నయనతారకు ఒక న్యాయం, విజయ్ కు మరో న్యాయమా, లేడీ సూపర్ స్టార్ కు ధనుష్ మరో షాక్
కాపీరైట్ వివాదంలో నయనతారను 10 కోట్లు అడిగిన దనుష్, ఇప్పుడు విజయ్ 'జననాయకన్' సినిమాకి ఫ్రీగా సాయం చేసి.. లేడీ సూపర్ స్టార్ కు మరో షాక్ ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే?

నయనతారకు మరో షాక్ ఇచ్చాడు సౌత్ స్టార్ హీరో ధనుష్. నయనతార విషయం కాస్త కూడా కరగని ఈ స్టార్ హీరో అటు శింబు విషయంలో సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇక తాజాగా విజయ్ దళపతికి కూడా సినిమా విషయంలో సపోర్ట్ చేసిన స్టార్ మీరో.. నయనతారకు మాత్రం 10 కోట్ల ఫైన్ వేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే?
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దనుష్ నటించిన 'కుబేరా' సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇక ధనుష్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో 'తెరే ఇష్క్ మే' సినిమాలో నటించారు. ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. దనుష్ దర్శకత్వం వహించి నటించిన 'ఇడ్లీ కడై' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది.
ఇక ధనుష్ వరుస సినిమాలతో పాటు వివాదాలతో కూడా వైరల్ అవుతున్నాడు. మరీ ముఖ్యంగా నయనతారతో వివాదం గట్టిగా ముదిరింది. నయనతార పెళ్లి డాక్యుమెంటరీలో 'నానుం రౌడీ దాన్' షూటింగ్ వీడియో ఉండటంతో, దానిని తొలగించకపోతే 10 కోట్లు ఇవ్వాలని దనుష్ నయనతారకు నోటీసులు పంపించారు. దాంతో ధనుష్ పై ఘాటు విమర్శలు చేసింది నయనతార. ఈ విషయంలో దనుష్ నయనతారపై కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసుకోర్టు లో నడుస్తోంది.
కాపీరైట్ వివాదంలో నయనతారతో గొడవ పడిన దనుష్, సింబుతో వెట్రిమారన్ 'వడ చెన్నై' సినిమాకి 20 కోట్లు అడిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది పుకారు అని వెట్రిమారన్ చెప్పారు. దనుష్ తన సినిమా కోసం ఉచితంగా సహాయం చేసినట్లు చెప్పారు. అలా నయనతార విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్న ధనుష్ శింబు కోసం ఫ్రీగా సాయం చేశారు.
ఇక తాజాగా ధనుష్ విజయ్ 'జననాయకన్' సినిమాకి కూడా ఇలానే సాయం చేసినట్టు తెలుస్తోంది. దనుష్ సినిమా కోసం 4 కోట్లతో సెట్ వేశారట. ఆ సెట్‌లో దనుష్ షూటింగ్ అయిపోయాక, విజయ్ సినిమా పాట చిత్రీకరణకు అనుమతి అడిగారట. దనుష్ ఏమాత్రం డబ్బులు ఆశించకుండా అందులో షూటింగ్ చేసుకోవడానికి వెంటనే ఒప్పుకున్నారట. సింబు, విజయ్ సినిమాలకు ఉచితంగా సహాయం చేసిన దనుష్, నయనతారను మాత్రం వదలడంలేదు. ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.