MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌

Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌

Vadde Naveen: ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన వడ్డే నవీన్.. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమాలకు గ్యాప్‌ ఇవ్వడంపై ఆయన స్పందించారు. మూడు కారణాలు వెల్లడించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 11 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన వడ్డే నవీన్‌
Image Credit : Asianet News

ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన వడ్డే నవీన్‌

`పెళ్లి`, `స్నేహితులు`, `మనసిచ్చి చూడు`, `చాలా బాగుంది`, `ప్రేమించే మనసు`, `ధనుష్‌`, `గురి`, `అయోధ్య` వంటి సినిమాలతో మెప్పించి ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు వడ్డే నవీన్‌. పదేళ్లలోనే ఇరవైకి పైగా సినిమాలు చేసి మెప్పించారు. హీరోగా రాణించారు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. టాలీవుడ్‌లో వడ్డే నవీన్‌ సినిమాల స్టయిల్‌ వేరేలా ఉంటుందని మాట్లాడుకునే వారు. అప్పట్లో పెద్ద నిర్మాత వడ్డే రమేష్‌ కొడుకు అయినా వడ్డే నవీన్‌ సొంతంగా నటుడిగా నిరూపించుకున్నాడు, హీరోగా ఎదిగాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు చిత్రంతో వడ్డే నవీన్‌ కమ్‌ బ్యాక్‌
Image Credit : Asianet News

ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు చిత్రంతో వడ్డే నవీన్‌ కమ్‌ బ్యాక్‌

కానీ సడెన్‌గా సినిమాలకు దూరమయ్యారు. 2010లో వచ్చిన `శ్రీమతి కల్యాణం` తర్వాత హీరోగా సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో ఒకటి రెండు చిత్రాల్లో మెరిసినా ఆయనకు పెద్దగా పేరు రాలేదు. ఈ క్రమంలో పూర్తిగా సినిమాలే వదిలేశారు. ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. తాజాగా ఆయన `ట్రాన్సఫర్‌‌ త్రిమూర్తులు` అనే చిత్రంలో నటించారు. దీనికి కమల్‌ తేజ నార్ల దర్శకత్వం వహించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ పతాకంపై నవీన్‌ ఈ మూవీని నిర్మించడం విశేషం. ఈ చిత్రం జూన్‌ 19న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వడ్డే నవీన్‌.. తనకు గ్యాప్‌ రావడానికి, తాను సినిమాలు చేయకపోవడానికి కారణం తెలిపారు.

34
సినిమాలకు గ్యాప్‌ ఇవ్వడంపై 3 కారణాలు
Image Credit : Asianet News

సినిమాలకు గ్యాప్‌ ఇవ్వడంపై 3 కారణాలు

వడ్డే నవీన్‌ సినిమాలు మానేయడానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్పారు. ఒకటి.. ప్రారంభంలో ఆయనకు మంచి విజయాలు దక్కాయి. కానీ ఆ తర్వాత ఆ స్థాయి హిట్స్ రాలేదు. దీంతో తనతో సినిమాలు చేస్తే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుంది. తన వల్ల ఎంత మంది లాస్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇక సినిమాలు మానేయాలనుకున్నారట. అదే సమయంలో తనకు నచ్చిన కథలు రావడం లేదట. రెగ్యూలర్‌, రొటీన్‌ స్టోరీస్‌ వచ్చాయట, మనసుకు నచ్చిన స్క్రిప్ట్ లు రాలేదని, దీంతో గ్యాప్‌ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు వడ్డే నవీన్‌. మూడోది.. అభిమానులను డిజప్పాయింట్‌ చేయడం. చాలా సార్లు డిజప్పాయింట్‌ చేశానని, ఇలా ఎన్నిసార్లు డిజప్పాయింట్‌ చేస్తానని చెప్పి కొంచెం బ్రేక్‌ తీసుకోవాలని అనుకున్నాడట నవీన్‌. సినిమా చేస్తే తనకు కాన్ఫిడెన్స్ రావాలని, అలాంటి సినిమా వస్తేనే చేద్దామని ఇన్నాళ్లు వెయిట్‌ చేశానని చెప్పాడు. ఇన్నాళ్లకి ఆ నమ్మకం కలిగిందని, అందుకే `ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` సినిమా చేశానని చెప్పాడు నవీన్‌.

44
త్రిమూర్తులు తో కమ్‌ బ్యాక్‌పై కామెంట్‌
Image Credit : Asianet News

త్రిమూర్తులు తో కమ్‌ బ్యాక్‌పై కామెంట్‌

తాను `ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` సినిమాతో కమ్‌ బ్యాక్‌ ఇవ్వడంపై వడ్డే నవీన్‌ స్పందిస్తూ, తన రీఎంట్రీ ఎలివేషన్లు, యాక్షన్‌తో సినిమా చేయాలని అనుకోలేదు, అలా చేస్తే, ఆడియెన్స్ కి తాను రీచ్‌ కాలేదు. పెద్ద పెద్ద పాత్రలు పెట్టినా వెంటనే ఆడియెన్స్ సొంతం చేసుకోలేరు, అదే కానిస్టేబుల్‌ అంటే అంతా హోన్‌ చేసుకుంటారు. ఈజీగా వారికి కనెక్ట్ అవుతాం. తాను గతంలోనూ ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలే చేశాను, ఇప్పుడు కూడా అదే స్టయిల్‌లో రావాలని చెప్పి ఈ సినిమా చేశానని, సాధారణ కానిస్టేబుల్‌.. తన ఫ్యామిలీ కోసం ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడనేది కథాంశంతో ఈ సినిమా సాగుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపారు వడ్డే నవీన్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Recommended image2
Balakrishna: వైజాగ్‌ స్టార్‌ హోటల్‌లో బాలయ్యకి సీక్రెట్‌రూమ్‌, అర్థరాత్రి దర్శకుడితో జంప్‌.. బాలయ్య రియాలిటీ రివీల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved