MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కోట శ్రీనివాసరావు ను వెంటపడి కొట్టిన ఎన్టీఆర్ అభిమానులు, కోట కెరీర్ లో విషాదాలు, వివాదాలు ఎన్నో

కోట శ్రీనివాసరావు ను వెంటపడి కొట్టిన ఎన్టీఆర్ అభిమానులు, కోట కెరీర్ లో విషాదాలు, వివాదాలు ఎన్నో

కోట శ్రీనివాసరావు కెరీర్ లో అద్భుతమైన సినిమాలే కాదు ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఆయన పర్సనల్ లైఫ్ లో కోలుకోలేని విషాదం కూడా జరిగింది. ఆ విషాదమే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది. 

4 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 13 2025, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కోట శ్రీనివాసరావు ఇక లేరు
Image Credit : Kota Srinivasa / Facebook

కోట శ్రీనివాసరావు ఇక లేరు

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కోట శ్రీనివాసరావు మరణించారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో భాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే కన్నుమూశారు. దాదాపు 50 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగిన కోటా 750 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పాత్రల విషయంలో ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్నేళ్ల కెరీర్ లోకోటా నటుడిగా మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు వివాదాలు, విషాదాలు కూడా ఫేస్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోట శ్రీనివాసరావు జీవితంలో అతి పెద్ద విషాదం
Image Credit : Kota Srinivasa Rao / Facebook

కోట శ్రీనివాసరావు జీవితంలో అతి పెద్ద విషాదం

 

నటుడిగా కోట శ్రీనివాసరావు ఏంటో అందరికి తెలుసు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆయన జీవితంలో జరిగిన అతి పెద్ద విషాదం, ఆయన సినిమా జీవితంపై కూడా ప్రభావం చూపించింది. కోటశ్రీనివాసరావు వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉండగానే.. ఆయన తనయుడు కోటా వెంకటప్రసాద్ మరణించారు. 2010 జూన్ లో కోట తనయుడు ఓ రోడ్ యాక్సిడెంట్ లో కన్నుమూశారు. 

కోటకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వెంకట ప్రసాద్ ఆయనకు ఏకైక తనయుడు. కోడుకంటే కోటాకు ప్రాణం, ఒక్క రోజు కూడా తన కుమారుడిని చూడకుండా ఉండలేకపోయేవారు. అటువంటి పరిస్థితిలో కుమారుడి మరణం కోటను తీవ్రంగా కలచివేసింది, ఆరోగ్య పరంగా కూడా క్రుంగదీసింది. అప్పటి నుంచే ఆయన అన్ని రకాలుగా డల్ అయ్యారు. చాలా కాలం డిప్రెషన్ లో ఉండిపోయిన కోట.. మళ్లీ నటించడం మొదలు పెట్టిన తరువాతే కాస్త కోలుకున్నారు.

36
కోట శ్రీనివాసరావు కెరీర్ లో పెద్ద వివాదం
Image Credit : Kota Srinivasa Rao / Facebook

కోట శ్రీనివాసరావు కెరీర్ లో పెద్ద వివాదం

 

ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన కోట కెరీర్ లో మాయని మచ్చగా నిలిచిన పాత్ర కూడా ఒకటి ఉంది. ఈ పాత్ర కారణంగా ఆయన తన్నులు కూడా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఇండస్ట్రీ దేవుడిలా కొలిచే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిన సినిమాలో పెద్దయన పాత్ర చేయడం కోటాపై కోపానికి కారణం అయ్యింది.

 ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో ఎన్టీఆర్ కు సూపర్ స్టార్ కృష్ణకు మధ్య ఏర్పడిన వివాదాలు ఓ సందర్భంలో తారా స్థాయికి చేరాయి. సినిమా వివాదాలు కాస్త రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయితే, కృష్ణ కాంగ్రెస్ లో చేరారు.

 ఈక్రమంలోనే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా, ఆయన్ను విమర్శిస్తు కొన్ని సినిమాలు చేశారు. అందులో మండలాధీశుడు ఒకటి. ఇందులో ఎన్టీఆర్‌‌ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు పోషించారు.పెద్దాయన హావభావాలు, డైలాగ్స్‌ను అనుకరిస్తూ కోట ఈ పాత్రలో అద్భుతంగా నటించారు. 

అయితే ఎన్టీఆర్ ను విలన్ గా చూపించిన ఈ పాత్రను కోటశ్రీనివాసరావు చేయడంతో ఆయన ఇబ్బందులు పడక తప్పలేదు. ఇండస్ట్రీలోనే కాదు బయటక కూడా కోట శ్రీనివాసరావు కొన్ని ప్రమాదాలు ఫేస్ చేశారు.

46
కోటను కొట్టడానికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు
Image Credit : Kota Srinivasa Rao / Facebook

కోటను కొట్టడానికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు

 

ఎన్టీఆర్ పై వ్యతిరేకంగా తీసిన సినిమాలో కోట పెద్దాయన పాత్ర పోషించడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోటాపై కన్నెర్రజేశారు. ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూశారు. ఓసారి తన కూతురిని చూడటానికి విజయవాడ వెళ్తే.. అప్పుడే ఎన్టీఆర్ పర్యటన కోసం విజయవాడ రావడం.. రైల్వే స్టేషన్ లో హడావిడి చూసి భయపడ్డారట కోటా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే ఏమౌతుందో ఏంటో అని తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేశారట. 

కానీ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు కోటను గుర్తుపట్టి కోటా వచ్చాడు అంటూ గట్టిగా కేకలు వేయడంతో అంతా ఆయనను చుట్టుముట్టి స్టేషన్ వెనక్కి లాక్కెళ్లి కొట్టడం మొదలు పెట్టారట. అక్కడున్నవారు పెద్దలు కల్పించుకోవడంతో ఎలాగోలా తప్పించుకున్నారట కోట శ్రీనివాసరావు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

56
కోట శ్రీనివాసరావును క్షమించి, ఆశీర్వదించిన ఎన్టీఆర్
Image Credit : Kota Srinivasa Rao / Facebook

కోట శ్రీనివాసరావును క్షమించి, ఆశీర్వదించిన ఎన్టీఆర్

 

మండలాధీశుడు సినిమా చేయడంతో కోటాకు ఆఫర్లు ఇవ్వలేదట టాలీవుడ్ లోని కొంత మంది మేకర్స్. అంతే కాదు అనధికారికంగా కోటపై నిషేదం కూడా కొనసాగిందట. ఈక్రమంలోనే ఓ సారి ఎయిర్ పోర్ట్ లో ఉండగా అక్కడికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలుసుకున్నారు కోటా శ్రీనివాసరావు. 

ఎన్టీఆర్ రాగానే వెళ్లి పలకరించి క్షమాపణ అడుగుదాం, వివరణ కూడా ఇద్దాం అనుకున్నారట. ఎయిర్‌పోర్ట్‌లోకి ఎన్టీఆర్ రాగానే కోట శ్రీనివాసరావు ఎదురెళ్లి నమస్కారం పెట్టారు. చుట్టు ఉన్నవారు కోపంగా అరవడంతో పెద్దాయన వారిని వారించారట. అప్పటికే ఈ ఎపిసోడ్ గురించి తెలిసి ఉండటంతో రామారావు గారు కొంత సీరియస్‌గానే ఉన్నారు. కానీ అన్ని పక్కనపెట్టి కోటను నవ్వుతూ పలకరించారట.

 మీరు మంచి నటులని విన్నాను.. గాడ్ బ్లస్ యూ ఆరోగ్యం జాగ్రత్త అని కోటను భుజం తట్టి ఆశీర్వదించారట. వెంటనే ఎన్టీఆర్‌ పాదాలకు నమస్కరించి కోట వచ్చేశారు. దాంతో కోటకు అప్పటి వరకూ ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయిందట. పెద్దాయన క్షమించడంతో అభిమానులు కూడా శాంతించారు.

66
కోట ముఖంపై ఉమ్మిన బాలకృష్ణ
Image Credit : Kota Srinivasa Rao / facebook

కోట ముఖంపై ఉమ్మిన బాలకృష్ణ

 

ఓ సందర్భంలో రాజమండ్రి షూటింగ్ కు వెళ్తే.. కోట, బాలయ్య ఒకే హోటల్ లో దిగారుట . కోటా శ్రీనివాసరావు లిప్ట్ దగ్గర ఉండగా.. బాలయ్య అక్కడికి వచ్చారట. దాంతో నమస్కారం బాబు అని కోటా ఎదురువెళ్ళగా.. ఆయన కోపంతో కాండ్రించి ముఖం మీదే ఉమ్మేశారట. ఇక అప్పుడు బాలయ్య సీఎం కొడుకు, పెద్ద హీరో కావడంతో.. తానేమి అనలేకపోయారట కోటా.

అయితే ఆ తరువాత కాలంలో తాము చాలా సినిమాలు చేశామని. తనతో ఆయన క్లోజ్ గానే ఉంటారని బాలయ్యను గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోటా. ఇక కోటపై బాలయ్యకు ఎందుకు అంత కోపం అంటే.. దానికి కారణం కూడా మండలాధీశుడు సినిమానే. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిన మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తే.. అందులో పెద్దాయన పాత్ర కోటా చేయడం బాలయ్యకు కోపం తెప్పించింది.

అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కోట శ్రీనివాస్ రావు ఈ సినిమాలో నటించారు కాని.. ముందుగా తన పాత్ర ఏంటో చెప్పకుండా చివరి నిమిషయంలో చెప్పారట. అప్పటికే పెద్ద నటుడు కాదు కోట. దాంతో ఆ సినిమా నుంచి బయటకు రాలేక, కమిట్ మెంట్ ఇవ్వడంతో చేయాల్సి వచ్చిందని అసలు విషయాన్ని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కోట శ్రీనివాసరావు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Recommended image2
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image3
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Related Stories
Recommended image1
నాగార్జునతో అస్సలు నటించను, తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరు, కారణం ఏంటి? నిజమెంత?
Recommended image2
Kota Srinivasa Rao Passes Away: కోట శ్రీనివాసరావు కన్నుమూత, ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved