- Home
- Entertainment
- 100 కోట్ల ఇల్లు, 80 కోట్ల ఫ్లైట్, 12 కోట్ల కార్లు, అల్లు అర్జున్ రాయల్ లైఫ్ స్టైల్ చూస్తే కళ్లు తిరగాల్సిందే
100 కోట్ల ఇల్లు, 80 కోట్ల ఫ్లైట్, 12 కోట్ల కార్లు, అల్లు అర్జున్ రాయల్ లైఫ్ స్టైల్ చూస్తే కళ్లు తిరగాల్సిందే
సినిమాలు, బిజినెస్ లతో కోట్లు సంపాదిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పాన్ ఇండియా హీరోగా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బన్నీ.. రాయల్ లైఫ్ స్టైల్ గురించి మీకు తెలుసా? ఆయన వాడే ఖరీదైన వస్తువులేంటి..?

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్..
పుష్ప రెండు సినిమాల తరువాత అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప2 సినిమాతో దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాశాడు బన్నీ. దాంతో బాలీవుడ్ నుంచి కూడా ఐకాన్ స్టార్ తో సినిమా చేయడానికి బన్సాలీ లాంటిస్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ వేరు.. ఆయనతో సినిమా చేయాలంటే.. 500 కోట్లకు పైగా బడ్జెట్ ఉండాల్సిందే. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా కూడా 800 నుంచి 1000 కోట్ల మధ్య బడ్జెట్ తో రూపొందుతున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ రెమ్యునరేషన్..
ఒకప్పుడు 30 నుంచి 40 కోట్లకే పరిమితం అయిన అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. సూపర్ ఫాస్ట్ గా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. ఐకాన్ స్టార్ ప్రస్తుతం ఒక సినిమాకు 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ను వసూలు చేస్తున్నట్టు టాక్. అయితే ఇది రెమ్యునరేషన్ గా కాకుండా.. సినిమా లాభాల్లో వాటాల పద్దతిలో తీసుకుంటాడటని తెలుస్తోంది. పుష్ప2 సినిమాతో పాటు.. అట్లీతో చేస్తున్న భారీ బడ్జెట్ సీనిమాకు బన్నీ ఇదే ఫాలో అయినట్టు సమాచారం. ఇదే నిజం అయితే.. రెమ్యునరేషన్ విషయంలో.. అల్లు అర్జున్ దగ్గరలో కూడా ఏ హీరో లేడనే చెప్పాలి..
సినిమాలతో పాటు బిజినెస్ లో కూడా..
అల్లు అర్జున్ సంపాదన సినిమాలతో మాత్రమే ఆగిపోలేదు.. బ్రాండ్ ప్రమోషన్లు, బిజినెస్ లతో కూడా భారీగా కూడబెడుతున్నాడు బన్నీ..స్విగ్గీ లాంటిపెద్ద పెద్ద సంస్థల యాడ్స్ లో నటించి.. కోట్లు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడు. వాటితో పాటు బిజినెస్ లో కూడా బన్నీ రాణిస్తున్నాడు. ఆయనకు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి.. వాటి ద్వారా కూడా లక్షల్లో లాభాలు వస్తున్నాయి. ఇక ఇవి కాకుండా థియేటర్ వ్యాపారంలో కి కూడా దిగాడు బన్నీ.. ఈమధ్య కాలంలో ఏసియన్ భాగస్వామ్యంతో ఓ మాల్ ను రన్ చేస్తున్నాడు. అది కాకుండా రీసెంట్ గా కోకాపేటలో.. అల్లు సినిమాస్ పేరుతో సొంతంగా ఓ మాల్ ను ఓపెన్ చేశాడు బన్నీ. సినిమాలు మాత్రమే కాకుండా.. బిజినెస్ లో కూడా కోట్లు గడిస్తున్నాడు.
ఐకాన్ స్టార్ కాస్ట్లీ లైఫ్ స్టైల్..
అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే.. తగ్గేదే లే అంటాడు బన్నీ. బ్రాండెడ్ బట్టలు, కాస్ట్లీ వాచ్ లు, లగ్జరీ వెహికిల్స్, ఇలా ఏదైనా సరే లక్షలు, కోట్లలో ఉండాల్సిందే. అల్లు అర్జున్ వాచ్ కలెక్షన్ లోనే.. దాదాపు 10 పైగా లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయని తెలుస్తోంది. లక్షలు కోట్లు విలువ చేసే వాచ్ కలెక్షన్ బన్నీ సొంతం. ఇక బట్టల విషయంలో కూడా ఆయన బ్రాండ్ మిస్ అవ్వరు.. ఓ ఈవెంట్ కోసం ఆయన వేసుకుని వచ్చిన టీషర్ట్ విలువే 60 వేలకు పైమాటే.. మరి స్పెషల్ అకేషన్లలో ఐకాన్ స్టార్ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుందో ఊహించడం కష్టం. ఇలా ఏ విషయంలోను తగ్గకుండా మెయింటేన్ చేస్తూ.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు బన్నీ.
బన్నీ గ్యారేజ్ లో కార్ల కలెక్షన్..
అల్లు అర్జున్ కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.. ఆయన గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే బ్రాండెడ్ కార్లు చాలా ఉన్నాయి. సందర్భం ప్రకారం అల్లు అర్జున్ వాటిని వాడుతుంటారు. అంతే కాదు బన్నీకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా తన కార్లను ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇక అల్లు అర్జున్ గ్యారేజ్ లో ఉన్న కాస్ట్లీ కార్లు ఇవే. వీటి విలువ దాదాపు 12 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
రోల్స్ రాయిస్ కల్లినన్ (Rolls Royce Cullinan).
రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue).
హమ్మర్ H2 (Hummer H2).
వోల్వో XC90 T8 ఎక్సలెన్స్ (Volvo XC90 T8 Excellence).
మెర్సిడెస్ GLE 350d (Mercedes GLE 350d).
జాగ్వార్ XJ L (Jaguar XJ L).
BMW X6 M స్పోర్ట్ (BMW X6 M Sport).
బెంట్లీ కాంటినెంటల్ (Bentley Continental).
100 కోట్ల ఇల్లు.. స్పెషల్ ఫ్లైట్ కూడా..
ఇక అల్లు అర్జున్ కు జూబ్లీ హిల్స్ లో తన తండ్రితో పాటు ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాడు. ఆ ఇంటి విలువ 100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అది కాకుండా బన్నీ.. తన సొంతంగా ఓ పెద్ద ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆ ఇల్లు కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించుకుంటున్నాడట ఐకాన్ స్టార్. ఈ ఇంటి విలువ 100 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఇక ఇవి కాకుండా అల్లు అర్జున్ సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నాడు. దీని విలువ 80 కోట్లు ఉంటుంది అంచనా. అంతే కాదు ఆయన తన షూటింగ్స్ కోసం ఫాల్కన్' అనే వానిటీ వ్యాన్ కూడా స్పెషల్ గా తయారు చేయించారు. దాని విలువ 7 కోట్ల వరకూ ఉంటుందని అంచన.. ఇందులో ఎన్నో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. జిమ్, బార్, బెడ్ , మ్యూజిక్ సిస్టమ్, మేకప్ ఏరియా లాంటివి ఇందులో ఉంటాయి.
అల్లు అర్జున్ కోసం స్టార్ డైరెక్టర్ల వెయిటింగ్
అల్లు అర్జున్ లైఫ్ ను చాలా హ్యాపీగా గడపడానికి ఇష్టపడతాడు..అనవసరమైన టెన్షన్స్ ను దగ్గరకు రానివ్వడు.. సినిమాలు లేకుంటే.. ఎక్కువగాటైమ్ ను ఫ్యామిలీకి కేటాయిస్తాడు.. తన భార్యపిల్లలతో ఫారెన్ టూర్లు వేస్తుంటాడు.ఫ్యామిలీ తరువాత ఫ్రెండ్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తాడు బన్నీ.. తన స్నేహితులతో గడపడం అంటే కూడా అల్లు అర్జున్ కు చాలా ఇష్టం. ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ కూడా షేర్ చేస్తుంటాడు. మొత్తంగా అల్లు అర్జును భారీగా సంపాదిస్తూ.. రాయల్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ స్థాయిలో మూవీ చేస్తున్నాడు బన్నీ.. ఆతరువాత పుష్ప3 సెట్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది. బాలీవుడ్ లో ఓ భారీ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కోసం దాదాపు అరడజనుకుపైగా దర్శకులు ఎదరుచూస్తున్నారు. మరి నెక్ట్స్ అవకాశం ఎవరికి ఇస్తాడో చూడాలి.

