MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?

పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీపడి... బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డ మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఏంత? ఇంతకీ పోటీపడ్డ రెండు సినిమాలేంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 02 2026, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల పోరు..
Image Credit : facebook.com/IFOPK

బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల పోరు..

భాష ఏదైనా.. బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల మధ్య పోటీ కామన్ గా జరుగుతుంటుంది. టాలీవుడ్ లో కూడా పెద్ద పెద్దహీరోల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యి.. గెలుపోటములు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సంక్రాంతికి కూడా ప్రభాస్, చిరంజీవి సంక్రాంతి బరిలో దిగబోతున్నసంగతి తెలిసిందే. అయితే వార్ లో ఎవరో ఒకరు గెలవాల్సిందే. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల మధ్య కూడా ఇలాంటి బాక్సాఫీస్ వారే జరిగింది. ఈ వార్ లో పవన్ కళ్యాణ్ సినిమా భారీ కలెక్షన్లు సాధించగా.. మహేష్ బాబు సినిమా చావు దెబ్బ తిన్నది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోలు పోటీ పడ్డది ఎప్పుడో కాదు.. రీసెంట్ గానే.. ఇంతకీ ఆ సినిమాలేంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్...
Image Credit : facebook.com/IFOPK

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్...

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో ఎంతో మంది హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతుండగా.. వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు మాత్రమే అందరికంటే ఎక్కువగా రీరిలీజ్ అవుతూ.. ఎక్కువ స్పందనను అందుకుంటున్నాయి. ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, వీరిద్దరి క్లాసిక్ సినిమాల రీ రిలీజ్‌లకు మాత్రమే థియేటర్ల వద్ద ఎక్కువ స్పందన కనిపిస్తోంది. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు.

35
బాక్సాఫీస్ దగ్గర పవన్ - మహేష్ పోటీ..
Image Credit : Asianet News

బాక్సాఫీస్ దగ్గర పవన్ - మహేష్ పోటీ..

ఈ క్రమంలో తాజాగా పవన్, మహేష్ రీరిలీజ్ సినిమాలు రెండు డిసెంబర్ 31న బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఒకే రోజు విడుదలైన రెండు క్లాసిక్ సినిమాలు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మహేష్ బాబు కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘మురారి’ , పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా గుర్తింపు పొందిన ‘జల్సా’ చిత్రాలు 4K వెర్షన్స్ లో ఒకే రోజు రీ రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది.

45
జల్సా సినిమా కలెక్షన్స్..?
Image Credit : X/@PawanismNetwork

జల్సా సినిమా కలెక్షన్స్..?

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రీ రిలీజ్ పోటీలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. జల్సా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాం నుంచి సుమారు 50 లక్షల రూపాయల గ్రాస్ రాగా, సీడెడ్ , కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి మరో 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ మొత్తం వసూళ్లు కేవలం ఇండియా వ్యాప్తంగా వేసిన 180 షోస్ నుంచే రావడం విశేషం.ఈ స్థాయి వసూళ్లను పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ముందుగా ఊహించి ఉండరు. అయితే ఈ సినిమా రీరిలీజ్ ఇది మొదటిసారి కాదు.. రెండో సారి. ఇక జల్సా మొత్తం రీ రిలీజ్ వసూళ్లు చూసుకుంటే.. మొదటి రీ రిలీజ్‌లో ఈ సినిమాకు 3 కోట్ల 23 లక్షల గ్రాస్ వచ్చింది. తాజా రెండవ రీ రిలీజ్‌లో వచ్చిన కోటి రూపాయలతో కలిపితే, మొత్తం గ్రాస్ 4 కోట్ల 23 లక్షల రూపాయలకు చేరింది.

55
సెకండ్ రీరిలీజ్ లో తేలిపోయిన మురారి..
Image Credit : @maheshbabufans

సెకండ్ రీరిలీజ్ లో తేలిపోయిన మురారి..

మరోవైపు మురారి సినిమా విషయానికి వస్తే.. ఈసినిమా కూడా రెండో సారి రీరిలీజ్ చేశారు. ఈ రిలీజ్‌లో కేవలం 35 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లకే మహేష్ మూవీ పరిమితం అయ్యింది. ఎందుకంటే మురారి మొదటి రీ రిలీజ్‌లో 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాంటి చిత్రం రెండవసారి ఇంత తక్కువ వసూళ్లను రాబట్టడంపై సూపర్ స్టార్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా న్యూ ఇయర్ రీ రిలీజ్ రేస్‌లో జల్సా సినిమా విన్నర్ గా నిలిచింది..మురారి సినిమాను పక్కకు నెట్టింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved