- Home
- Entertainment
- Meenakshi Chaudhary: అందరూ నాగ చైతన్యలా ఉంటే చాలా మంచిది.. మామ అల్లుళ్ళు ఇద్దరిపై మీనాక్షి చౌదరి కామెంట్స్
Meenakshi Chaudhary: అందరూ నాగ చైతన్యలా ఉంటే చాలా మంచిది.. మామ అల్లుళ్ళు ఇద్దరిపై మీనాక్షి చౌదరి కామెంట్స్
మామ అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరితో మీనాక్షి చౌదరి నటించింది. ఇద్దరి గురించి మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య వృషకర్మ మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.

Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజులాంటి సూపర్ హిట్ చిత్రాలు మీనాక్షి ఖాతాలో ఉన్నాయి. ఆమెకి సక్సెస్ ఆలస్యంగా దక్కింది కానీ ఇప్పుడు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి నాగ చైతన్యకి జోడిగా వృషకర్మ అనే చిత్రంలో నటిస్తోంది.
వృషకర్మ రిలీజ్ కి రెడీ
ఈ మూవీ డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి ఆసక్తికర నాగచైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీనాక్షి చౌదరి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. మామ అల్లుళ్ళు ఇద్దరితో నటించే ఛాన్స్ ఆమెకి దక్కింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకీతో రొమాన్స్ చేసిన మీనాక్షిఇప్పుడు వెంకీ మేనల్లుడు నాగ చైతన్యతో నటిస్తోంది.
మామ అల్లుళ్లతో నటించిన హీరోయిన్
గతంలో ఈ విధంగా తమన్నా నటించింది. నాగ చైతన్యతో 100 పెర్సెంట్ లవ్, తడాఖా లాంటి చిత్రాల్లో నటించి విజయం అందుకున్న తమన్నా ఆ తర్వాత వెంకీ తో ఎఫ్ 2 లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తమన్నా సెంటిమెంట్ ని మీనాక్షి కూడా రిపీట్ చేస్తుందేమో చూడాలి.
వెంకీ, చైతు మధ్య తేడా ఇదే
ఇదిలా ఉండగా మామా అల్లుళ్ళు ఇద్దరితో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ అని మీనాక్షి పేర్కొంది. వెంకటేష్ గారు, నాగ చైతన్య ఇద్దరూ కాస్త రిజర్వ్డ్ గానే ఉంటారు. కానీ నాగ చైతన్య ఎక్స్ట్రా రిజర్వ్డ్ అనిపిస్తారు. ఇద్దరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సైలెంట్ గా వెళతారు. ఇద్దరిలో ఒకేలా అనిపించే క్వాలిటీ అది. వెంకటేష్ గారు సైలెంట్ గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ జోవియల్ గా ఉంటారు. కానీ నాగ చైతన్య పూర్తిగా సైలెంట్. నాకు తెలిసి అందరూ నాగ చైతన్యలా ఉంటె చాలా బెటర్. ఎందుకంటే మన ఎనర్జీ సేవ్ అవుతుంది అని మీనాక్షి పేర్కొంది.















