- Home
- Entertainment
- రూ.72కోట్ల ఆస్తులు రాసిచ్చిన మహిళా అభిమాని, సంజయ్‌దత్ ఏం చేశాడో తెలిస్తే ఫ్యాన్ అయిపోవాల్సిందే
రూ.72కోట్ల ఆస్తులు రాసిచ్చిన మహిళా అభిమాని, సంజయ్‌దత్ ఏం చేశాడో తెలిస్తే ఫ్యాన్ అయిపోవాల్సిందే
మహిళా అభిమాని హీరో సంజయ్ దత్ పేరు మీద ఏకంగా రూ. 72కోట్ల ఆస్తులు రాసిచ్చారు. మరి దీన్ని సంజూ భాయ్ ఏం చేశాడో తెలిస్తే మాత్రం ఆయనకు మీరు అభిమాని అయిపోతారు.

సంజయ్ దత్‌కి రూ.72కోట్లు రాసిచ్చిన అభిమాని
అభిమానుల కోసం అడపాదడపా సినిమా స్టార్స్ అండగా ఉంటారు. వారికి సహాయం చేస్తుంటారు. కానీ హీరోకే ఒక అభిమాని సాయం చేసింది.
కాదు కాదు.. కోట్ల రూపాయలు ఆయన పేరుమీద రాసిచ్చింది. ఒక మహిళా అభిమాని తాను చనిపోయే ముందు సుమారు రూ.72కోట్లు హీరో సంజయ్ దత్ పేరు మీద రాసివ్వడం విశేషం.
అయితే ఈ అమౌంట్‌ని సంజయ్ దత్ ఏం చేశాడో తెలిస్తే మాత్రం వాహ్ అనాల్సిందే. సంజూబాయ్‌కి అభిమానిగా మారడమే కాదు, ఆయన్ని రియల్ హీరో అనక మానరు. ఆ కథేంటో చూద్దాం.
KNOW
అమితాబ్ బచ్చన్‌కి ధీటుగా ఎదిగిన సంజయ్ దత్
బాలీవుడ్‌లో ఖల్ నాయక్‌గా పేరుతెచ్చుకున్నారు సంజయ్ దత్. ఒకప్పుడు ఆయన బాలీవుడ్‌లో స్టార్ హీరో. అమితాబ్ బచ్చన్‌తోపాటు ఆ రేంజ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో.
కొన్ని కేసులు, వివాదాలతో కెరీర్ డౌన్ అయ్యింది కానీ, ఖాన్స్ త్రయానికి మించిన హీరో సంజయ్ దత్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఆరేళ్ల క్రితం సంజయ్ దత్ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనని స్వయంగా సంజూ భాయ్ వెల్లడించారు.
సంజయ్ దత్ కి రూ.72కోట్లు వీలునామా రాసిచ్చిన లేడీ ఫ్యాన్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్ చెబుతూ, 2018లో ఓ మహిళా అభిమాని తనకు కోట్ల రూపాయల ఆస్తులను రాసిచ్చిన విషయాన్ని వెల్లడించారు.
`ముంబయిలోని మలబార్ హిల్స్‌లో నివసించే నిషా పాటిల్ అనే 62 ఏళ్ల వృద్ధురాలు నాకు వీరాభిమాని. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చివరి రోజుల్లో తన పేరిట ఉన్న రూ.72 కోట్ల ఆస్తిని నా పేరుతో వీలునామా రాశారు.
తన మరణానంతరం ఆ ఆస్తి మొత్తం వారి కుటుంబ సభ్యులకు కాకుండా నాకు చెందాలని అందులో రాశారు. 2018, జనవరి 15న ఆమె చనిపోయిన తర్వాత కుటుంబసభ్యులకు ఆ వీలునామా గురించి తెలిసింది. అందులో ఆమె రాసినదంతా చదివి వాళ్లు షాక్‌కి గురయ్యారు.
అభిమాని ఆస్తిని వారి ఫ్యామిలీకి తిరిగిచ్చిన సంజయ్ దత్
ఈ వార్త నాకు తెలిసినప్పుడు చాలా ఆవేదనకు గురయ్యాను. ఆస్తులు కూడా రాసిచ్చేంతగా ఆమె అభిమానం పొందినందుకు గర్వంగా ఫీలయ్యాను. ఆమె నాపై చూపించిన ప్రేమ, అభిమానం చాలా గొప్పది.
కానీ ఆ ఆస్తి విషయంలో నాకు ఎలాంటి హక్కులేదు. అందుకే ఆ రూ.72 కోట్ల ఆస్తిని నిషా పాటిల్ ఫ్యామిలీకే తిరిగిచ్చేశాను. ఆ మాతృమూర్తిని ఎప్పుడూ కలవలేకపోయినా ఆమె నాపై చూపించిన అభిమానానికి, పుత్ర వాత్సల్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను` అని వెల్లడించారు సంజయ్ దత్.
ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజయ్ దత్ పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు రియల్ హీరో భాయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన గొప్ప హృదయానికి సలామ్ చేస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్న సంజయ్ దత్
సంజయ్ దత్.. 1981లో 'రాకీ' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సునీల్ దత్ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన సంజూ భాయ్ తనకంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు.
మాస్ యాక్షన్ సినిమాలతో మెప్పించారు. `నామ్`, `ఖల్‌నాయక్`, `వాస్తవ్`, `మున్నాభాయ్ ఎంబీబీఎస్` చిత్రాలతో ఆయనేంటో నిరూపించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు.
తిరుగులేని స్టార్‌గా రాణిస్తున్న సమయంలో 1993 ముంబాయి బాంబు పేలుళ్ల కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసులో ఐదేళ్లపాటు జైలుకి వెళ్లొచ్చారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు వరుస మూవీస్‌తో దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం సంజయ్ దత్ ప్రభాస్‌తో `ది రాజాసాబ్`లో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఘోస్ట్ గా కనిపిస్తారని సమాచారం. అలాగే `అఖండ 2`లో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.