- Home
- Entertainment
- అద్భుతమైన నటుడివి, ఇలా పాడు చేసుకోకు అని కోటపై కేకలు వేసిన చిరంజీవి.. అసలేం జరిగిందంటే
అద్భుతమైన నటుడివి, ఇలా పాడు చేసుకోకు అని కోటపై కేకలు వేసిన చిరంజీవి.. అసలేం జరిగిందంటే
ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు 750 పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ రోల్స్ చేసినా, విలన్ గా నటించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించేవారు.
- FB
- TW
- Linkdin
Follow Us

ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు 750 పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ రోల్స్ చేసినా, విలన్ గా నటించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించేవారు. ఆయన నటనా శైలి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే నాలుగు దశాబ్దాల పాటు కోట శ్రీనివాసరావు టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా రాణించారు.
కోట మరణంతో ఆయన కెరీర్ విశేషాలని అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కోట శ్రీనివాసరావుకి మంచి అనుబంధం ఉంది. చిరంజీవి చాలా చిత్రాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. అందులో యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, బావగారు బాగున్నారా, అన్నయ్య లాంటి చిత్రాలు చెప్పుకోదగినవి.
కోట శ్రీనివాసరావు మద్యం సేవించే అలవాటు గురించి గతంలో చాలా వార్తలు వచ్చాయి. తాను డ్రింకింగ్ ఎక్కువగా చేస్తున్నానని చిరంజీవి చాలా సందర్భాల్లో హెచ్చరించిన విషయాన్ని కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేస్తున్నారు. నేనంటే చిరంజీవికి బాగా ఇష్టం.
నా మీద చాలాసార్లు కేకలు వేశాడు. ఏంటి మరీ ఎక్కువగా తాగుతున్నావట. నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్ వి.. ఇలా చేసి పాడు చేసుకోకు అని చిరంజీవి చాలా సార్లు నాపై అరిచారు అని కోట శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి నాపై అలా అరవడంలో తప్పులేదు. నేనంటే ఇష్టం కాబట్టి అలా చేశారు అని తెలిపారు.
కానీ అందరూ అంటున్నట్లు తాను తాగి షూటింగ్ కి వెళతాను అనే ప్రచారంలో వాస్తవం లేదని కోట తెలిపారు. చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు మూవీతోనే కోట సినీ కెరీర్ కూడా ప్రారంభమైంది.బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న కోట నటనపై ఆసక్తితో రంగస్థల నటుడిగా రాణించేవారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.