MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ చిరంజీవి ముద్దుగా.. నిక్ నేమ్ తో పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? కారణం ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి ముద్దుగా.. నిక్ నేమ్ తో పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? కారణం ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవితో చాలామంది హీరోయిన్లు నటించారు.. నటిస్తూనేఉన్నారు. కాని ఆయన మాత్రం ఒక్క హీరోయిన్ ను మాత్రమే ముద్దు పేరుతో పిలుస్తారట. ఇంతకీ ఎవారా హీరోయిన్..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2024, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగి.. ఇండస్ట్రీకి పెద్దగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ తో మెగా సాంమ్రాజ్యాన్నిస్థాపించి.. తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మెగా నీడలో అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారంటేు.. చిరంజీవి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పనవసరం లేదు. 
 

దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై అనుమానాలు,ఫేక్ బేబీ బంప్ తో తిరుగుతుందా.? సరోగసీ ద్వారా కనబోతున్నారా..? నిజమేంత

28

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. నగ్మ విజయశాంతి, రాధిక లాంటి హీరోయిన్ ల  నుంచి తమన్నా, కాజల్ వరకూ. ఎంతో మంది హీరోయిన్లు ఆయన సరసన నటించి మెప్పించారు. ఇప్పటికే నటిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఆయనతో నటించడం వారు అదృష్టంగా భావిస్తుంటారు. 

జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?

38

అయితే చిరంజీవి కూడా తన కెరీర్ లో ఏ హీరోయిన్ తో ఎటువంటి వివాదం లేకుండా.. చాలా జాగ్రత్తగా ఉన్నారు. హీరోయిన్ల దగ్గర చాలా హుందాగా ప్రవర్తించేవారు మెగాస్టార్. అందుకే హీరోయిన్లకు ఆయన అంటే చాలా గౌరవం కూడా. కాని కొంత మంది హీరోయిన్ల దగ్గర మాత్రం చాలా చనువుగా  ఉండేవారట. రాధిక, సుహాసిని, రాధ, విజయశాంతి లాంటి హీరోయిన్లు మెగాస్టార్ కు ఫ్రెండ్స్ లా ఉండేవారట.

 

నాగార్జున ‌- అమల ప్రేమకు 32 ఏళ్లు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..

48

అయితే వీరెవరు కాకుండా.. ఒ హీరోయిన్ ను మాత్రం చిరు ముద్దు పేరుతో పిలిచేవారట. ఇంతకీ ఎవారా హీరోయిన్ తెలుసా..? 

58

మెగాస్టార్ చిరంజీవికి చాలా క్లోజ్ గా ఉండే హీరోయిన్లు రాధిక, విజయశాంతి, రాధ, సుహాసిని.. ఇలా ఎవరు ఉన్నా.. ఆయన మాత్రం దివంగత నటి సౌందర్యను ప్రత్యేకంగా చూసేవారట. ఆమె పద్దతి .. మాటతీరు.. మర్యధ చిరంజీవికి చాలా ఇష్టమని టాక్. అందుకే సౌందర్యను మాత్రమే చిరు సౌ..అని ముద్దుగా పిలుచుకునేవారట. ఆమె కూడా చిరంజీవి ఆప్యయంగా పిలిస్తే.. మురిసిపోయేవారట. ఈ విషయం చిరంజీవి సతీమణి సురేఖకు కూడా తెలుసని సమాచారం. మెగాస్టార్ ఇంటికి వెళ్లి..ఫ్యామిలీలో ఒకరిగా ఉన్న హీరోయిన్ కూడా సౌందర్యనే అంటుంటారు. 

68

=ఫిల్మ్ ఇండస్ట్రీలో సావిత్రి తరువాత అంత పద్దతిగల హీరోయిన్ గా సౌందర్యకుపేరు. ఫ్యాషన్ డ్రెస్సులతో రంభ, రమ్యకృష్ణ అదరగొడుతున్న రోజుల్లో కూడా చీరకట్టుతో.. హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించింది సౌందర్య. బట్టలు ఎప్పుడు మోకాలు దాటనిచ్చేది కాదు దివంగత హీరోయిన్. తన నటనతో మెప్పించి.. ఫ్యామిలీ ఆడియన్స్ చేత శభాష్ అనిపిచుకుంది సౌందర్య. చాలా చిన్న వయస్సులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి. అదే ఆడియన్స్ చేసే కన్నీళ్ళు పెట్టించింది కూడా. 

78

టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ , బాలీవుడ్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా రాణించింది సౌందర్య. తెలుగులోచిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు , శ్రీకాంత్. జగపతి బాబు సినిమాలో నటించిన సౌందర్య. తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్,  అజిత్ లాంటి స్టార్ల సరసనమెరిసింది. సౌత్ లో తిరుగు లేని ఇమేజ్ ను సాధించిన సౌందర్య.. చాలా చిన్న వయస్సులోనే మరణించింది. 
 

88

బీజేపీలో చేరిన ఆమె.. పార్టీ ప్రచారం కోసం తిరుగుతూ.. ప్రమాదానికి గురయ్యింది సౌందర్య. హెలికాప్టర్ లో ప్రచారానికి వెళ్తూ..ప్రమాదవశాత్తు అది పేలడంతో... మరణించింది. ఈ ప్రమాదంతో సౌందర్య సోదరుడు కూడా మరణించాడు. అంతే కాదు మరణించే సమయానికి సౌందర్య గర్బవతిగా ఉందని సమాచారం. ఏది ఏమైనా తెలుగు ఆయన్స్ ఆరాధిచే నటీమణులు అటు సావిత్రి.. ఇటు సౌందర్య.. ఇద్దరు చాలా చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరం. ఈ ఇద్దరు హీరోయిన్లు మెగాస్టార్  అభిమాన నటీమణులే. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved