MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ మూవీలో ఆ పాత్రలో నటించమన్నందుకు ఏడ్చేసిన హీరోయిన్.. అలా అడిగేసరికి ఫీలయ్యా అంటూ..

బాలకృష్ణ మూవీలో ఆ పాత్రలో నటించమన్నందుకు ఏడ్చేసిన హీరోయిన్.. అలా అడిగేసరికి ఫీలయ్యా అంటూ..

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2025, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెన్నకేశవ రెడ్డి మూవీ
Image Credit : Instagram

చెన్నకేశవ రెడ్డి మూవీ

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య మాస్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏడ్చేసిన హీరోయిన్ లయ
Image Credit : Instagram

ఏడ్చేసిన హీరోయిన్ లయ

ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలకృష్ణ చెల్లెలు పాత్ర కోసం హీరోయిన్ లయని అడిగాం. బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించాలి అనే చెప్పేసరికి ఆమె ఏడ్చేసింది. ఎంత తెలుగు హీరోయిన్ అయితే మాత్రం చెల్లెలి పాత్రకి అడుగుతారా అని ఫీల్ అయిందట. దీంతో తాము మరో నటిని ఆ పాత్రలో ఎంపిక చేసుకున్నట్లు వివి వినాయక్ తెలిపారు.

35
లయ రియాక్షన్ ఇదే
Image Credit : Instagram

లయ రియాక్షన్ ఇదే

వివి వినాయక్ కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ స్పందించింది. వివి వినాయక్ చెప్పినట్లు నేను ఏడవలేదు కానీ ఫీలయిన మాట వాస్తవం. అప్పుడేం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదు. నాకు గుర్తున్నంతవరకు చెల్లెలి పాత్రకి అడిగినందుకు బాధపడ్డాను. ఎందుకంటే ఆ టైంలో ఒక హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటిస్తే కెరీర్ ముగిసిపోతుంది. హీరోయిన్ గా ఎవరూ తీసుకోరు. అందువల్లే తాను బాధపడినట్లు లయ పేర్కొంది.

45
తమ్ముడు మూవీలో నితిన్ కి అక్క పాత్రలో..
Image Credit : Instagram

తమ్ముడు మూవీలో నితిన్ కి అక్క పాత్రలో..

చాలా ఏళ్ల తర్వాత లయ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న తమ్ముడు చిత్రంలో లయ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో ఆమె నితిన్ కి అక్క పాత్రలో నటిస్తుండడం విశేషం. అక్క ఇచ్చిన మాటని నిలబెట్టే తమ్ముడి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. చాలా ఏళ్ల క్రితం చెన్నకేశవరెడ్డి చిత్రంలో సోదరి పాత్రని రిజెక్ట్ చేసిన లయ ఇప్పుడు అదే తరహా పాత్రతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ చిత్రంలో తాను అక్క పాత్రలో నటిస్తున్నప్పటికీ చాలా వైవిధ్యంగా ఉంటుందని లయ పేర్కొంది.

55
తమ్ముడు ట్రైలర్ కి క్రేజీ రెస్పాన్స్
Image Credit : Instagram

తమ్ముడు ట్రైలర్ కి క్రేజీ రెస్పాన్స్

ఇటీవల విడుదలైన తమ్ముడు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా లయ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. జూలై 4న తమ్ముడు చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అంజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

లయ రీఎంట్రి ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ఒకవైపు ఉంటే మరోవైపు హీరో నితిన్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే నితిన్ గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. నితిన్ నటించిన ఎక్స్ట్రా, రాబిన్ హుడ్ చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Shah Rukh Khan Net Worth: షారుఖ్ ఖాన్ 10 వేల కోట్ల సామ్రాజ్యం.. రెడ్ చిల్లీస్ నుంచి KKR వరకు!
Recommended image2
Ramayana Movie: రామాయణ మూవీపై యష్ కొడుకు రియాక్షన్.. నాన్న అలా చేయడం నచ్చలేదు
Recommended image3
Rohith Naidu: టాప్ 2 లో ఉండాల్సినోడు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు..స్వయంగా చేసిన తప్పులా, బిగ్ బాస్ ప్లానింగా ?
Related Stories
Recommended image1
ధనుష్ కి చేతులెత్తి దండం పెడతా, స్టార్ హీరోలంతా ఆ పని చేయాలి.. తనికెళ్ళ భరణి ఎమోషనల్ కామెంట్స్
Recommended image2
డైరెక్టర్ చెప్పకపోయినా సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ పాట పాడిన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved