MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కింగ్‌డమ్‌` ఆర్టిస్టుల పారితోషికాలు.. విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ, సత్యదేవ్‌, అనిరుథ్‌ ఎంత తీసుకున్నారంటే?

`కింగ్‌డమ్‌` ఆర్టిస్టుల పారితోషికాలు.. విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ, సత్యదేవ్‌, అనిరుథ్‌ ఎంత తీసుకున్నారంటే?

`కింగ్‌డమ్‌` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలోని ఆర్టిస్ట్ లు, టెక్నిషియన్ల పారితోషికాలు వివరాలు తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 29 2025, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జులై 31న విడుదల కాబోతున్న విజయ్‌ దేవరకొండ `కింగ్‌డమ్‌`
Image Credit : Asianet News

జులై 31న విడుదల కాబోతున్న విజయ్‌ దేవరకొండ `కింగ్‌డమ్‌`

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `కింగ్‌డమ్‌` మూవీతో రాబోతున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. 

సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూర్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై తెరకెక్కిన `కింగ్‌డమ్‌` మూవీ ఈ నెల 31న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

DID YOU
KNOW
?
గౌతమ్ తిన్ననూరిని రిజెక్ట్ చేసిన విజయ్‌
`పెళ్లిచూపులు` సినిమా విడుదల రోజు `మళ్లీరావా` కథ విన్న విజయ్‌ ఆ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశారు. మళ్లీ అదే దర్శకుడితో ఇప్పుడు `కింగ్‌డమ్‌` చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`కింగ్‌డమ్‌`పై భారీ హైప్‌
Image Credit : Asianet News

`కింగ్‌డమ్‌`పై భారీ హైప్‌

సినిమాపై విపరీతమైన బజ్‌ నెలకొంది. విడుదలైన ట్రైలర్‌ భారీ హైప్‌ తీసుకొచ్చింది. కేవలం కంటెంట్‌తోనే సినిమాపై హైప్‌ తీసుకురావడం విశేషం. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతుంది. 

బుక్‌ మై షోలో ఇప్పటి వరకు లక్ష టికెట్స్  సేల్‌ అయ్యాయి. దీంతోపాటు ఓవర్సీస్‌లోనూ భారీగా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఈ మూవీ బయ్యర్లకి మతిపోయేలా చేస్తోంది.

35
`కింగ్‌డమ్‌` కథేంటంటే
Image Credit : X/Sithara Entertainments

`కింగ్‌డమ్‌` కథేంటంటే

`కింగ్‌డమ్‌` మూవీ కంటెంట్‌ అందరిని ఆకర్షిస్తుంది. ఏదో ఉండబోతుందనే విషయాన్ని చాటి చెబుతుంది. విడుదలైన ట్రైలర్‌లో విజయ్‌ దేవరకొండ పాత్రలోని షేడ్స్ మతిపోగొడుతుంది.

 ఆయన రెండు మూడు గెటప్స్ లో కనిపించారు. ఒక పోలీస్‌గా, ఒక స్పైగా, గ్యాంగ్‌కి నాయకుడిగా కనిపిస్తున్నారు. అదే సమయంలో ఓ రాజ్యానికి ఎంపరర్‌గానూ కనిపిస్తారని తెలుస్తోంది. 

మరోవైపు సత్యదేవ్‌, విజయ్‌ అన్నాతమ్ముళ్లుగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య బాండింగ్‌ బలంగా ఉంటుందని, అదే సమయంలో ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మారతారని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఇవన్నీ సినిమాపై హైప్‌ని పెంచుతున్నాయి.

45
విజయ్‌ దేవరకొండ పారితోషికం
Image Credit : Asianet News

విజయ్‌ దేవరకొండ పారితోషికం

ఇదిలా ఉంటే ఈ మూవీలో నటించిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల పారితోషికం వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎవరెవరు ఎంత తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

అందులో భాగంగా విజయ్‌ దేవరకొండ తన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ తీసుకున్నారట. ఈ చిత్రానికి ఆయన ముప్పై కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇందులో కొంత లాభాల్లో షేర్‌ రూపంలో రాబోతుందని సమాచారం.

55
`కింగ్‌డమ్‌` కాస్ట్ అండ్‌ క్రూ పారితోషికాలు
Image Credit : our own

`కింగ్‌డమ్‌` కాస్ట్ అండ్‌ క్రూ పారితోషికాలు

ఆయనతోపాటు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఏడు కోట్లు, సత్య దేవ్‌కి మూడు కోట్లు, అనిరుధ్‌ రవిచందర్‌కి పది కోట్లు, హీరోయిన్‌ భాగ్య శ్రీ బోర్సే కి యాభై లక్షలు, ఇతర కాస్టింగ్‌కి రెండు కోట్లు, టెక్నీషియన్లకి ఏడున్నర కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది. 

ఈ లెక్కన ఈ మూవీకి ఆరవై కోట్ల వరకు పారితోషికాలే అయినట్టు సమాచారం. ఇక ఈ మూవీకి రూ.130కోట్ల బడ్జెట్‌ అయ్యిందని టాక్‌. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajeev Kanakala: ఎన్టీఆర్‌ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్‌ కనకాల
Recommended image2
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image3
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Related Stories
Recommended image1
`హరి హర వీరమల్లు` ఆర్టిస్ట్ ల పారితోషికాలు.. పవన్‌, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌ ఎంత తీసుకున్నారంటే?
Recommended image2
`బిగ్‌ బాస్‌ తెలుగు 9` లోకి క్రేజీ సింగర్‌.. లేటెస్ట్ కంటెస్టెంట్ల లిస్ట్.. వాళ్లకి అగ్నిపరీక్షే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved