MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • తన తొలి చిత్రంతోనే ఎస్వీ రంగారావుకి మైండ్ బ్లాక్ చేసిన కృష్ణంరాజు..3 గంటల్లో మొత్తం ఫినిష్

తన తొలి చిత్రంతోనే ఎస్వీ రంగారావుకి మైండ్ బ్లాక్ చేసిన కృష్ణంరాజు..3 గంటల్లో మొత్తం ఫినిష్

నేడు జూలై 3 న ఆయన జయంతి కావడంతో ఎస్వీ రంగారావు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2025, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Facebook

తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండ్రీ నటులలో ఎస్వీ రంగారావు ఒకరు. ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగ్ డెలివరీలో ఎస్వీ రంగారావు కి సాటి లేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. జానపద చిత్రమైనా, పౌరాణిక చిత్రమైనా, సాంఘిక చిత్రమైనా పాత్రలో ఒదిగిపోయి నటించడం ఎస్వీ రంగారావు శైలి. వేగంగా క్లారిటీతో డైలాగులు చెప్పడం ఆయన ప్రత్యేకత. నేడు జూలై 3 న ఆయన జయంతి కావడంతో ఎస్వీ రంగారావు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

కృష్ణంరాజు నటించిన తొలి చిత్రం చిలకా గోరింకా. ఈ మూవీ ప్రత్యగాత్మ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో కృష్ణంరాజు, కృష్ణకుమారి ప్రధాన పాత్రలో నటించారు. ఎస్వీ రంగారావు, అంజలీదేవి కీలక పాత్రల్లో నటించారు. కృష్ణంరాజుకి ఇదే తొలి చిత్రం కావడంతో ఎలా నటిస్తాడు అని అనుమానం అందరిలో ఉండేది.

Related Articles

Related image1
కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు
Related image2
గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా
35
Image Credit : our own

తొలి రోజు షూటింగ్ లోనే ఎస్.వి.రంగారావుతో కలిసి నటించాల్సిన సన్నివేశాలని చిత్రీకరించారు. ఒక సన్నివేశానికి కనీసం ఒకటిన్నర రోజు సమయం పడుతుంది అని కృష్ణంరాజు తెలిపారు. మరుసటి రోజు ఎస్వి రంగారావు వేరే పని ఉండడంతో షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోవాలి. కానీ అంత త్వరగా షూటింగ్ పూర్తవుతుందా అంటే అది అనుమానమే. చిత్ర యూనిట్ విషయం చెప్పడంతో ఏం పర్వాలేదు నేను ఇటు నుంచి ఇటే ఊరికి వెళ్తాను.. షూటింగ్ పూర్తి చేసే వెళతాను అని చెప్పారట.

45
Image Credit : Facebook

కృష్ణంరాజు కుర్రాడు పైగా తొలి చిత్రం కావడంతో ఎస్వీ రంగారావు ఆయనతో ఒక మాట అన్నారు. నాలాగా వేగంగా డైలాగులు చెప్పాలని టెన్షన్ పడిపోకు. నీకు అర్థమయ్యేలా నీ లెవెల్ కి వచ్చి నెమ్మదిగా డైలాగులు చెబుతాను. టెన్షన్ పడకుండా నటించు అని కృష్ణంరాజుకి ఎస్వీ రంగారావు సలహా ఇచ్చారట. కానీ కృష్ణంరాజు ఎస్వీ రంగారావుకి మైండ్ బ్లాక్ చేశారు.

55
Image Credit : Facebook

కనీసం ఒకటిన్నర రోజు చిత్రీకరించాల్సిన సన్నివేశం కేవలం మూడు గంటల్లో పూర్తయిపోయింది. ఎస్వీ రంగారావుకి పోటీగా కృష్ణంరాజు అద్భుతంగా నటించారట. వాళ్ళిద్దరూ అంత అద్భుతంగా నటిస్తుండడంతో దర్శకుడు కెమెరామెన్, ఇతరు యూనిట్ కూడా వేగంగా పనిచేసే మూడు గంటల్లో షూటింగ్ ఫినిష్ చేసేసారు. 

షూటింగ్ పూర్తయ్యాక ఎస్వీ రంగారావు దర్శకుడు ప్రత్యగాత్మను పిలిచి.. కృష్ణంరాజు గురించి ఇలా అన్నారట. గొప్పోడిని పట్టావయ్యా.. వీడు భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదుగుతాడు అని అన్నారట.  షూటింగ్ లోకేషన్ నుంచి ఆయన ఊరికి వెళ్లే వరకు చాలామందితో కృష్ణంరాజు నటన గురించి చెప్పి అభినందించారట. ఆ విధంగా కృష్ణంరాజు తన తొలి చిత్రంతోనే ఎస్వీ రంగారావు లాంటి లెజెండ్ దగ్గర ప్రశంసలు అందుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణంరాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Recommended image3
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు
Recommended image2
గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved