- Home
- Entertainment
- 26 ఏళ్లలో కోట్లు కూడబెట్టిన KGF స్టార్ యష్, టాక్సిక్ హీరో రెమ్యునరేషన్, ఆస్తి విలువ ఎంతో తెలుసా?
26 ఏళ్లలో కోట్లు కూడబెట్టిన KGF స్టార్ యష్, టాక్సిక్ హీరో రెమ్యునరేషన్, ఆస్తి విలువ ఎంతో తెలుసా?
టీవీ నటుడిగా కెరీర్ మొదలు పెట్టి.. కన్నడ సూపర్ స్టార్ గా ఎదిగిన యష్.. తాజాగా 40వ ఏడాదిలోకి అడుగు పెట్టాడు. 26 ఏళ్లలో యష్ సంపాదన ఎంత, కేజీఎఫ్ స్టార్ రెమ్యునరేషన్, ఆస్తుల వివరాలు?

బాలీవుడ్ పై సౌత్ హీరోల దండయాత్ర...
బాలీవుడ్ లో సౌత్ హీరోల ప్రభావం పెరిగిపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ నార్త్ లో పాన్ ఇండియా సినిమాలతో పాతుకుపోయారు. టాలీవుడ్ తరువాత కన్నడ హీరోలు ఎక్కువగా బాలీవుడ్ పై ప్రభావం చూపిస్తున్నారు. సౌత్ నుంచి రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, చిరంజీవి, నాగార్జున తర్వాత కొత్త తరంలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రిషబ్ శెట్టితో పాటు కన్నడ స్టార్ యష్ కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించారు.
కేజీఎఫ్ తో పాన్ ఇండియా హీరోగా..
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన 'KGF' ఫ్రాంచైజీ మూవీస్.. సౌత్ ఇండియన్ యాక్టర్ యష్ ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. రాఖీ భాయ్ పాత్ర అతన్ని యాక్షన్ హీరోగా నిలబెట్టింది. కేజీఎఫ్ 2 నటుడి పాపులారిటీని ఆకాశానికి చేర్చింది. ప్రస్తుతం ఆయన సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
చాలా కాలం గ్యాప్ ఇచ్చిన హీరో..
కేజీయఫ్ తరువాత యష్ చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.. ప్రస్తుతం యష్ నుంచి రాబోతున్న సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 2022 తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
భారీగా ఆస్తులు కూడబెట్టిన యష్..
తన సినిమాల కంటెంట్, ప్రభావం సరిగ్గా ఉండేలా చూసుకోవడానికి యష్ ఎప్పుడూ ప్రయత్నిస్తారని అందరికీ తెలుసు. అందుకే ఆయన సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నారని సమాచారం. గత కొన్నేళ్లుగా, యశ్ 'రాకింగ్ స్టార్', 'రాఖీ భాయ్' వంటి బిరుదులతో చాలా సాధించారు. ఈ నటుడు ఇప్పుడు భారీగా ఆస్తులు కూడ బెట్టి.., విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన కష్టం, స్టార్‌డమ్‌తో చిన్న స్థాయి నుంచి కోట్లకు ఎదిగాడు యష్.
సినిమాలతో పాటు
CAknowledge.com ప్రకారం, కన్నడ నటుడు యష్ నికర విలువ 53 నుండి 60 కోట్ల రూపాయలు. అతని వార్షిక ఆదాయం 8 నుండి 10 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. అతని ఆస్తుల విలువ సుమారు 6 కోట్ల రూపాయలు. యష్ చాలా బ్రాండ్‌లు, ఎండార్స్‌మెంట్‌లను ప్రమోట్ చేస్తారు. అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ, ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు 60 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
యష్ రెమ్యునరేషన్ వివరాలు
Housing.com ప్రకారం, యష్ కు బెంగళూరులో సుమారు 4 కోట్ల రూపాయల విలువైన అత్యంత విలాసవంతమైన డ్యూప్లెక్స్ ఉంది. అతని వద్ద అనేక లగ్జరీ కార్లు, బైక్‌లు కూడా ఉన్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం, కన్నడ నటుడు ఇప్పుడు రణబీర్ కపూర్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'రామాయణ్' కోసం 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

