వివాదంలో కాంతార 2 , రిషబ్ శెట్టి ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేదు..
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న రిషబ్ శెట్టి.. కాంతార ప్రీక్వెల్ సినిమాతో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. రాజవంశం బ్యాక్ గ్రౌండ్ ను చూపించబోతున్నాడు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న కాంతార మూవీ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ ఎం జరిగింది.
- FB
- TW
- Linkdin
Follow Us

కాంతార
రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాంతార: చాప్టర్ 1. ఈసినిమా షూటింగ్ కర్ణాటకలోని గవిగుడ్డ సమీపంలో జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ పై స్థానికుల నుండి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో చిత్రీకరణ, వన్యప్రాణులకు ఆటంకం కలిగించడం వంటి పర్యావరణ నిబంధనల ఉల్లంఘన చేస్తున్నారంటూ జనాలు మండిపడుతున్నారు.
Also Read: అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..?
స్థానికుల ఆగ్రహం
కాంతార షూటింగ్ పై స్థానిక సామాజిక సంస్థలు, ముఖ్యంగా ఒక మాజీ జిల్లా పంచాయతీ సభ్యుడు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నిబంధనలను ఉల్లంఘించినందుకు చిత్ర బృందంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ
చిత్ర వివరాలు, వారసత్వ విస్తరణ
అక్టోబర్ 2, 2025న గాంధీ జయంతి సందర్భంగా కాంతార: చాప్టర్ 1 విడుదల కానుంది. కాంతార విశ్వం యొక్క చారిత్రక మూలాలను పరిశీలిస్తుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కదంబ రాజవంశం నేపథ్యంలో రూపొందింది. కాంతార ముందు జరిగిన చరిత్రను చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
వివాదాల మధ్య షూటింగ్
2023 నవంబర్‌లో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ నెల చివర్లో ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదాన్ని ఫేస్ చేస్తూనే ఉంది కాంతార ప్రీక్వెల్ మూవీ. మరి ఈసారైనా కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారా లేదా చూడాలి.