- Home
- Entertainment
- కోట చివరి చిత్రం హరిహర వీరమల్లు ? గబ్బర్ సింగ్ లో పాట పాడింది అందుకా, కీరవాణి ఫిదా
కోట చివరి చిత్రం హరిహర వీరమల్లు ? గబ్బర్ సింగ్ లో పాట పాడింది అందుకా, కీరవాణి ఫిదా
కోట శ్రీనివాసరావు చివరి చిత్రం గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఆయన నటించిన చివరి చిత్రం రిలీజ్ కానుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

తన విలక్షణ నటనతో 750 పైగా చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు మరణం చిత్ర పరిశ్రమ మొత్తాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. సినీ రాజకీయ ప్రముఖులంతా తరలి వెళ్లి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు, సినీ లోకం ఆయనకి కన్నీటి వీడ్కోలు పలికారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు ఆయన నటించిన చిత్రాలని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు చివరి చిత్రం గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఆయన నటించిన చివరి చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో కోట మరణం బాధాకరం అనే చెప్పాలి. ఇంతకీ కోట నటించిన చివరి చిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు.ఈ మూవీ జూలై 24న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైనప్పుడు కోట కూడా నటించారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిష్ గారు మంచి డైరెక్టర్ ఆయన పిలిచి మూడు రోజుల షూటింగ్ ఉండే పాత్ర ఉందని చెప్పారు. ఆ పాత్రలో తాను నటించానని కోట ఖరారు చేశారు.
ఎడిటింగ్లో తొలగిపోకుంటే తప్ప కోట శ్రీనివాసరావు నటించిన చివరి చిత్రం హరిహర వీరమల్లు అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఆ మూవీలో కోట శ్రీనివాసరావు 'మందు బాబులం' అనే సాంగ్ ని పాడిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ వెనుక ఆసక్తికర విషయాన్ని ఆయన రివీల్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా ఆ పాటని అప్పటికే పాడేశారు. ఒకరోజు నన్ను డైరెక్టర్ హరీష్ శంకర్ స్టూడియోకి రమ్మని పిలిచారు. డబ్బింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో అని నేను వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బింగ్ కాదని.. ఒక పాట పాడాలని చెప్పారు. అక్కడే దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. సార్ నేను ఈ పాట పాడితే మీ స్క్రీన్ ప్రజెన్స్ కి మ్యాచ్ కావడం లేదు. మీది పెద్ద వయసు కనుక నేను పాడుతుంటే చిన్న పిల్లాడిని పాడినట్లు ఉంది. అందుకే మీరు పాడితేనే మీ బాడీ లాంగ్వేజ్ కి, స్క్రీన్ ప్రజెన్స్ కి మ్యాచ్ అవుతుంది అని దేవిశ్రీప్రసాద్ అన్నారు.
సరదాగా పాడేయండి అని చెప్పారు. కేవలం 20 నిమిషాల్లో ఆ పాటని పాడేసినట్లు కోట తెలిపారు. ఆ స్టూడియోలోనే కీరవాణి గారు కూడా ఉన్నారు. ఆయనకి ఈ సాంగ్ గురించి తెలిసి అభినందించారు. ఈ పాటని దేవిశ్రీప్రసాద్ పాడి ఉంటే ఒక సింగర్ పాడినట్లు ఉండేది. మీరు పాడారు కాబట్టి నిజంగా తాగుబోతు పాడినట్లే ఉంటుంది.. మంచి పని చేశారు అని అభినందించినట్లు కోట గుర్తు చేసుకున్నారు.