MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర

Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 30)లో జ్యో మనసులో మాట చెప్పించిన కార్తీక్. బావతోనే నా పెళ్లి అని చెప్పిన జ్యో. ఛీ కొట్టిన కార్తీక్. దీప తాళి తెంపే ప్రయత్నం చేసిన జ్యో. లాగిపెట్టి కొట్టిన దీప, సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Apr 30 2026, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో మీ కోసం అన్ని అర్హతలున్న అబ్బాయిని వెతికి తీసుకువస్తే పెళ్లిచూపులు ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారు ఎందుకు పెద్ద మేడం గారు అంటాడు కార్తీక్. నా చేతితో నా చెంపే పగలకొట్టుకునేలా చేశారు. చావు దెబ్బ కొట్టారు కదా బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

పారు, జ్యోత్స్నను అలా కూర్చోబెట్టు అంటాడు కార్తీక్. మీ అందరికీ పెళ్లి చూపులు అని ముందే తెలుసా? అని అడుగుతుంది జ్యోత్స్న. తెలుసు అని చెప్తారు అంతా. మరి నాకు చెప్పాల్సిన పని లేదా? అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వే కదా ఆ బాధ్యత కార్తీక్ గాడికి ఇచ్చావు అంటాడు శివన్నారాయణ. సైలెంట్ అవుతుంది జ్యోత్స్న.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జ్యోత్స్న షాక్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న షాక్

అబ్బాయి నచ్చితే ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి అంటాడు కార్తీక్. అందరికీ నచ్చాలి కదా అంటుంది జ్యోత్స్న. మాకు అందరికీ నచ్చాడు అని చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఇక చేసేదేమిలేక నాకు నచ్చలేదు అని ఓపెన్ అవుతుంది జ్యోత్స్న. ఎందుకు అని అడుగుతాడు శివన్నారాయణ. నచ్చలేదు అంటే నచ్చలేదు అంతే.. అంటుంది జ్యోత్స్న. అయితే మనకు మరో సంబంధం రెడీగా ఉంది అని చెప్తాడు కార్తీక్. నువ్వు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు నచ్చవు బావ అంటుంది జ్యోత్స్న.

నాతో మాట్లాడితే నేను మీకు నచ్చుతాను అంటాడు పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయి. రేయ్ పోరా ముందు ఇక్కడినుంచి అంటుంది జ్యోత్స్న. ఏంటి సార్, ఆమె నన్ను తిడుతుంది. ఈ డైలాగ్ లు సీన్ పేపర్లో లేవు కదా అని పేపర్ తీస్తాడు ఆ అబ్బాయి. దాంతో కార్తీక్ డ్రామా బయటపడుతుంది. ఏంటి ఇదంతా అని అడుగుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న మనసులో ఏముందో మీకు తెలియాలి కదా, అందుకే పారుతో కలిసి ఈ పెళ్లి చూపులు నాటకం ఆడానని చెప్తాడు కార్తీక్. షాక్ అవుతుంది జ్యోత్స్న.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:కార్తీక్ ప్లాన్-ఇరుక్కున్న జ్యో-న్యూ క్యారెక్టర్ ఎంట్రీ-పెళ్లిచూపులు
Related image2
Karthika Deepam 2 Today Episode: నెల రోజుల్లో జ్యో పెళ్లి-కాంచన డౌట్-కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన
37
డౌట్ తోనే ఇలా..
Image Credit : Jiohotstar

డౌట్ తోనే ఇలా..

మనుమడా నువ్వు మాట్లాడతావా, లేదా నన్ను మాట్లాడమంటావా అని అడుగుతుంది పారు. నేనే మాట్లాడతాను అని స్టార్ట్ చేస్తాడు కార్తీక్. నెల రోజుల్లో పెళ్లి జరగాలి, లేదంటే పెళ్లి యోగం లేదని పంతులు చెప్పాడు. అందుకే జ్యోత్స్న కోసం మంచి సంబంధం చూడాలనుకున్నా. కానీ ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది అని ఇలా పెళ్లి చూపుల డ్రామా ఆడాను అని చెప్తాడు కార్తీక్.

47
నీ మనసులో ఏముంది?
Image Credit : Jiohotstar

నీ మనసులో ఏముంది?

ఒకవేళ ఇదే నిజమైన సంబంధం అయి ఉంటే.. జ్యోత్స్న వల్ల అందరిముందు మన పరువు పోయేది. నీకు చెప్పాను కదా నీ అసలైన కూతురిని చూపిస్తాను అని. ఇది నీ కూతురి అసలు స్వరూపం. ఏం చేయమంటావో చెప్పు. నేను తన పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ తను లేదు. తన మనసులో ఏముందో పెళ్లికి ఎందుకు వద్దు అంటోందో అడుగు అంటాడు కార్తీక్. ఒక తల్లిగా నేనేప్పుడు నీ మంచే కోరుకుంటా. పెళ్లి చేసుకుంటా అన్నావు. ఇప్పుడు వద్దు అంటున్నావు. నీ మనసేంటో నాకు తెలియాలి అని జ్యోత్స్నతో అంటుంది సుమిత్ర.

57
శ్రీధర్ సలహా
Image Credit : Jiohotstar

శ్రీధర్ సలహా

మరోవైపు కిచెన్ లో పనిచేసుకుంటూ ఉంటుంది కావేరి. స్వప్న హెల్ప్ చేయడానికి వస్తే.. వద్దు అంటుంది. నిశ్చితార్థానికి రెడీ అన్నావు కదా, మరో రెండు రోజుల్లో జరిపించేస్తాం. అప్పటివరకు నాకు కాస్త దూరంగా ఉండు అంటుంది కావేరి. అదే కాశీతో ఉంటానంటే ఎగిరి గంతేసే దానివి కదా అంటుంది స్వప్న. కాశీ లాంటి మంచి భర్త దొరకడు, వదులుకోకు అని చెప్తుంది కావేరి. నాన్న మంచోడే కదా, మరి కాంచన పెద్దమ్మ ఎందుకు క్షమించట్లేదు. ఎందుకంటే ఆవిడ తనకు నచ్చినట్లు బతకాలి అనుకుంటోంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను అని అంటుంది స్వప్న.

వాళ్ల మాటలు పక్కనుంచి వింటూ ఉంటాడు శ్రీధర్. జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు. కాశీకి మళ్లీ అవకాశం ఇవ్వాలి కదా అంటుంది కావేరి. మళ్లీ అవకాశం ఇచ్చి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటుంది స్వప్న. అప్పుడే శ్రీధర్ వాళ్ల దగ్గరకు వచ్చి.. కాశీ గురించి నాలుగు మాటలు గొప్పగా చెప్తాడు. పెళ్లికి ఇంకా టైమ్ ఉంది కదా ఆలోచించుకో అని చెప్పి వెళ్లిపోతాడు.

67
జ్యో చెంప చెల్లుమనిపించిన దీప
Image Credit : Jiohotstar

జ్యో చెంప చెల్లుమనిపించిన దీప

మరోవైపు మీరు పంతులు చెప్పిన జాతకాన్ని నమ్మితే, నెల రోజుల్లో నా పెళ్లి జరుగుతుంది అంటుంది జ్యోత్స్న. సంబంధాలు చూడొద్దు అంటున్నావు, పెళ్లి జరుగుతుంది అంటున్నావు. అసలు నీ మనసులో ఏముంది అని అడుగుతుంది సుమిత్ర. బావ ఉన్నాడు. నేను బావను తప్పా ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని మనసులో మాట చెప్తుంది జ్యోత్స్న. షాక్ అవుతారు అంతా.

ఛీ కొడతాడు కార్తీక్. నీ బావ ఇప్పుడు నా భర్త. నా మెడలో తాళి కట్టాడు అని కోపంగా అటుంది దీప. నా మెడలో కూడా కడతాడు అని, దీప దగ్గరికి వెల్లి తాళి తెంపే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. లాగిపెట్టి కొడుతుంది దీప. అంతా షాక్ అవుతారు. 

77
కూతురి చెంప పగలకొట్టిన సుమిత్ర
Image Credit : Jiohotstar

కూతురి చెంప పగలకొట్టిన సుమిత్ర

సుమిత్ర వచ్చి, నా ముందే నా కూతురిని కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు? ఆ చనువు నువ్వు ఎందుకు తీసుకున్నావు.. ఆ పని చేయాల్సింది నేను కదా అని జ్యో చెంప పగలకొడుతుంది సుమిత్ర.

నీ మనసులో కార్తీక్ మీద ప్రేమ నింపింది మేమే.. కాదనట్లేదు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ ఆటలు. ఒకవేళ దీప మెడలో కార్తీక్ తాళి కట్టకపోయి ఉంటే నా తల తాకట్టు పెట్టి అయినా వాడిని నీ భర్తను చేసేదాన్ని. ఇప్పుడు కార్తీక్ మరో ఆడదానికి భర్త. నా మెడలో తాళి ఉన్నట్లే, దీప మెడలో తాళి ఉంది. దానికి ఓ విలువ ఉంది అంటుంది సుమిత్ర. నా ప్రేమకు విలువ లేదా అని అడుగుతుంది జ్యోత్స్న. ఛీ నోరుముయ్.. మాట్లాడకు అంటుంది సుమిత్ర. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Charan Remuneration: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన చరణ్‌ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా? పాపం
Recommended image2
DuckTales: 90s కిడ్స్ ఫేవరెట్ డోనాల్డ్ డక్ గుర్తున్నాడా? పిసినారి అంకుల్ స్క్రూజ్.. డక్‌టేల్స్ సిరీస్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కార్తీక్ ప్లాన్-ఇరుక్కున్న జ్యో-న్యూ క్యారెక్టర్ ఎంట్రీ-పెళ్లిచూపులు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: నెల రోజుల్లో జ్యో పెళ్లి-కాంచన డౌట్-కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved