MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇంట్లో నుంచి గెంటేస్తానన్న సుమిత్ర-శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్

Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇంట్లో నుంచి గెంటేస్తానన్న సుమిత్ర-శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మే 1వ తేదీ)లో బావే నా మెడలో మూడు ముళ్లు వేయాలన్న జ్యో. ఇంట్లో నుంచి గెంటేస్తానన్న సుమిత్ర. స్వప్నపై శ్రీధర్ సీరియస్. హార్ట్ స్ట్రోక్ తో పడిపోయిన శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. 

3 Min read
Author : Kavitha G
Published : May 01 2026, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో నీ కూతురు అలా మాట్లాడుతుంటే చూస్తావేంటి దశరథ.. నువ్వేం చెప్పవా అని అడుగుతాడు శివన్నారాయణ. తప్పు చేశాను నాన్న. కార్తీక్ నీ భర్త అని జ్యోత్స్నతో చెప్పి చెప్పి తప్పు చేశాను. ఇప్పుడు తను చిన్న పిల్ల కాదు.. అర్థం చేసుకోవాలి. ఒక తల్లిగా సుమిత్ర న్యాయంగానే మాట్లాడుతోంది అంటాడు దశరథ. నా ఇష్టం గురించి చెప్తే మీకు న్యాయం గుర్తొచ్చిందా? నా మెడలో బావే మూడు ముళ్లు వేయాలి అని గట్టిగా అరిచి చెప్తుంది జ్యోత్స్న. చెప్తే అర్థం కాదా.. నువ్వు అసలు మనిషివేనా అని జ్యోత్స్నను అసహ్యించుకుంటుంది సుమిత్ర.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
షాక్ ఇచ్చిన పారు
Image Credit : Jiohotstar

షాక్ ఇచ్చిన పారు

ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ.. బావకు నేనంటే ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని ఒక్కరైనా అడిగారా అంటుంది జ్యోత్స్న. నువ్వంటే ఇష్టం లేదని కార్తీక్ నాకే ముందే చెప్పాడు అని షాక్ ఇస్తుంది పారు. కార్తీక్ లండన్ నుంచి రాగానే జ్యోత్స్న గురించి నాతో చెప్పాడు.. మీ అందరితో చెప్పమని కూడా చెప్పాడు అంటుంది పారు. మరి ఎందుకు చెప్పలేదు అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. కుటుంబం రెండు ముక్కలు కాకూడదనే నేను ఎవ్వరితో చెప్పలేదు. ఆ తర్వాత చెప్పే అవకాశం కూడా నాకు రాలేదు అని నిజం చెప్తుంది పారు.

నీ ఆలోచనల వల్ల నష్టపోయింది నేను. నాకు న్యాయం జరగాలంటే బావే నా భర్త కావాలి అంటుంది జ్యోత్స్న. మరోసారి నీ నోటి నుంచి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటానని వచ్చిందంటే ఇంట్లో నుంచి గెంటేస్తానని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. నువ్వు నా ప్రాణాలను కాపాడావు, నీ మీద నాకు ప్రేమ ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని ఎదుటి వాళ్ల జీవితాలతో ఆడుకుంటానంటే నేను అస్సలు ఊరుకోను. లోపలికి వెళ్లు అని గట్టిగా అరిచి చెప్తుంది సుమిత్ర. లోపలికి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

38
థాంక్స్ చెప్పిన సుమిత్ర
Image Credit : Jiohotstar

థాంక్స్ చెప్పిన సుమిత్ర

థాంక్స్ రా కార్తీక్. నీ వల్ల నా కూతురిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది సుమిత్ర. ఇది మన కుటుంబం అత్త. మన తప్పులను మనమే సరిదిద్దుకోవాలి. నెలరోజుల్లో ఎలాగైనా జ్యోత్స్న పెళ్లి చేయాలి అంటాడు కార్తీక్. శివన్నారాయణ కూడా కార్తీక్, పారులను మెచ్చుకుంటాడు.

48
శ్రీధర్ సీరియస్
Image Credit : Jiohotstar

శ్రీధర్ సీరియస్

మరోవైపు శ్రీధర్ టిఫిన్ చేస్తూ ఉంటాడు. స్వప్న వచ్చి ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి వెళ్తాను నాన్న అని చెప్తుంది. బయట పరిస్థితులు బాగోలేవు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు శ్రీధర్. ఈ మనిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయేంత వరకు నేను ఇంటికే రానని గట్టిగా చెప్తుంది స్వప్న. ఇలా మొండిగా ప్రవర్తిస్తేనే.. జ్యోత్స్నను ఆ వైరా కిడ్నాప్ చేశాడు. కార్తీక్ కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు. నా కూతురిని కూడా ఎవరైనా కిడ్నాప్ చేశామని చెప్తే నాకు ఎలా ఉంటుందో ఆలోచించూ.. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండు అని ఆఫీసుకు బయల్దేరుతాడు శ్రీధర్.

58
సారీ చెప్పిన సుమిత్ర
Image Credit : Jiohotstar

సారీ చెప్పిన సుమిత్ర

వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది దీప. సుమిత్ర వచ్చి జ్యోత్స్న మాట్లాడిన మాటలు నిన్ను ఎంత బాధపెట్టాయో నేను ఊహించగలను.. తన తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అంటుంది. మీరు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా అంటుంది దీప. తల్లి లేకున్నా నువ్వు చక్కగా పెరిగావు. ఒక్కగానొక్క కూతురని గారాబం చేసి నేను జ్యోత్స్న విషయంలో తప్పు చేశాను అని బాధపడుతుంది సుమిత్ర. నా తల్లిని ఎంత బాధపెడుతున్నావు జ్యోత్స్న అని మనసులో అనుకుంటుంది దీప.

68
శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్
Image Credit : Jiohotstar

శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్

మరోవైపు స్వప్న మాటలను గుర్తుచేసుకుంటూ కారు డ్రైవ్ చేస్తుంటాడు శ్రీధర్. సేమ్ టైంలో జ్యోత్స్నకు బొమ్మల షాప్ లో ఎదురైన కొత్త క్యారెక్టర్ (కొత్త హీరో) కూడా క్యాబ్ లో వస్తుంటాడు. మరోవైపు శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. కారు ఆపి, కార్తీక్ కి కాల్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ ఆలోపే స్పృహ తప్పి పడిపోతాడు. అక్కడికి వచ్చిన జనాలు అంబులెన్స్ కు కాల్ చేస్తారు. అప్పుడే అక్కడకు వచ్చిన కొత్త హీరో, శ్రీధర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. కార్తీక్ కి కూడా ఫోన్ చేసి చెప్తాడు.

78
కార్తీక్ బాధ
Image Credit : Jiohotstar

కార్తీక్ బాధ

కార్తీక్ హడావిడిగా హాస్పిటల్ కి వెళ్లి బెడ్ మీద ఉన్న శ్రీధర్ ని చూసి బాధపడతాడు. నిన్ను కాపాడింది ఎవరు మాస్టారు, తనకి థాంక్స్ చెప్పాలి అంటాడు కార్తీక్. మెడిసిన్ కోసం వెళ్లాడు అని శ్రీధర్ చెప్తే.. సరే కలిసొస్తా అని చెప్పి బయటకు వెళ్తాడు కార్తీక్.

88
సారీ చెప్పిన కార్తీక్
Image Credit : Jiohotstar

సారీ చెప్పిన కార్తీక్

అనుకోకుండా కొత్త హీరోని ఢీ కొడతాడు కార్తీక్. అతని చేతిలో పేపర్ కింద పడిపోతాయి. సారీ చెప్పి పడిపోయిన పేపర్స్ తీసి ఇస్తుండగా శ్రీధర్ పేరు కనిపిస్తుంది. దాంతో అతని వైపు చూస్తూ నిలబడిపోతాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కార్తీక్ ప్లాన్-ఇరుక్కున్న జ్యో-న్యూ క్యారెక్టర్ ఎంట్రీ-పెళ్లిచూపులు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved