MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే

Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ `పెద్ది`. బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. యాక్షన్‌, ఎమోషన్స్ బాగున్నాయి. కానీ అసలు మైనస్‌ ఏంటంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 18 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది సినిమా ట్రైలర్‌ వచ్చింది
Image Credit : Asianet News

పెద్ది సినిమా ట్రైలర్‌ వచ్చింది

రామ్‌ చరణ్‌ హీరోగా ప్రస్తుతం `పెద్ది` సినిమా రూపొందుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఇందులో రామ్‌ చరణ్‌ లుక్‌ మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంది. సినిమా కోసం ఆయన మేకోవర్‌ వాహ్‌ అనిపించేలా ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అదరగొడుతున్న రామ్‌ చరణ్‌ పెద్ది ట్రైలర్‌
Image Credit : Asianet News

అదరగొడుతున్న రామ్‌ చరణ్‌ పెద్ది ట్రైలర్‌

తాజాగా `పెద్ది` సినిమా ట్రైలర్‌ వచ్చింది. ఇందులో విభిన్నమైన అంశాలను చూపించారు. ట్రైలర్‌లో హీరో క్రికెట్‌, కుస్తీ, ఇంకా ఆట ఏదైనా అందులో పెద్దినే ముందుంటాడు, ఆయనే ఆల్‌రౌండర్‌ అనేలా చూపించారు. ఎవరిని అడిగినా నచ్చిన గేమ్‌ చెబుతున్నారు, అందులో నెంబర్‌ వన్‌ ఎవరంటే పెద్ది పేరు చెబుతున్నారు. ఇది అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రాంతం కోసం, తన మట్టి కోసం పెద్ది పోరాడుతాడనేది అంశాలను ఇందులో చూపించారు. అదే సమయంలో అథ్లెట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ట్రైలర్‌ చూస్తుంటే, సినిమాలో ఆట, యాక్షన్‌ మాత్రమే కాదు, అంతకు మించిన ఎమోషన్స్ ఉన్నాయి. పాత్రల సంఘర్షణ ఉంది. భావోద్వేగాలున్నాయి. ప్రతి పాత్రని ఇందులో చూపించారు. వాటి స్వరూపాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

Related Articles

Related image1
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Related image2
Karuppu 3 Days Collections: కంగువా లైఫ్‌టైమ్ కలెక్షన్లను 3 రోజుల్లో లేపేసిన కరుప్పు... బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డ్
35
రౌడీ బేబీలా జాన్వీ కపూర్‌
Image Credit : Asianet News

రౌడీ బేబీలా జాన్వీ కపూర్‌

అటవి ప్రాంతంలో మనుగడం కోసం పోరాటం అనేలా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఆటే నా పొగరు అని రామ్‌ చరణ్‌ చెప్పడం ఆయన పాత్రలోని యాటిట్యూడ్‌ని తెలియజేస్తుంది. అలాగే హీరోయిన్‌ని చూడగానే ఆయన ఫిదా అయిపోవడం, ఆమెతో రొమాన్స్ ఆకట్టుకుంది. ఇక జాన్వీ కపూర్‌ అందంగా ఉందేమోగానీ, పొగరు గట్టిగానే ఉందని, రౌడీ బేబీ తరహా పాత్రలో ఆమె కనిపించబోతుందని తెలుస్తోంది.

45
ఇంట్రెస్టింగ్‌ అంశాలతో పెద్ది ట్రైలర్‌
Image Credit : Asianet News

ఇంట్రెస్టింగ్‌ అంశాలతో పెద్ది ట్రైలర్‌

ఇక ఊరి పెద్ద తరహా పాత్రలో శివరాజ్‌ కుమార్‌ కనిపించారు. ఆట గెలవడం ముఖ్యం కాదు, బతకడం కావాలి అని ఆయన చెప్పడం ప్రాంతం కోసం పోరాటమనే విషయాన్ని తెలియజేస్తుంది. రామ్‌ చరణ్‌ అటు క్రికెట్‌లో, ఇటు కుస్తీలో, మరోవైపు రన్నింగ్‌ ఇలా అనేక ఆటల్లో నైపుణ్యం ఉందని, ఆయన తమ వారి కోసం ఆట ఆడుతున్నాడని తెలుస్తోంది. చివరగా నేను ఆడానని అనుకుంటున్నారు, కానీ నేను పోరాడాను సార్‌ అని రామ్‌ చరణ్‌ చెప్పే డైలాగ్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్‌లో చూపించనిది ఏదో ఉందని తెలుస్తోంది. చరణ్‌ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం, వీరి ఊర్లోకి రాజకీయ నాయకులు అడుగుపెట్టడం వంటి అంశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

55
జూన్‌ 4న పెద్ది రిలీజ్‌
Image Credit : Asianet News

జూన్‌ 4న పెద్ది రిలీజ్‌

ట్రైలర్‌ మాత్రం ఫర్వాలేదు. అయితే ఇందులో ఏం చూపించాలనుకున్నారనేది క్లారిటీ లేదు. చాలా విషయాలు చూపించడంతో సినిమా మెయిన్‌గా దేని చుట్టూ తిరుగుతుంది, దేని కోసం చరణ్‌ పోరాటమనేది క్లారిటీ మిస్ అయ్యింది. ట్రైలర్‌ లెన్తీగా ఉంది. కానీ ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. సినిమా చూడాలనే ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్‌ 4న విడుదల కానుంది. దీన్ని భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Sreeleela: క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో శ్రీలీల..?
Recommended image3
Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
Related Stories
Recommended image1
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Recommended image2
Karuppu 3 Days Collections: కంగువా లైఫ్‌టైమ్ కలెక్షన్లను 3 రోజుల్లో లేపేసిన కరుప్పు... బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved