MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే

OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే

OTT Movies: ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా తెలుగు సినిమాలు దుమ్ములేపుతున్నాయి. తెలుగుతోపాటు తమిళ చిత్రాలు కూడా ట్రెండ్‌ అవుతున్నాయి. మరి ఇండియా వైడ్‌ ప్రైమ్‌ టాప్‌ 10 చిత్రాలేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 11 2026, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రైమ్‌ ఇండియా టాప్‌ 10 మూవీస్‌
Image Credit : Asianet News

ప్రైమ్‌ ఇండియా టాప్‌ 10 మూవీస్‌

ఓటీటీలకు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. ఓటీటీ కంటెంట్‌ని ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. దీంతో సినిమాలు థియేటర్లో కంటే ఓటీటీలోనే బాగా ఆడుతున్నాయి. కామెడీ చిత్రాలు, థ్రిల్లర్స్ , యాక్షన్‌ ఫిల్మ్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. విచిత్రం ఏంటంటే థియేటర్లో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధిస్తున్నాయి. మేకర్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ప్రైమ్‌ వీడియోస్‌లో థియేటర్లో యావరేజ్‌ ఆడిన సినిమాలు టాప్‌ లో ఉండటం ఓ విశేషమైతే, అందులో తెలుగు సినిమాలు దుమ్ములేపుతుండటం మరో విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెంబర్‌ 1లో డెకాయిట్‌ ట్రెండింగ్‌
Image Credit : Asianet News

నెంబర్‌ 1లో డెకాయిట్‌ ట్రెండింగ్‌

ప్రైమ్‌  వీడియోలో తెలుగు సినిమాలు హవా చూపిస్తున్నాయి. టాప్‌ 10లో తెలుగువే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక మొదటి ప్లేస్ లో అడవి శేష్‌ నటించిన `డెకాయిట్‌` ఉంది. ఇది థియేట్రికల్‌గా ఆకట్టుకోలేకపోయింది. ప్రారంభంలో ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత డీలా పడింది. నిర్మాతలు, బయ్యర్లకి నష్టాలను మిగిల్చింది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్‌ రాజ్‌, అనురాగ్‌ కశ్యప్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో మొదటి స్థానంలో ట్రెండ్‌ కావడం విశేషం. 

36
రెండో స్థానంలో నందు అగ్లీ స్టోరీ ట్రెండింగ్‌
Image Credit : Instagram

రెండో స్థానంలో నందు అగ్లీ స్టోరీ ట్రెండింగ్‌

ఇక రెండో స్థానంలో కూడా తెలుగు సినిమానే ఉంది. అడే `అగ్లీ స్టోరీ`. నందు, అవికా గోర్‌ జంటగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్‌ చిత్రమిది. థియేటర్లో డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్‌ 2లో ట్రెండ్‌ అవుతుంది. మూడో స్థానంలో హిందీ మూవీ `సిస్టెమ్‌` ఉంది. ఇందులో జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కూడా థియేటర్లో ఆడలేదు. కానీ ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్‌ 3లో ట్రెండ్‌ అవుతుంది.

46
నాల్గో స్థానంలో గోదారి గట్టుపైన
Image Credit : Asianet News

నాల్గో స్థానంలో గోదారి గట్టుపైన

ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా నాల్గో స్థానంలో మరో తెలుగు సినిమా ఉంది. అదే `గోదారి గట్టుపైన`. విలేజ్‌ లవ్‌ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ థియేటర్లో ఫర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ రచ్చ చేస్తోంది. గత వారం వచ్చిన ఈ మూవీ ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇందులో సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించగా, నిధి ప్రదీప్‌ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు.

56
ఐదో స్థానంలో కార్మేని సెల్వం
Image Credit : Asianet News

ఐదో స్థానంలో కార్మేని సెల్వం

ఐదో స్థానంలో తమిళ సినిమా కార్మేని సెల్వం ఉంది. సముద్రఖని, గౌతమ్‌ మీనన్‌, అభినయ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. బ్యాంక్‌ లోన్ల నేపథ్యంలో సాగుతుంది. అతికి పోయి జీవితంలో ఇబ్బంది పడే సంఘటన ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. అయితే ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. ఆరో స్థానంలోనూ మరో తమిళ సినిమా ఉంది. `సట్టెండ్రు మారుదు వానిలై` అనే మూవీ ట్రెండ్‌ అవుతుంది.

66
ఏడో స్థానంలో లెజెండ్‌ శరవణన్‌ లీడర్‌
Image Credit : X/@yoursthelegend

ఏడో స్థానంలో లెజెండ్‌ శరవణన్‌ లీడర్‌

ఏడో స్థానంలో ఇంకో తమిళ సినిమా ఉంది. లెజెండ్‌ శరవణన్‌ హీరోగా నటించిన `లీడర్‌`మూవీ ట్రెండ్‌ అవుతుంది. ఇందులో పాయల్‌ రాజ్‌పూత్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. థియేటర్లో మంచి ఆదరణ పొందిన ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ములేపుతుండటం విశేషం. 8వ స్థానంలో హాలీవుడ్‌ ఫిల్మ్ జాక్‌ ర్యాన్‌ `ఘోస్ట్ వార్‌` ఉంది. అలాగే తొమ్మిదో స్థానంలో `ప్రైమేట్‌`, పదవ స్థానంలో మరో కోలీవుడ్‌ ఫిల్మ్ `కాలిదాస్‌ 2` వంటి చిత్రాలు ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Recommended image2
Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Recommended image3
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Related Stories
Recommended image1
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Recommended image2
Balakrishna: వైజాగ్‌ స్టార్‌ హోటల్‌లో బాలయ్యకి సీక్రెట్‌రూమ్‌, అర్థరాత్రి దర్శకుడితో జంప్‌.. బాలయ్య రియాలిటీ రివీల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved