MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:కార్తీక్ ప్లాన్-ఇరుక్కున్న జ్యో-న్యూ క్యారెక్టర్ ఎంట్రీ-పెళ్లిచూపులు

Karthika Deepam 2 Today Episode:కార్తీక్ ప్లాన్-ఇరుక్కున్న జ్యో-న్యూ క్యారెక్టర్ ఎంట్రీ-పెళ్లిచూపులు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 29వ తేదీ)లో జ్యో కోసం కార్తీక్, పారు, దీపల ప్లాన్. ఇరుక్కున్న జ్యో. కొత్త క్యారెక్టర్ ఎంట్రీ. జ్యోతో గొడవ. జ్యోకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన కార్తీక్. షాక్ అయిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Apr 29 2026, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో దీపకు ఫోన్ చేసిన పారు.. నీ సవతి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది. దీప కాస్త కోపంగా రియాక్ట్ అయితే.. నువ్వు ఊరుకుంటే జరిగేది అదే అని అంటుంది పారు. మరి ఏం చేద్దాం అంటాడు కార్తీక్. ముందు ఎలాగో అలా జ్యోత్స్న పెళ్లి చేసి పంపించి, దాని పీడ వదిలించుకో అంటుంది పారు. 

సరే అయితే రేపు దీప కోసం ఒక చీర కొను అంటాడు కార్తీక్. నేను చెప్పినదానికి, నువ్వే చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా అంటుంది పారు. ఉంది, జ్యోత్స్న మనసులో ఉన్న మాట అందరికి తెలియాలంటే నువ్వు దీప కోసం చీర తీసుకో, ఆ తర్వాత అది జ్యోత్స్నకు తెలిసేలా చెయ్, దాని తర్వాత కథ నేను నడిపిస్తాను అంటాడు కార్తీక్. నువ్వేదో గట్టిగానే ప్లాన్ చేశావ్.. సరే మనుమడా అని ఫోన్ కట్ చేస్తుంది పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కొత్త క్యారెక్టర్ ఎంట్రీ
Image Credit : Jiohotstar

కొత్త క్యారెక్టర్ ఎంట్రీ

మరుసటి రోజు తన ఫ్రెండ్ కూతురి కోసం బొమ్మలు కొనడానికి వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ ఒక కపుల్ బొమ్మ చూస్తుంది. అది కావాలని షాప్ ఓనర్ ని అడిగితే, వేరే వాళ్లు తీసుకున్నారని చెప్తాడు. అప్పుడే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. ఈ గిఫ్ట్ నాకు కావాలి అని అతడ్ని జ్యోత్స్న అడిగితే, నేను ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు అతను. బొమ్మ ధర కంటే రూ. 10వేలు ఎక్కువ ఇస్తాను అంటుంది జ్యోత్స్న. లక్ష ఇచ్చినా ఇవ్వను అంటాడు అతను. బోడి బొమ్మ కోసం ఇంత బిల్డప్ ఇస్తున్నావు అంటుంది జ్యోత్స్న. మనది కాని దాని మీద ఆశపడి, మనసు పాడు చేసుకోకు అని చెప్పి వెళ్లిపోతాడు అతను. జ్యోత్స్న కూడా కోపంగా వెళ్లిపోతుంది.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: ఆపేరషన్ జ్యోత్స్న-త్వరలో పెళ్లి- రంగం సిద్ధం చేసిన కార్తీక్
Related image2
Karthika Deepam 2 Today Episode: నెల రోజుల్లో జ్యో పెళ్లి-కాంచన డౌట్-కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన
36
కార్తీక్ ప్లాన్ సక్సెస్
Image Credit : Jiohotstar

కార్తీక్ ప్లాన్ సక్సెస్

మరోవైపు కొత్త చీరతో జ్యోత్స్న ముందుకు వస్తుంది పారు. ఈ చీర కట్టుకుంటే దీప ఎంత బాగుంటుందో అంటుంది. ఏంటీ ఆ చీర కథ అని అడుగుతుంది జ్యోత్స్న. నేను దీప కోసం చీర కొనాలి అనుకున్నాను. ఆన్ లైన్లో చూస్తే ఈ చీర నాకు నచ్చింది, కార్తీక్ కి చూపించాను సూపర్ గా ఉంది అన్నాడు. కార్తీక్ కి నచ్చిన చీర తన చేతులమీదుగా దీపకు ఇస్తే ఎంత బాగుంటుందో అంటుంది పారు. వెంటనే చీరను లాక్కుంటుంది జ్యోత్స్న. ఇది నా చీర, దీన్ని కట్టుకొని దీపకు ఎలా షాక్ ఇస్తానో చూడు అంటుంది జ్యోత్స్న.

46
జ్యో పెళ్లిచూపులు
Image Credit : Jiohotstar

జ్యో పెళ్లిచూపులు

కార్తీక్ ప్లాన్ సక్సెస్ అయిందని మనసులో అనుకుంటుంది పారు. కార్తీక్, దీప ఇంటికి రాగానే ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తుంది. అంతలో శివన్నారాయణ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. జ్యోత్స్నకు మంచి సంబంధం చూశానని చెప్పాను కదా.. అతను ఈ రోజు వస్తున్నాడని చెప్తాడు కార్తీక్. అబ్బాయి ఎవరు, పెళ్లి తర్వాత ఇక్కడే ఉండాలని చెప్పావా అని అడుగుతుంది సుమిత్ర. ముందు పెళ్లి కానివ్వు తర్వాత చూద్దాం అంటాడు కార్తీక్. ఇంతలో ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతనే పెళ్లికొడుకు అని కార్తీక్ పరిచయం చేస్తాడు. ఆ తర్వాత అందరూ అతనితో మాట్లాడతారు. జ్యోత్స్ను తీసుకురమ్మని పారు, దీపలతో చెప్తాడు కార్తీక్.

56
ఇరుక్కున్న జ్యోత్స్న
Image Credit : Jiohotstar

ఇరుక్కున్న జ్యోత్స్న

చీర కట్టుకొని రెడీ అవుతుంటుంది జ్యోత్స్న. దీప, పారు వెళ్తారు. నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని కోపంగా అంటుంది దీప. త్వరలో బావను కూడా కొట్టుకోబోతున్నాను అంటుంది జ్యోత్స్న. చీర ఇస్తావా లేదా? అని అడుగుతుంది దీప. ఇవ్వను అంటుంది జ్యోత్స్న. సరే నువ్వు ఈ చీరతో కార్తీక్ ముందుకు వెళ్లకు, వాడు నన్ను తిడతాడు అంటుంది పారు. కచ్చితంగా వెళ్తాను అని హాల్లోకి వెళ్తుంది జ్యోత్స్న. నవ్వుకుంటూ వెనకాలే వెళ్తారు దీప, పారు.

66
జ్యోత్స్న షాక్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న షాక్

జ్యోత్స్న చీరలో రావడం చూసి సంతోషపడుతుంది సుమిత్ర. జ్యోత్స్న, కార్తీక్ ని చూస్తుంటే నీకో సర్ ప్రైజ్ అని పక్కకు జరిగి పెళ్లికొడుకును చూపిస్తాడు కార్తీక్. ఇతనెవరు అని అడుగుతుంది జ్యోత్స్న. మా బావే నాకు కాబోయే భర్తను చూస్తాడని నా భుజాలపై పెద్ద భారాన్ని పెట్టావు కదా.. ఇదిగో చూశాను ఇతనే పెళ్లికొడుకు అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Recommended image3
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: ఆపేరషన్ జ్యోత్స్న-త్వరలో పెళ్లి- రంగం సిద్ధం చేసిన కార్తీక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: నెల రోజుల్లో జ్యో పెళ్లి-కాంచన డౌట్-కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved