MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ కాంబోలో 60 సినిమాలు, 35 ఏళ్ల స్నేహం, విషాదంలోను వీడని అనుబంధం

కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ కాంబోలో 60 సినిమాలు, 35 ఏళ్ల స్నేహం, విషాదంలోను వీడని అనుబంధం

కోట శ్రీనివాసరావు అనగానే గుర్తుకువచ్చే మరో పేరు బాబుమోహన్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. దాదాపు 60 సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి స్నేహం, టాలీవుడ్ కే ప్రత్యేకం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 13 2025, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Kota Srinivasa Rao facebook

వయస్సు విషయం పక్కన పెడితే విడదీయలేని అనుబంధం కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ ది. వీరిద్దరి మధ్య 10 ఏళ్ల వయసు తేడా ఉన్నా కాని, ఇండస్ట్రీలో మంచి స్నేహానికి నిదర్శనంగా నిలిచారు. కోట శ్రీనివాసరావు తో బాబుమోహన్ కాంబినేషన్ ఉందంటే ఆ సినిమా హిట్ అయినట్టే అనే పేరు ఉండేది. అంతే కాదు సినిమాలో వీరి కలయికలో సీన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేవారు. వీరిద్దరు కలిసి కనిపిస్తే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అని ఆశపడేవారు ఆడియన్స్. దాదాపు 35 ఏళ్ల స్నేహ బంధం వీరిద్దరిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Kota Srinivasa Rao Facebook

కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ కాంబినేషన్‌ కలిసింది బొబ్బిలి రాజా సినిమాతో. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేయడం మొదలు పెట్టారు. 

అంతే కాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం, సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు. ఇక కోటా, బాబుమోహన్ కాంబినేషన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏవండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ వన్, మాయలోడు, జంబలికిడిపంబ, సహా దాదాపు 60 సినిమాల్లో వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది.

 ఓనర్ పనివాడు,తండ్రీ కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు, ఇలా రకరాకల పాత్రలు వీరిద్దరు అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబుమోహన్, హీరోయిన్ తండ్రిగా కోట.. వీధి అరుగు మీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్టపట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు.

35
Image Credit : Kota Srinivasa Rao Facebook

కోట శ్రీనివాసరావు - బాబు మోహన్ ప్రాణ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా మెలిగారు. వీరిద్దరి కాంబో సినిమాల్లో నే కాదు నిజ జీవితంలో కూడా వీరిమధ్య కొన్ని సారుప్యతలు ఉన్నాయి. ఇద్దరు రాజీయాల్లోకి వెళ్లారు. ఇద్దరు అసెంబ్లీ లో అడుగు పెట్టారు, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. 

కాకపోతే బాబు మోహన్‌కి అదృష్టం కలిసొచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే కేవలం గన్‌మెన్‌ల కోసమే కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారని ఓ సందర్భంలో బాబు మోహన్ తెలిపారు. తొలుత టీడీపీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచి షూటింగ్‌కు గన్‌మెన్‌లతో వచ్చేవాడిని చెప్పారు.

 అది చూసి తట్టుకోలేకపోయిన కోట.. వెంటనే బీజేపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినట్లు బాబు మోహన్ ఓ సందర్భంలో అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాక్కూడా గన్‌మెన్లు ఉన్నారని చెప్పేవాడని తెలిపారు.

45
Image Credit : Kota Srinivasa Rao Facebook

ఇక అసెంబ్లీలోకూడా కోట, బాబుమోహన్ ఇద్దరు పక్కపక్కనే కూర్చొనేవాళ్లట. కాని రెండేళ్ల బాబుమోహన్ మంత్రి కావడంతో, బాబుమోహన్ సీట్ మారింది. సీటింగ్ మారిన తరువాత ముందు వరసలో బాబుమోహన్, బ్యాక్ రో లో కోట కూర్చోనేవాళ్లు. అయితే కోటా మాత్రం మంత్రివి అయినా సరే పక్కనే కూర్చోవాలని మారాం చేసేవాడట, ఆతరువాత చిన్నగా రాజకీయాలకు కూడా ఆయన దూరం అయ్యాడు. నటనకు మాత్రమే పరిమితం అయ్యాడు కోట.

55
Image Credit : Kota Srinivasa Rao Facebook

కోట శ్రీనివాసరావు , బాబుమోహన్ ఇద్దరి స్నేహ బంధం విషాదంలో కూడా వదల్లేదు. వ్యక్తిగత జీవితంలో విషాదం ఒకటి ఇద్దరికి ఒకేలా జరిగింది. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు ఇద్దరి కొడుకులు ఒకేలా మరణించారు. వీరిద్దరి కుమారులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోటకి ఒక్కగానొక్క కొడుకు వెంకట అంజనేయ ప్రసాద్. 2010 జూన్ 20న హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కొడుకు మరణం తరువాతే కోటా బాగా కృంగిపోయారు. అటు బాబు మోహన్ కుమారుడు.. ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దాంతో కొడుకు పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
కోట శ్రీనివాసరావు ను వెంటపడి కొట్టిన ఎన్టీఆర్ అభిమానులు, కోట కెరీర్ లో విషాదాలు, వివాదాలు ఎన్నో
Recommended image2
Kota Srinivasa Rao Passes Away: కోట శ్రీనివాసరావు కన్నుమూత, ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved