- Home
- Entertainment
- Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్ క్రష్ ఇబ్బంది
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్ క్రష్ ఇబ్బంది
ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రష్మిక మందన్న, ఇటీవల నటుడు విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె వివాదానికి కేరాఫ్ గా నిలిచింది.
13

Image Credit : instagram
వివాదంలో రష్మిక మందన్నా
గతంలో పలు వివాదాల్లో నిలిచిన రష్మిక మందన్నా మరోసారి ఆమె కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హిందీలో ఆమె `కాక్ టెయిల్ 2` చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో F పదం వాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
23
Image Credit : instagram
కృతి సనన్‌పై రష్మిక కామెంట్
బాలీవుడ్ నటి కృతి సనన్‌ను పొగిడే క్రమంలో రష్మిక ఈ పదం వాడారు. తర్వాత వెంటనే క్షమాపణ చెప్పారు. రష్మిక మాటలు విని షాహిద్ కపూర్, కృతి సనన్ షాక్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దినేష్ విజన్, దర్శకుడు హోమీ అదజానియా పాల్గొన్నారు.
33
Image Credit : Instagram
షాహిద్ కపూర్ పట్టుకుంటే అసౌఖర్యానికి ఫీలైన రష్మిక
ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా మాట్లాడుతున్న సమయంలో షాహిద్ కపూర్ ఆమెని వెనకాల నుంచి పట్టుకున్నాడు. దీంతో వెంటనే అసౌకర్యానికి గురయ్యింది రష్మిక. ఆయన చేతిని వదిలించుకునే ప్రయత్నం చేసింది. చాలా ఇబ్బంది పడుతూ రియాక్ట్ అయ్యింది. అయితే వెంటనే దాన్ని నవ్వుతో కవర్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Latest Videos

