MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఘనంగా సూర్య, వెంకీ అట్లూరి మూవీ లాంచ్..ముఖ్యఅతిథిగా హాజరైన త్రివిక్రమ్

ఘనంగా సూర్య, వెంకీ అట్లూరి మూవీ లాంచ్..ముఖ్యఅతిథిగా హాజరైన త్రివిక్రమ్

వరుస పరాజయాల తర్వాత సూర్య మరో చిత్రాన్ని ప్రారంభించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించబోయే తొలి స్ట్రైట్ తెలుగు మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 19 2025, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూర్య, వెంకీ అట్లూరి మూవీ లాంచ్
Image Credit : Asianet News

సూర్య, వెంకీ అట్లూరి మూవీ లాంచ్

విలక్షణ నటనతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య చేతులు కలిపారు. కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.ప్రారంభోత్సవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ముహూర్తం షాట్ పై ఆయన క్లాప్ ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్
Image Credit : Asianet News

లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్

ఈ తరంలో అత్యంత ప్రతిభగల దర్శకులలో ఒకరిగా వెంకీ అట్లూరి పేరు తెచ్చుకున్నారు. భావోద్వేగ లోతును, వాణిజ్య విలువలను చక్కగా మిళితం చేసే కథకులలో వెంకీ అట్లూరి ఒకరు. సార్, లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుస ఘన విజయాలను సొంతం చేసుకొని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో అద్భుతమైన కథతో అలరించడానికి సూర్యతో చేతులు కలిపారు.

35
సూర్యకి తెలుగులో తొలి స్ట్రైట్ మూవీ
Image Credit : Asianet News

సూర్యకి తెలుగులో తొలి స్ట్రైట్ మూవీ

తెలుగునాట సూర్యకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కెరీర్ ను మలుపుతిప్పిన 'గజిని' సినిమా నుంచి భారీస్థాయిలో అభిమానులను ఏర్పరచుకున్నారు. పాత్రలు, కథల ఎంపికలో వైవిధ్యం చూపించే సూర్య.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న తన 46వ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి సన్నద్ధమవుతున్నారు. తెలుగులో సూర్య నటిస్తున్న తొలి స్ట్రైట్ మూవీ ఇదే. 

ప్రేమలు చిత్రంతో యువతకు చేరువైన యువ సంచలనం మమిత బైజు కథానాయికగా నటిస్తుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి పునఃప్రవేశం చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

45
జీవి ప్రకాష్ సంగీతం
Image Credit : Asianet News

జీవి ప్రకాష్ సంగీతం

ఇటీవల సార్, లక్కీ భాస్కర్, అమరన్, వీర ధీర సూరన్ చిత్రాలకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించి విలక్షణమైన సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు జి.వి. ప్రకాష్ కుమార్. ఇప్పుడు వెంకీ అట్లూరితో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వెంకీ అట్లూరి గత చిత్రాలు సార్, లక్కీ భాస్కర్ విజయాల్లో జి.వి. ప్రకాష్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాబోయే సూర్య చిత్రంలో భావోద్వేగం, మాస్ అప్పీల్‌ను మిళితం చేసే సౌండ్‌ట్రాక్‌తో ఆ ట్రెండ్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.

55
త్వరలో షూటింగ్
Image Credit : Asianet News

త్వరలో షూటింగ్

ఈ చిత్రానికి కొందరు ప్రముఖులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ కు పేరుగాంచిన నిమిష్ రవి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఎడిటర్ గా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకుడిగా బంగ్లాన్ వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చే చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Related Stories
Recommended image1
కొత్త ఇంట్లో భావోద్వేగానికి గురైన అనసూయ, ఆ పేరు వెనుక ఎమోషనల్ స్టోరీ
Recommended image2
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved