- Home
- Entertainment
- హీరోయిన్ల విషయంలో ప్రభాస్ కండీషన్లు, డైరెక్టర్లకు రెబల్ స్టార్ వార్నింగ్ ఏంటో తెలుసా?
హీరోయిన్ల విషయంలో ప్రభాస్ కండీషన్లు, డైరెక్టర్లకు రెబల్ స్టార్ వార్నింగ్ ఏంటో తెలుసా?
ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారా..? డైరెక్టర్లలకు కండీషన్స్ అప్లై అంటున్నాడు ప్రభాస్. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ప్రభాస్ పెట్టే మెయిన్ రూల్ ఏంటో తెలుసా? అసలు ప్రభాస్ ఇలా రూల్స్ బుక్ పెట్టడానికి కారణం ఏంటి?
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియన్ హీరో ప్రభాస్. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించిన ఈ హీరో.. గెలుపోటలములు లెక్క చేయకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దాదాపు పదేళ్ళకుసరిపడా సినిమాలు సెట్ చేసుకుని ఉన్నాడు ప్రభాస్. ఒకదాని తరువాత మరొకటి కంప్లీట్ చేస్తూ.. ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ సినిమా కోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు . ఇక హీరోయిన్లు అయితే ప్రభాస్ సినిమాలో ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.
Also Read: దివ్య భారతి మరణంతో ఆగిపోయిన 10 సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
ప్రభాస్ సినిమాలో కొద్దిసేపు కనిపించినా చాలు అనుకునే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం ప్రభాస్ చాలా స్ట్రీక్ట్ గా ఉంటున్నారట. సినిమా స్టార్ట్ కావడానికి ముందే డైరెక్టర్లకు తన రూల్ ఏంటో చెప్పేస్తున్నాడని టక్.
అలా అయితేనే సినిమా చేస్తానని ముఖం మీదే అనేస్తున్నాడట ప్రభాస్. హీరోయిన్ల విషయంలో ప్రభాస్ పెట్టే రూల్స్ ఏంటంటే? హీరోయిన్లను రిపిట్ చేయడానికి ప్రభాస్ ఒప్పుకోవడంలేదని తెలుస్తోంద. గతంలో అలా చేసినందుకే ఓ హీరోయిన్ తనను ఇబ్బందిపెట్టిందని తెలుస్తోంది. అందుకే ఆయన ఈనిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
ఒక్క సారి ఒక హీరోయిన్ తో సినిమా చేస్తే మరోసారి ఆ హీరోయిన్ ను రిపిట్ చేయవద్దు అని మేకర్స్ కు చెప్పేస్తున్నాడట ప్రభాస్. అంతే కాదు హీరోయిన్లతో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో కూడా శృతి మించేలా ఉండవద్దు అని ముందే హెచ్చరిస్తున్నాడట. ఈ విషయంలో తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టోదని, లిమిట్ లో ఉండేలా.. డోస్ కాస్త తగ్గించమంటున్నాడట.
Also Read:40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?
ఇలా ప్రభాస్ సినిమా చేయాలంటే కండీషన్స్ మస్ట్ గా ఫాలో అవ్వాలని తెలుస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. నెట్టింట మాత్రం ఈవిషయం వైరల్ అవుతోంది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’సినిమాతో పాటు హను రాఘవపూడి తో ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. రాజా సాబ్ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది, ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక సలార్ 2, కల్కీ 2 సినిమాలు కూడా షూటింగ్ స్టార్ట్ కావల్సి ఉంది. మరి ఆసినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో చూడాలి. అంతే కాదు కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కాబోతోంది.
Also Read:బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?