జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన దర్శకుడు ఎవరో తెలుసా..?
జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడా..? ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్ళిన తారక్ కోసం ఎదురు చూస్తున్న స్టార్ డైరెక్టర్ ఎవరు..?

బాహుబలి సక్సెస్ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్‌తో కలిసి చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా సినిమా సంచలనం సృష్టించింది. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృష్టించింది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ ఇద్దరూ తమ నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారైందని, త్వరలోనే ప్రకటిస్తానని రామ్ చరణ్ ఇంతకు ముందే చెప్పారు.
ఇప్పుడు జూనియర్ ఎన్‌టీఆర్ కూడా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టవచ్చనే హింట్ ఇచ్చాడు ఓ దర్శకుడు. ఆయన మన ఇండియన్ డైరెక్టర్ కూడా కాదు. ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ ఎన్టీఆర్ గురించి హింట్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరు ఆయన..ఏంటి కదా.. అంటే..? హాలీవుడ్ సూపర్ మూవీ.. సూపర్‌మ్యాన్ దర్శకుడు, ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ గన్ ఈ హింట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో సూపర్‌మ్యాన్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, సూసైడ్ స్క్వాడ్ సినిమాల దర్శకుడు జేమ్స్ గన్, జూనియర్ ఎన్‌టీఆర్ గురించి మాట్లాడారు.
Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..?
“ఆర్ఆర్ఆర్‌లో వ్యాన్ లోని పంజరం నుండి పులి, ఇతర జంతువులతో దూకే నటుడితో (ఎన్టీఆర్) పని చేయడానికి నేను ఇష్టపడతాను. అతను అద్భుతమైనవాడు. చాలా బాగా నటించాడు ఒక రోజు అతనితో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను” అని దర్శకుడు జేమ్స్ గన్ అన్నారు. ఆ సీన్ అతనికి బాగా నచ్చినట్టుంది. ఎన్టీఆర్ నటనకు ముగ్ధుడు అయ్యాడట గన్.
జూనియర్ ఎన్‌టీఆర్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జూనియర్ ఎన్‌టీఆర్ హాలీవుడ్‌కు వెళ్లడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 లో విలన్ గా నటిస్తున్నాడు జూనియర్ ఎన్‌టీఆర్ . కేజీఎఫ్, సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా జూనియర్ ఎన్‌టీఆర్ సినిమా చేస్తున్నారు.
Also Read: అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..?
గతంలో హాలీవుడ్ చిత్రకథా రచయిత ఆరోన్ స్టీవర్ట్ ఆన్ ఆర్ఆర్ఆర్‌లోని రామ్‌చరణ్ కోసం కథ రాయనున్నట్లు చెప్పారు. మాండీ (2018) మరియు క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్ (2022) చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ఆరోన్ స్టీవర్ట్ ఆన్, రామ్ చరణ్ కోసం సినిమా రాయాలనుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు తారక్ అలియాస్ జూనియర్ ఎన్‌టీఆర్‌కి హాలీవుడ్ అవకాశం ఎదురుచూస్తోంది.