- Home
- Entertainment
- 5 భాషల్లో 1500 సినిమాలు, 5000 నాటకాలు, గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఏకైక నటి ఎవరో తెలుసా?
5 భాషల్లో 1500 సినిమాలు, 5000 నాటకాలు, గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఏకైక నటి ఎవరో తెలుసా?
దాదాపు 5 భాషల్లో 15 వందల సినిమాలు, 5000లకు పైగా నాటకాలు వేసిన సీనియర్ నటి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న లెజెండరీ యాక్ట్రస్.. దాదాపు 60 ఏళ్ల సినీ జీవితం చూసిన ఆ నటి ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన నటి..
ఫిల్మ్ ఇండస్ట్రీలో వందల సినిమాలు చేసిన నటీనటులు చాలామంది ఉన్నారు. కానీ ఉన్నంత వరకూ.. సినిమా కోసమే బ్రతికి వారు మాత్రం కొందరే ఉన్నారు. వారిలో లేడీ ఆర్టిస్ట్ లు అయితే చాలా అరుదు. రికార్డు స్థాయిలో సినిమాలు చేసిన నటీమణులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.. ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా సినిమా జీవితం కంప్లీట్ చేసుకున్న లేడీ ఆర్టిస్ట్ లలో నిర్మలమ్మ, విజయనిర్మల, మనోరమ, రమాప్రభ లాంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.. అందులో 1000కి పైగా సినిమాలు చేసిన నటిగా మనోరమ రికార్డు క్రియేట్ చేసింది.
ప్రేక్షకులు మర్చిపోలేని నటి..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎంతో మంది నటీనటులు తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించి, మెప్పించి, స్టార్లుగా వెలుగు వెలిగారు. అయితే వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. తరాలు మారినా.. వారి సినిమాలు, జ్ఞాపకాలుగా ముందు తరాల వారికి అందుతూనే ఉంటాయి. ఒక నటి ఆ స్థాయికి ఎదగాలి అంటే అంది అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. కానీ ఆ స్థాయిని అందుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు నటి మనోరమ. అరుదైన నటీమణుల్లో మనోరమ ఒకరు.. ఆమె చేసిన పాత్రలు, ఆమె అభినయం ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచాయి.
భాషతో సంబంధం లేకుండా..
భాషా పరిమితులు లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటి మనోరమ. అందుకు గాను ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కూడా లభించింది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఆమెకు ఉన్న గుర్తింపు చాలా ప్రత్యేకమైనది. దాదాపు 60 ఏళ్ల సినీజీవిగాన్ని చూసింది మనోరమ. స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మెప్పించింది. కెరీర్ బిగినింగ్ లో కమెడియన్ల జోడిగానటించిన ఆమె.. ఆతరువాత కాలంలో ఎన్నో రకాల క్యారెక్టర్లను అవలీలగా పోషించింది. హీరోలకు అమ్మగా, అమ్మమ్మగా. జేజమ్మగా కూడా నటించి మెప్పించిందిమనోరమ.
11 ఏళ్ల వయసులోనే నటన మొదలు పెట్టిన మనోరమ..
మనోరమ అసలు పేరు గోపిశాంత. 1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో ఆమె పుట్టింది. అక్కడే కొంత వరకు చదువుకుంది. 11 ఏళ్లకే చదువు ఆపేసి.. నాటక రంగంలోకి అడుగుపెట్టింది. నాటకాలు వేస్తున్న టైమ్ లోనే ఆమె పేరు మనోరమగా మారింది. ఆమెకు చాలా క్లోజ్ గా ఉండేవారు మాత్రం ఆచి’ అనే పేరుతో పిలిచేవారు. నాటకాలు వేస్తూనే.. 1958లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, దాదాపు 60 ఏళ్లకు పైగా నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉంది. తన సినీ ప్రయాణంలో 1500కి పైగా సినిమాల్లో.. వివిధ రకాల పాత్రలను పోషించింది మనోరమ. దాదాపు 5000 లకు పైగా నాటకల్లో ఆమె నటించింది.
ఎమోషనల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్..
లేడీ కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించిన మనోరమ.. ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా అద్భుతంగా పోషించి చూపించింది. కామెడీతో ఎంత నవ్వించగలదో.. ట్రాజెడీ పాత్రతో అంత ఏడిపించగలదు సీనియర్ నటి. తన సినిమా ప్రస్థానం కొనసాగిస్తూనే.. 2015 లో తన 78వ ఏట కన్నుమూసింది. ఇక సినిమా పరిశ్రమకు మనోరమ చేసిన న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా ఒక జాతీయ అవార్డు, ఒక ఫిలింఫేర్ అవార్డు తో పాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా ఏడు రాష్ట్ర అవార్డులు అందుకుంది.
మరణం తరువాత అరుదైన గౌవరం..
మనోరమకు మరో అరుదైన గౌరవం దక్కనున్నట్టు తెలుస్తోంది. చెన్నయ్‌లో ఆమె నివసించిన వీధికి ఆమె పేరు పెట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మనోరమ ఎక్కువకాలం.. టి.నగర్ లోని నీలకంఠ మెహతా వీధిలో నివసించారు. అందుకే ఆమె జ్ఞాపకార్థం ఆ వీధి పేరును ‘మనోరమ స్ట్రీట్’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

