- Home
- Entertainment
- అనిల్ రావిపూడి మూవీలో చిరంజీవి, నయనతార పాత్రలు లీక్.. టైటిల్ మాత్రం నెవర్ బిఫోర్, ఫ్యాన్స్ కి పూనకాలే
అనిల్ రావిపూడి మూవీలో చిరంజీవి, నయనతార పాత్రలు లీక్.. టైటిల్ మాత్రం నెవర్ బిఫోర్, ఫ్యాన్స్ కి పూనకాలే
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలిసారి తెరకెక్కుతున్న చిత్రం మెగా 157. అనిల్ రావిపూడి పరాజయమే లేని దర్శకుడిగా గుర్తింపు పొందారు.
- FB
- TW
- Linkdin
Follow Us

చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలిసారి తెరకెక్కుతున్న చిత్రం మెగా 157. అనిల్ రావిపూడి పరాజయమే లేని దర్శకుడిగా గుర్తింపు పొందారు. తన తొలి చిత్రం పటాస్ నుంచి చివరగా రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.
50శాతం షూటింగ్ పూర్తి
అనిల్ రావిపూడి చిత్రాల్లో వినోదం, కామెడీ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కి పెట్టింది పేరు. దీంతో ఈ మూవీపై ప్రారంభంలోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు.
చిరంజీవి రోల్ లీక్
చిరంజీవితో నయనతారకి ఇది మూడవ చిత్రం. ఈ చిత్రం గురించి బయటకు వస్తున్న లీకులు క్రమంగా అంచనాలని మరింత పెంచేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో చిరంజీవి పోషించే పాత్ర గురించి ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. ఈ మూవీలో చిరంజీవి డ్రిల్ మాస్టర్ గా నటిస్తున్నారట. ఇక నయనతార టీచర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఫన్ అండ్ రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలెట్ కాబోతున్నాయని అంటున్నారు.చిరంజీవికి డ్రిల్ మాస్టర్ పాత్ర అంటే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫ్యాన్స్ అప్పుడే కామెంట్స్ పెడుతున్నారు.
మెగా 157 టైటిల్ ఏంటో తెలుసా ?
అదేవిధంగా ఈ చిత్ర టైటిల్ కూడా ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారట. మెగా 157 చిత్రానికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ అనే సంగతి తెలిసిందే.
సంక్రాంతికి రిలీజ్
ఆయన ఒరిజినల్ నేమ్ కి కనెక్ట్ అయ్యేలా సినిమా టైటిల్ పెట్టడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత ఎక్కువవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. చిరంజీవి పోషిస్తున్న పాత్ర, మూవీ టైటిల్ ఎంపికలో అనిల్ రావిపూడి ప్రత్యేకత కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.