ధనుష్ 'కుబేర' ఓటీటీ హక్కులకు రికార్డ్ డీల్, ఎంతకి కొన్నారో తెలుసా ?
రష్మిక మందన్న, ధనుష్ నటించిన 'కుబేరా' సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
14

Image Credit : our own
ధనుష్ 'కుబేరా' సినిమా
ధనుష్ 'కుబేరా' సినిమా రిలీజ్ కి ముందే కోట్లు సంపాదించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ ఒప్పందం ద్వారా సినిమా బడ్జెట్ లో సగం వెనక్కి వచ్చేసింది. రణ్బీర్ కపూర్ తో 'అనిమల్', అల్లు అర్జున్ తో 'పుష్ప 2', విక్కీ కౌశల్ తో 'సామ్ బహదూర్' సినిమాల్లో నటించిన రష్మిక, 'కుబేరా'లో ధనుష్ తో జతకట్టింది.
24
Image Credit : our own
కుబేర ఓటీటీ రైట్స్
'కుబేరా' డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం దక్షిణాది సినిమా పరిశ్రమలోనే అతిపెద్ద ఓటీటీ ఒప్పందాల్లో ఒకటి. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత, కొంతకాలానికి ఓటీటీలో విడుదల అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
34
Image Credit : our own
జూన్ 20న థియేటర్లలో..
'కుబేరా' ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.120 కోట్లు. ధనుష్, రష్మిక తో పాటు నాగార్జున, జిమ్ సార్బ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతుంది. కుబేరా సినిమాలో ధనుష్ 'దేవా' అనే పాత్రలో నటించాడు. ఈ సినిమా తెలుగు హక్కులను రోమియో పిక్చర్స్ కొనుగోలు చేసింది.
44
Image Credit : Social Media
జోరుగా రష్మిక కెరీర్
రష్మిక కెరీర్ బాగానే సాగుతోంది. ఆమె నటించిన 'మిషన్ మజ్ను' ప్లాప్ అయినా, ఆ ముందు వరుస హిట్లు కొట్టింది. ఈ ఏడాది 'మిషన్ మజ్ను' తో పాటు 'సామ్ బహదూర్' లో కూడా నటించింది. తర్వాత 'కుబేరా' లో నటిస్తోంది.
Latest Videos