MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Biker 3 Days Collections: `బైకర్‌` 3 రోజుల కలెక్షన్లు.. రాజశేఖర్‌, శర్వానంద్‌ ల సినిమా హిట్‌ కావాలంటే ఎంత రాబట్టాలంటే?

Biker 3 Days Collections: `బైకర్‌` 3 రోజుల కలెక్షన్లు.. రాజశేఖర్‌, శర్వానంద్‌ ల సినిమా హిట్‌ కావాలంటే ఎంత రాబట్టాలంటే?

శర్వానంద్‌, రాజశేఖర్‌ కలిసి నటించిన `బైకర్‌` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 06 2026, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బైకర్‌ మూవీ బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ బాక్సాఫీసు రిపోర్ట్

శర్వానంద్‌ ఈ శుక్రవారం `బైకర్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అభిలాష్‌ రెడ్ది దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించింది. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. తెలుగులో బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. పైగా రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే శర్వానంద్‌ చివరి మూవీ `నారీ నారీ నడుమ మురారి` మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో ఈ మూవీపై ఆ బజ్‌ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బైకర్‌ మూవీకి నెగటివ్‌ టాక్‌
Image Credit : Asianet News

బైకర్‌ మూవీకి నెగటివ్‌ టాక్‌

శుక్రవారం(ఏప్రిల్‌ 3)న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మాత్రం ఆడియెన్స్ ని అలరించడంలో విఫలమయ్యింది. చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది.  అయితే సినిమా బాగుందని టీమ్‌ వెల్లడించింది. నెగటివ్ రివ్యూలపై కూడా విరుచుకుపడ్డారు. కానీ ఆడియెన్స్ నుంచి మాత్రం పెద్దగా ఆదరణ లేదు. ఈ మూవీకి కలెక్షన్లు చాలా డల్‌గా ఉన్నాయి. శర్వానంద్‌ గత చిత్రం `నారీ నారీ నడుమ మురారి`తో పోల్చితే చాలా తక్కువగా కలెక్షన్లు ఉన్నాయి. సగానికిపైగా తక్కువగా ఉండటం గమనార్హం.

35
బైకర్‌ మూవీ మూడు రోజుల కలెక్షన్లు
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ మూడు రోజుల కలెక్షన్లు

`బైకర్‌` మూవీ మూడు రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలనేది చూస్తే. ఈ చిత్రం మూడో రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ.7.30కోట్ల నెట్‌ కలెక్షన్లని రాబట్టింది. మొదటి రోజు రూ.2.80కోట్లు, రెండో రోజు రూ.2.33కోట్లు, మూడో రోజు రూ.2.14కోట్లు వసూలు చేసింది. ఇండియా గ్రాస్‌ కలెక్షన్లు రూ.8.51 కోట్లు కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇది మూడు రోజుల్లో రూ.9.71కోట్లు వసూలు చేసింది. అంటే దాదాపు ఐదు కోట్ల షేర్‌ సాధించింది.

45
బైకర్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`బైకర్‌` మూవీకి థియేట్రికల్‌ బిజినెస్‌ సుమారు రూ.20కోట్లు అని సమాచారం. ఈ మూవీ హిట్‌ కావాలంటే రూ.21కోట్ల షేర్‌ రావాలి. అంటే సుమారు రూ.40కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. ఇప్పటి వరకు పది కోట్ల వరకు సాధించింది. ఇంకా ముప్పై కోట్ల గ్రాస్‌ వసూలు చేయాల్సి ఉంది. సోమవారం బుకింగ్స్ చూస్తే చాలా డల్‌గా ఉంది. కోటీ కూడా లేదు. అంటే సగానికి సగం పడిపోయింది. సోమవారం కలెక్షన్లని బట్టి ఈ మూవీ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. మరి ఇది ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.

55
బైకర్‌ మూవీ కథ ఇదే
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ కథ ఇదే

`బైకర్‌` మూవీ కథేంటనేది చూస్తే, ఇందులో శర్వానంద్‌ బైకర్‌ రేసర్‌. వాళ్ల నాన్న రాజశేఖర్‌. ఆయన ఒకప్పుడు ఇండియాకి బైక్‌ రేసింగ్‌ అంటే చూపించారు. దానికంటూ ఒక గుర్తింపుని తీసుకొస్తారు. దీంతో తన కొడుకుని ఛాంపియన్‌గా చూడాలనుకుంటాడు. స్థానికంగా అన్నింటిలోనూ గెలిచిన శర్వానంద్‌ ఫైనల్స్ కి ముందు రేస్‌ నుంచి తప్పుకుంటాడు. దీంతో రాజశేఖర్‌ పరువు పోతుంది. ఇద్దరు దూరమవుతారు. మరి శర్వానంద్‌ ఎందుకు రేసింగ్‌ నుంచి తప్పుకుంటాడు? అసలు ఏం జరిగింది? మళ్లీ ఎందుకు కమ్‌బ్యాక్‌ అయ్యాడనేది కథ. ఇందులో మాళవిక శర్వానంద్‌ కి లవర్‌గా, భార్యగా కనిపించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image2
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image3
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఛాలెంజ్‌
Recommended image2
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved