టబు నా ఇంట్లోనే ఉంటుంది, అయితే ఏంటి..? ఎఫైర్ వార్తలపై నాగార్జున స్ట్రాంగ్ రిప్లై..
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు హీరోయిన్ టబుతో ఎఫైర్ ఉందా..? ఇద్దరు ప్రేమించుకున్నారా..? పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారా..? ఈ విషయంలో నాగార్జున ఏమన్నారు..?
Nagarjuna-Amala
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుుడఅనే పేరు ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. 60 ఏళ్ళు దాటినా నాగార్జున ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయం అయి చాలా కాలం అవుతున్నా.. నాగార్జున మాత్రం వారికి మించి రొమాంటిక్ ఇమేజ్ ను కొనసాగిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ముద్దుగా.. నిక్ నేమ్ తో పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? కారణం ఏంటి..?
నాగార్జున కు ఇండస్టీలో ఎఫైర్ల గోల ఎక్కవగా ఉండేది. ఆయన నవమన్మధుడని... ఆయనతో ఏహీరోయిన్ సినిమా చేసినా.. ప్రమలో పడిపోవడం ఖాయం అనుకుంటూ ఉండేవారు. మరీముఖ్యంగా కింగ్ నాగార్జున, హీరోయిన్ టబుకు అఫైర్ ఉందంటూ రూమర్లు ఎక్కువగా వినిపించేవి.
అప్పటికే వెంకటేష్ చెల్లిని పెళ్ళాడి.. నాగచైతన్య పుట్టిన తరువాత.. ఆమెకు విడాకులు ఇచ్చాడు నాగ్. ఆతరువాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్ళాడాడు. వీరికి 94 లో అఖిల్ పుట్టాడు. కాగా అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని హీరోపై.. అఫైర్ల వార్తలు మాత్రం తగ్గలేదు. మరీ ముఖ్యంగా టబుకు నాగ్ కు లింక్ కలుపుతూ.. చాలా వార్తలు హల్ చల్ చేశాయి.
జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?
టబుతో నిన్నే పెళ్ళాడుత, సిసింద్రి లాంటిసినిమాలు చేశాడు నాగ్. టబుతో బాగా క్లోజ్ గా ఉండేవాడు. అయితే రమ్యకృష్ణ, సౌందర్య, రంభ లాంటి తారలతో కూడా నాగ్ సినిమాలు చేసినా.. వారి విషయంలో రాని వార్తలు టబు విషయంలోనే వచ్చేవి. స్క్రీన్ పై కూడా టబుతో చాలా క్లోజ్ గా రొమాంటిక్ పెర్ఫామెన్స్ లు ఇచ్చేవారు. నిన్నెపెళ్ళాడతా సినిమాలో వీరి రొమాన్స్ చూసిన ఎవరైనా పక్కాగా వీరికి మధ్య ఏదో ఉంది అనుకోకుండా ఉండలేరు.
నాగార్జున - అమల ప్రేమకు 32 ఏళ్లు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..
అయితే ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు నాగార్జున. ఓ సందర్భంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గోన్న నాగార్జున. టబుతో తన బంధం గురించి ఓపెన్ అయ్యాడు. మీ బంధం పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిందట కదా అని ప్రశ్న ఎదురవ్వగా.. నాగార్జున నవ్వుకున్నారు. టబుతో నాకు మంచి రిలేషన్ ఉంది. నాకంటే కూడా మా ఫ్యామిలీతో ఎక్కువ సాన్నిహిత్యం ఆమెకు ఉంది అన్నారు.
టబు హైదరాబాదీ కావడం.. నేను కూడా హైదరాబాద్ లో పెరగడంతో.. మాకు మంచి ఫ్రెడ్నిష్ ఉండేది అన్నారు నాగార్జున. ఇక టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. నా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కావల్సినవన్నీ అమల దగ్గరుండి చూసుకుంటుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా టబు అందరితోకలిసి బోజనం చేసేది. అందరితో హ్యాపీగా మాట్లాడి.. తన పని అయిపోయిన తరువాత తిరిగి వెళ్లిపోయేది.
టబుతో నా బంధం ఇదే.. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను పెళ్ళి చేసుకోలేదు కాబట్టి.. ఆమె అసలు పెళ్ళే వద్దని ఖాళీగా ఉందని ప్రచారం జరుగుతుంది. కాని అందులో నిజం లేదు. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని అన్నారు నాగార్జున. టబు నాకు మంచి ఫ్రెండ్.. అంతకు మించి ఏమీ లేదన్నారు. టబుకు ముందు నుంచి పెళ్ళిపై ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళి చేసుకోను అని ఆమె ఎప్పుుడో చెప్పేసింది. అని అన్నారు కింగ్.