- Home
- Entertainment
- Raakaasa Day 3 Box office: రాకాస మూవీ 3 రోజుల కలెక్షన్లు, బైకర్‌కి షాక్ ఇచ్చిన నిహారిక.. ర్యాంపేజ్
Raakaasa Day 3 Box office: రాకాస మూవీ 3 రోజుల కలెక్షన్లు, బైకర్‌కి షాక్ ఇచ్చిన నిహారిక.. ర్యాంపేజ్
Raakaasa Day 3 Box office: గత శుక్రవారం బాక్సాఫీసు వద్ద `రాకాస`, `బైకర్` సినిమాల మధ్య పోటీ నెలకొంది. రెండు చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ `బైకర్` చిత్రానికి ఝలక్ ఇస్తోంది `రాకాస`.

`రాకాస` థియేటర్లలో రచ్చ
`మ్యాడ్` చిత్రాలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు సంగీత్ శోభన్. ఇప్పుడు `రాకాస` చిత్రంతో రచ్చ చేస్తున్నాడు. తన మార్క్ కామెడీ, థ్రిల్లర్, ఫాంటసీ ఎలిమెంట్లతో రూపొందించిన చిత్రమిది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అలానే ఉన్నాయి. థియేటర్లలో రచ్చ చేస్తోంది.
రాకాస మూవీ మూడు రోజుల కలెక్షన్లు
`రాకాస` మూవీ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్ ఆడుతోంది. ఈ చిత్రానికి ఊహించని విధంగా భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం.. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.12కోట్లపైగా వసూళ్లని సాధించింది. ఇండియాలోనే పదికోట్లు దాటింది. దాదాపు ఆరు కోట్లకుపైగా షేర్‌ని సాధించింది. సోమవారం కూడా మంచి బుకింగ్స్ ఉన్నాయి. బుకింగ్ పరంగా, వసూళ్ల పరంగా మంచి హోల్డింగ్‌లో ఉంది. పెద్దగా తగ్గడం లేదు. ఇది ఈ మూవీకి దక్కుతున్న ఆదరణకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే చిత్ర బృందం తాజాగా కలెక్షన్లని అధికారికంగా ప్రకటించింది. దీనికి మూడు రోజుల్లో రూ.15.80కోట్లు వచ్చినట్టు తెలిపింది. అంటే ఎనిమిది కోట్ల వరకు షేర్ వచ్చిందని చెప్పొచ్చు.
రాకాస బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి మంచి బిజినెస్ అయ్యింది. దాదాపు రూ.13.50కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందని సమాచారం. ఇప్పటికే దాదాపు సగానికిపైగా కలెక్షన్లు వచ్చాయి. ఇంకా 5-6 కోట్ల షేర్ వస్తే సినిమా సేఫ్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇది కామెడీ చిత్రం కావడంతో ఈజీగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారం బాగా రన్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
బైకర్ కి షాక్ ఇచ్చిన రాకాస మూవీ
`రాకాస` మూవీ ఇప్పుడు `బైకర్`కి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇందులో పెద్ద స్టార్ కాస్టింగ్ లేదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్ట్ లు ఉన్నారు. పెద్ద బడ్జెట్ కూడా కాదు. కానీ `బైకర్` భారీ కాస్టింగ్‌తో వచ్చింది. శర్వానంద్, రాజశేఖర్ వంటి వారు కలిసి నటించారు. మాళవిక నాయర్‌కి కూడా మంచి ఇమేజ్ ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఇంతటి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్న మూవీకి చిన్న కామెడీ చిత్రం ఝలక్ ఇవ్వడం గమనార్హం. `బైకర్`, `రాకాస` ఒకే రోజు విడుదలయ్యాయి. కానీ శర్వానంద్ మూవీ కంటే సంగీత్ శోభన్ చిత్రానికి ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. ఇదే కంటెంట్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
రాకాస మూవీ కథ ఏంటంటే?
రాకాస మూవీ విషయానికి వస్తే ఇందులో సంగీత్ శోభన్ తన లవర్ కోసం అమెరికా నుంచి వస్తాడు. కానీ ఆమెకి తనముందే పెళ్లి అవుతుంది. ఆ బాధలో బాగా తాగి కోట వద్ద పడిపోతాడు. అక్కడే వెన్నెల కిశోర్ మిస్ అవుతాడు. దీంతో సంగీత్ శోభన్ చంపాడని ఊరంతా భావించి అతనికి ఊరు బహిష్కరణ శిక్ష వేస్తారు. ఆ ఊర్లో ఓ పెద్ద కోట ఉంటుంది. అందులో రాక్షసి ఉంటుంది. దానికి ఒకరిని బలి ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే అది ఊరిమొత్తాన్ని వల్లకాడు చేస్తుంది. ఓ సారి తన స్నేహితుడు గెటప్ శ్రీను కోసం తాను బలి కావడానికి కోటలోకి వెళ్తాడు సంగీత్. అక్కడ తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అందులోనే నిజంగానే రాక్షసి ఉందా? అందులోకి గెటప్ శ్రీను, నయన సారిక ఎందుకు వెళ్లారు? వెన్నెల కిశోర్ అందులో ఎందుకున్నాడు అనేది మిగిలిన సినిమా. ఆద్యంతం కామెడీగా ప్రారంభమై, థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుంటుంది. ఫాంటసీ ఎలిమెంట్లతో ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్‌ని, కామెడీని మిక్స్ చేసి ఈ మూవీని బాగా రూపొందించారు. ఈ రెండు ఎలిమెంట్లు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

