- Home
- Entertainment
- `కింగ్‌డమ్` మూవీ ఫస్ట్ రివ్యూ, విజయ్ దేవరకొండ కుంభస్థలం కొట్టబోతున్నాడా? బ్లడ్ బాత్‌కు రెడీ అయిపోండి
`కింగ్‌డమ్` మూవీ ఫస్ట్ రివ్యూ, విజయ్ దేవరకొండ కుంభస్థలం కొట్టబోతున్నాడా? బ్లడ్ బాత్‌కు రెడీ అయిపోండి
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `కింగ్‌డమ్` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవరికి వారు హైప్ ఇచ్చేస్తున్నారు.

`కింగ్‌డమ్`పై భారీ హైప్
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్`. చిన్నగా ప్రారంభమైన ఈ మూవీ రాను రాను భారీ సినిమాగా మారిపోయింది.
గ్లింప్స్ వచ్చినప్పట్నుంచి సినిమా లెక్కలు మారిపోయాయి. భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ హైప్ మరింతగా పెరిగింది. అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది.
అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ దుమ్మురేపుతుంది. ఇండియాలో, ఓవర్సీస్‌లోనూ రికార్డు స్థాయిలో అడ్వాన్స్ గా టికెట్ బుక్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
KNOW
`కింగ్‌డమ్`పై సందీప్ రెడ్డి వంగా, నాగవంశీ రివ్యూ
ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 50 నిమిషాల మూవీ చూశాడట. మ్యాడ్ ఉందని, సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని తెలిపారు.
అంతేకాదు నిర్మాత నాగవంశీ కూడా తనదైన స్టయిల్‌లో సినిమాకి హైప్ ఇస్తూ వస్తున్నారు. `కింగ్‌డమ్` మూవీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు.
రివ్యూ ఫార్మాట్‌లో ఏవైతే కావాలో అవన్నీ ఇందులో ఉంటాయని, వాటికి రైట్ మార్క్ పడతాయన్నారు. ఈ మూవీ విషయంలో తగ్గేదేలే అని చెబుతున్నారు.
`కింగ్‌డమ్`కి అనిరుధ్ రివ్యూ
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కూడా సినిమాపై హైప్ ఇచ్చారు. `కింగ్‌డమ్` మూవీ తన కెరీర్‌లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా ఉండబోతుందన్నారు.
విజయ్ దేవరకొండకి, దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి, తనకు ఇదొక మైల్ స్టోన్ మూవీ అవుతుందన్నారు. సాధారణంగా అనిరుధ్ ఇలాంటి రివ్యూలు ఇవ్వరు. కానీ ఈ మూవీ విషయంలో ఆయన వ్యాఖ్యలు విజయ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.
`కింగ్‌డమ్` సెన్సార్ రివ్యూ
ఇదిలా ఉంటే సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది. దీనికి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. పెద్దగా కట్స్ ఇవ్వలేదు. కాకపోతే కొన్ని పదాలను మ్యూట్ చేశారు.
సీన్లని సీజీలో కవర్ చేయాలని తెలిపారు. ఒక రెండున్నర నిమిషాల సీన్‌ని రీప్లేస్ చేయించారు. మరోవైపు సెన్సార్ మ్యూట్, కవర్ చేయాల్సిన సీన్లలో బ్లడ్ పూల్, బ్లడ్ డ్రిప్ ఉన్నాయి.
అలాగే కొన్ని బూతు పదాలున్నాయి. ఇలాంటి కొన్నిమార్పులతో యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. దీని బట్టి చూస్తుంటే ఇందులో బ్లడ్ బాత్ వేరేలా ఉండబోతుందని చెప్పొచ్చు.
ఓవర్సీస్ రివ్యూ
ఇంకోవైపు ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సందు కూడా తన రివ్యూతో మరింత హైప్ పెంచేశాడు. సాధారణంగా సినిమాలకు నెగటివ్ రివ్యూ ఇచ్చే ఆయన ఈ మూవీకి మూడు రేటింగ్ ఇచ్చారు.
వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టు తెలిపారు. ఇది విజయ్ వన్ మ్యాన్ షో అని, యాక్షన్ సీన్లతో అదరగొట్టాడని, ఆడియెన్స్ ని కట్టిపడేశాడని తెలిపారు.
స్టోరీ, స్క్రీన్ ప్లే అదిరిపోయిందని, ఓవరాల్‌గా డీసెంట్ మాస్ ఎంటర్‌టైనర్ అని వెల్లడించడం విశేషం. మొత్తంగా `కింగ్‌డమ్`తో విజయ్ ఏకంగా కుంభస్థలమే కొట్టబోతున్నట్టు సమాచారం.