలో తనకంటే కూడా మరో నటుడికి ప్రాధాన్యం ఎక్కువ ఉంది అని, ఆయన లేకుంటే ఈ చిత్రం అంత పెద్ద విజయం సాధించేది కాదని బాలయ్య అన్నారు.

35
ఆ విలన్ అంటే బాలయ్యకి పిచ్చి
Image Credit : Asianet News

ఆ విలన్ అంటే బాలయ్యకి పిచ్చి

ఆ నటుడు ఎవరో కాదు.. విలన్ గా నటించిన జయప్రకాశ్ రెడ్డి. ఆయన నటన అంటే తనకు ఎంత పిచ్చో బాలయ్య స్వయంగా బయటపెట్టారు. క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాం నా పోర్షన్ సీన్లు కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత జయప్రకాశ్ రెడ్డి కుర్చీలో కూర్చుని డైలాగులు చెప్పే సీన్లు షూట్ చేయాలి. బాబు.. మీ షూటింగ్ పూర్తయింది, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పారు. నేను వెళ్ళను, నేను చేసిన ఫైట్స్ కాదు, జయప్రకాశ్ రెడ్డి చెప్పే డైలాగులే అసలైన క్లైమాక్స్. ఆయన నటన చూసే ఇంటికి వెళతాను అని చెప్పినట్లు బాలయ్య తెలిపారు.

45
ఆ సన్నివేశాలే కీలకం
Image Credit : our own

ఆ సన్నివేశాలే కీలకం

పగ.. పగ అంటూ జయ ప్రకాష్ రెడ్డి ఎంతో అద్భుతంగా ఆ సన్నివేశంలో నటించినట్లు బాలయ్య ప్రశంసలు కురిపించారు. ఆ సీన్ పండకపోతే క్లైమాక్స్ అంత గొప్పగా ఉండేది కాదు అని బాలయ్య అన్నారు. నాన్నగారి 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి' సినిమాలో నేను కూడా నటించాను. క్లైమాక్స్ లో నేను సమాధికి తల కొట్టుకునే సీన్ ఉంటుంది. అప్పట్లో నాకు సినిమా గురించి అంతగా అవగాహన లేదు. చదువుకునే కుర్రాడిని. నాన్నగారు పిలిచి ఈ సీన్ బాగా పండాలి రా.. ఈ సీన్ బాగా వస్తేనే సినిమా బావుంటుంది అని అన్నారు.

55
జయప్రకాశ్ రెడ్డి సినిమాలు
Image Credit : etv win

జయప్రకాశ్ రెడ్డి సినిమాలు

ఆయన మాటలు నాకు అర్థం కాలేదు. సినిమా అంతా నాన్నగారు ఉంటారు కదా. నా ఒక్క సీన్ బాగాలేకపోతే సినిమాకి ఏమవుతుంది అని అనుకునే వాడిని. సినిమా గతిని మార్చేసే సత్తా ఒక్క సీన్ కి కూడా ఉంటుంది అని ఆ తర్వాత నాకు అర్థమైంది. అందుకే సమరసింహారెడ్డి మూవీలో క్లైమాక్స్ లో జయప్రకాష్ రెడ్డి గారి నటన అంత కీలకం అని బాలయ్య అన్నారు. బాలయ్య సినిమా అంటే అందులో జయప్రకాశ్ రెడ్డి పాత్ర ఉండాల్సిందే. లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సీమ సింహం, పలనాటి బ్రహ్మనాయుడు, గొప్పింటి అల్లుడు, శ్రీమన్నారాయణ, లెజెండ్ చిత్రాల్లో జయప్రకాష్ రెడ్డి నటించారు. జయప్రకాష్ రెడ్డి చివరగా బాలయ్యతో జైసింహా చిత్రంలో నటించారు. 2020లో జయప్రకాశ్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aasmaan Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్‌‌ కొత్త మూవీ ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది.. వామ్మో ఇలా ఉందేంటి?
Recommended image2
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Recommended image3
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Related Stories
Recommended image1
Priyanka Jain: బాబోయ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ రొమాంటిక్ సాంగ్ చూశారా.. కియారా అద్వానీని మించిపోయిందిగా
Recommended image2
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved