MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • డైరెక్టర్ చెప్పకపోయినా సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ పాట పాడిన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీ హిట్

డైరెక్టర్ చెప్పకపోయినా సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ పాట పాడిన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీ హిట్

ఓ చిత్రంలో చిరంజీవి సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ సూపర్ హిట్ సాంగ్ పాడారు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ ఏంటి ? ఆ సీనియర్ నటి ఎవరు ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2025, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్
Image Credit : Instagram

చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. 80 దశకం చివర్లో, 90వ దశకం ప్రారంభంలో చిరంజీవి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలుగా నిలిచాయి. చిరంజీవి, విజయశాంతి కలిసి నటిస్తే బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అన్నట్లుగా అప్పట్లో ఫ్యాన్స్ లో సెంటిమెంట్ ఉండేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ
Image Credit : Instagram

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ

పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందింది. చిరంజీవితో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకుడు కోదండరామిరెడ్డి అనే సంగతి తెలిసిందే. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు.

35
పోటీపడి నటించిన చిరంజీవి, వాణిశ్రీ
Image Credit : Instagram

పోటీపడి నటించిన చిరంజీవి, వాణిశ్రీ

ఈ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒక విశేషం అయితే.. చిరంజీవికి అత్త పాత్రలో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ నటించడం మరో విశేషం. చిరంజీవి, వాణిశ్రీ ఈ చిత్రంలో పోటాపోటీగా అద్భుతంగా నటించారు. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం సాగే సన్నివేశాలు ఈ మూవీలో అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రానికి సీనియర్ రచయిత సత్యానంద్ రచయితగా పనిచేశారు. చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు ఆయన రచయితగా వర్క్ చేశారు.

45
ఏఎన్నార్ పాట పాడిన చిరు 
Image Credit : our own

ఏఎన్నార్ పాట పాడిన చిరు 

ఒక సందర్భంలో చిరంజీవి.. సత్యానంద్ కి గోల్డ్ నిబ్ ఉన్న పెన్నుని గిఫ్ట్ గా ఇచ్చారట. వీళ్ళిద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఓ ఇంటర్వ్యూలో సత్యానంద్ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో చిరంజీవి మెట్లు దిగుతూ వాణిశ్రీ ని చూసి అల్లరి చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో సత్యానంద్ ఎలాంటి డైలాగ్స్ రాయలేదట. వాణిశ్రీని చూస్తూ చిరంజీవి అల్లరి చేస్తున్నట్లుగా మెట్లు దిగాలి. సన్నివేశంలో అదే ఉంది. ఎలాంటి డైలాగ్ చెప్పకుండా అల్లరిగా కనిపించాలని డైరెక్టర్ తెలిపారు.

కానీ చిరంజీవి మెట్లు దిగుతూ.. వాణిశ్రీని టీజ్ చేస్తూ ఏఎన్ఆర్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి పాడారు. ఆ పాట మరేదో కాదు.. వాణిశ్రీ, ఏఎన్ఆర్ నటించిన బంగారు బాబు చిత్రంలోని  'చెంగావి రంగు చీర' అనే సాంగ్ అది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాణిశ్రీ ఉద్దేశిస్తూ ఆ పాట పాడితే ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అలా చేశారట.

55
అందుకే మెగాస్టార్ అయ్యారు 
Image Credit : Instagram

అందుకే మెగాస్టార్ అయ్యారు 

ఏ సన్నివేశంలో ఏది అవసరమనేది చిరంజీవికి చాలా బాగా తెలుసు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అని సత్యానంద్ తెలిపారు. ఈ మూవీలో కైకాల సత్యనారాయణ, రావు గోపాల్ రావు, గిరిబాబు, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత తమిళంలో రజనీకాంత్, హిందీలో అనిల్ కపూర్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఫాన్స్ లో అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. మరోవైపు విశ్వంభరా చిత్రం కూడా రిలీజ్ కావలసి ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ ఆలస్యం అవుతుండడంతో రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. జానపద కథాంశం, సూపర్ నేచురల్ అంశాలతో దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వశిష్ట చివరగా బింబిసారా చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
ధనుష్ కి చేతులెత్తి దండం పెడతా, స్టార్ హీరోలంతా ఆ పని చేయాలి.. తనికెళ్ళ భరణి ఎమోషనల్ కామెంట్స్
Recommended image2
రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళడానికి భయపడిన నాగార్జున.. ఎందుకో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved