- Home
- Entertainment
- కృష్ణ కి చుక్కలు చూపించిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ ను కట్టడి చేయడానికి సూపర్ స్టార్ ఏం చేశాడు?
కృష్ణ కి చుక్కలు చూపించిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ ను కట్టడి చేయడానికి సూపర్ స్టార్ ఏం చేశాడు?
Chiranjeevi vs Krishna : సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ను ఏలుతున్న టైమ్ లో.. చిరంజీవి సినిమా ఒకటి ఆయన్ను భయపెట్టిందని మీకు తెలుసా? కృష్ణను ఆలోచనలోపడేసిన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి?

కృష్ణ - చిరంజీవి బాక్సాఫీస్ వార్..
1980 - 90 వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి మధ్య ఎన్నో సార్లు బాక్సాఫీస్ వార్ జరిగింది. కానీ .. 80ల కాలంలో చిరంజీవి ఎదుగుతున్న సమయంలో కృష్ణ తోనే ఎక్కువగా మూవీ క్లాష్ లు జరిగేవి. ఒకే సమయంలో వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అంత పోటీ ఉన్నా కానీ.. ఈ ఇద్దరు హీరోల మధ్య మాత్రం ఘర్షణ జరిగిన సందర్భాలు లేవు.. వీరి మధ్య మంచి స్నేహపూర్వక సంబంధం ఉండేది. హీరోగా ఎదుగుతున్న చిరంజీవికి అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్ గా నిలబడ్డాడు.
చిరంజీవి కోసం రెండు సినిమాలు వదులుకున్న కృష్ణ
మెగాస్టార్ కోసం ఆయన రెండు సినిమాలు కూడా వదిలేసుకున్నారని సమాచారం. ఇక 1984 లో అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు 7 సార్లు బక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు.ఇద్దరు సినిమాలు విపరీతంగా ఆడేవి. హిట్ అయ్యేవి. కానీ కృష్ణను భయపెట్టి, ఆలోచలో పడేసిన చిరంజీవి సినిమా మాత్రం ఒకటి ఉంది. అదేదో కాదు ఖైదీ.
చిరంజీవి దూకుడు తట్టుకోడానికి..
అప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న చిరంజీవి.. కృష్ణ ను గౌరవించేవారు. చిరంజీవి స్టార్‌డమ్‌ను కృష్ణ కూడా గౌవరించేవారు. అయితే మెగాస్టార్ దూకుడిని తట్టుకుని నిలబడి, సినిమాలు చేయడానికి సూపర్ స్టార్ కు సాలిడ్ హిట్ అవసరం అయ్యింది. అది చిరంజీవికి పోటీగా కాదు, కృష్ణ తన ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం.. అభిమానుల్లోో ఉత్సాహం నిపండం కోసం.. అద్భుతమైన సినిమా చేయాలి అనుకున్నాడు. 1983 లో వచ్చిన చిరంజీవి ఖైదీ సినిమా.. సూపర్ స్టార్ లో భయాన్ని కలిగించింది. అప్పటి వరకూ టాలీవుడ్ ను ఊపేసిన కృష్ణ.. తన ప్రభావం తగ్గినట్టు గుర్తించాడు.. మరో పదేళ్లు ఫామ్ లో ఉండేలా.. ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిరంజీవి సినిమా..
చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఖైదీ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఈమూవీ అప్పటి హీరోలందరిలో ఓ భయన్ని సృష్టించింది. మెగాస్టార్ సినీజీవితానికి పునాది వేసిన ఈసినిమా.. 25 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి.. అప్పట్లోనే దాదాపుగా 4 కోట్లు వసూలు చేసి అఖండ విజయం సాధించింది. అంతే కాదు 20 కేంద్రాల్లో 100 రోజులు నడిచి, సంచలనం సృష్టించింది. చిరంజీవికి వరుస అవకాశాలు కూడా తీసుకువచ్చింది.
చిరంజీవిని వరించిన అదృష్టం..
నిజానికి ఖైదీ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సి ఉంది. ఈ కథను కృష్టా కోసం అనుకున్నారు దర్శకుడు కోదండరామిరెడ్డి. కానీ ఆయన అప్పటికే వరుస సినిమాలు చేస్తుదండటం.. కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో.. ఈమూవీ చిరంజీవి దగ్గరకు వెళ్లింది. చిరంజీవి ఈ సినిమా చేయకుండా ఉన్నా.. కృష్ణ కాస్త ఖాళీ చేసుకుని ఖైదీ సినిమా చేసినా.. పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చుండేవి. మెగాస్టార్ ఈసినిమా చేయబట్టే.. ఆయన కెరీర్ పరుగులు పెట్టింది. ఇక కృష్ణ ఖైదీ సినిమా ప్రభంజనం తట్టుకుని నిలబడటానికి మరో సాలిడ్ హిట్ కోసం చూడాల్సి వచ్చింది.
సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్..
చిరంజీవి ప్రభంజనం తట్టుకోవడం కోసం.. కృష్ణ చాలా పెద్ద సాహసమే చేశాడు. భారీ బడ్జెట్ తో.. మునుపెన్నడు లేని విధంగా.. కొత్త టెక్నాలజీని ఉపయోగించి సింహాసనం నినిమాను చేశాడు. అందుకోసం తన ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరీ.. ఈసినిమాన నిర్మించాడు కృష్ణ. అంతే కాదు మొదటి సారి మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ కూడా చేశాడు సూపర్ స్టార్. ఎంతో మంది ఇది వర్కౌట్ అవ్వదు.. ఇబ్బందులు పడతావ్ అన్నా కానీ.. లెక్క చేయకుండా ముందు కు దూసుకుపోయాడు కృష్ణ. ఆయన కష్టం వృధా పోలేదు... సింహాసనం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కృష్ణ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే.. . ఈ సినిమా దెబ్బకు మరో పదేళ్లు కృష్ణకు తిరుగులేకుండా పోయింది.
టాలీవుడ్ లో కృష్ణ మార్క్..
టాలీవుడ్ లో తన మార్క్ చూపించుకోవడం కోసం కృష్ణ చాలా ప్రయోగాలు చేశాడు. తెలుగు పరిశ్రమను కొత్తదనం వైపు నడిపించాడు. కొత్త టెక్నాలజీలు పరిచయం చేశాడు. డిఫరెంట్ జానర్ లో సినిమాలు ప్రయత్నించాడు. యాక్షన్ సీన్స్, కౌబాయ్ మూవీస్, జేమ్స్ బాండ్ మూవీస్, కలర్ స్క్రీన్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ తో పాటు.. రకరకాల పాత్రను ప్రయత్నించి.. తెలుగు ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు.

