MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు

Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు

Leader Box Office: లెజెండ్ శరవణన్ హీరోగా  దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'లీడర్' సినిమా థియేటర్లలో రచ్చ చేస్తోంది. భారీ వసూళ్లని రాబడుతోంది. మరి ఈ చిత్రం మూడు రోజుల్లో ఎంత చేసిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 06 2026, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లీడర్‌ మూవీ బాక్సాఫీసు వసూళ్లు
Image Credit : X/@yoursthelegend

లీడర్‌ మూవీ బాక్సాఫీసు వసూళ్లు

తమిళనాడులో పెద్ద బిజినెస్‌మ్యాన్ లెజెండ్ శరవణన్. ఆయన వ్యాపారవేత్తగా కంటే ఇప్పుడు హీరోగా బాగా పాపులర్‌ అయ్యారు. మొదట్లో తన షాప్ యాడ్స్‌లో స్టార్ హీరోయిన్లతో కలిసి నటించి ట్రెండ్ సెట్టర్‌గా మారారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, 2022లో వచ్చిన 'ది లెజెండ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. జేడీ-జెర్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజైంది. ఆ సినిమాతో రచ్చ  చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 శరవణన్‌ స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌
Image Credit : X/@yoursthelegend

శరవణన్‌ స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌

భారీ అంచనాలతో రిలీజైన 'ది లెజెండ్' సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ, లెజెండ్ శరవణన్ వాటిని పట్టించుకోకుండా, ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో తన రెండో సినిమాను ఎంచుకున్నారు.  బలమైన కథ, కథనాలతో `లీడర్‌` మూవీ చేశారు. శరవణన్‌కిది స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ అని చెప్పొచ్చు.

35
టీజర్‌తోనే అంచనాలు పెంచిన శరవణన్‌
Image Credit : X

టీజర్‌తోనే అంచనాలు పెంచిన శరవణన్‌

ఈ సినిమా కోసం సుందర్ సి సహా పలువురు టాప్ డైరెక్టర్లతో శరవణన్ చర్చలు జరిపారు. చివరికి దురై సెంథిల్‌కుమార్‌ను ఫైనల్ చేశారు. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో, ఆయన కూడా లెజెండ్ శరవణన్‌తో సినిమా తీయడానికి ఒప్పుకున్నారు. ఆయన కోసం ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసి, తన స్టైల్‌లో `లీడర్‌` సినిమాను తెరకెక్కించారు.  ఈ మూవీ టీజర్ రిలీజైనప్పుడే అంచనాలు పెరిగాయి. అందులో శరవణన్ యాక్షన్ సీన్స్ చూసి  అభిమానులు షాక్ అయ్యారు.

45
ట్విస్ట్ లు, టర్న్ లతో సాగే `లీడర్‌` మూవీ
Image Credit : X/@yoursthelegend

ట్విస్ట్ లు, టర్న్ లతో సాగే `లీడర్‌` మూవీ

'లీడర్' సినిమాలో లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. దురై సెంథిల్‌కుమార్ రూపొందించిన ఈ మూవీలో ఆండ్రియా, వీటీవీ గణేష్, శ్యామ్, అరంగంటి నిషా, మధురై ముత్తు వంటి  భారీస్టార్‌ కాస్టింగ్‌ నటించింది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా ఉన్నా, ఇంటర్వెల్ నుంచి సినిమా టాప్ గేర్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌ను అదిరిపోయే ట్విస్టులతో నింపి, ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా లెజెండ్ శరవణన్‌కు పక్కా కంబ్యాక్ అని చెప్పొచ్చు.

55
లీడర్‌ మూవీ మూడు రోజుల కలెక్షన్లు
Image Credit : X

లీడర్‌ మూవీ మూడు రోజుల కలెక్షన్లు

'లీడర్' సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో, చిత్ర యూనిట్ అఫీషియల్ కలెక్షన్ల వివరాలను ప్రకటించింది. వారి ప్రకారం, 'లీడర్' సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ నెలలో రిలీజైన తమిళ సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, అక్కడ కూడా కలెక్షన్లు పెరుగుతున్నాయి. శరవణన్‌ మూవీకి ఇంతటి స్థాయి వసూళ్లని ఎవరూ ఊహించలేదు. ఇదే జోరు కొనసాగితే ఇది వంద కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Biker 3 Days Collections: `బైకర్‌` 3 రోజుల కలెక్షన్లు.. రాజశేఖర్‌, శర్వానంద్‌ ల సినిమా హిట్‌ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
Recommended image2
Raakaasa Day 3 Box office: రాకాస మూవీ 3 రోజుల కలెక్షన్లు, బైకర్‌కి షాక్‌ ఇచ్చిన నిహారిక.. ర్యాంపేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved