MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Kangana Ranaut: నువ్వొక యూజ్‌లెస్‌.. పనిచూసుకో, కంగనా రనౌత్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది, ఎవరికో తెలుసా?

Kangana Ranaut: నువ్వొక యూజ్‌లెస్‌.. పనిచూసుకో, కంగనా రనౌత్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది, ఎవరికో తెలుసా?

Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరొకసారి ఘాటు వ్యాఖ్యలతో ఇచ్చిపడేసింది. తనపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 29 2026, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మరోసారి మాటలకు పదును పెట్టిన కంగనా
Image Credit : Kangana Ranaut Instagram

మరోసారి మాటలకు పదును పెట్టిన కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన మాటలకు పదును పెట్టారు. అనవసరంగా తనపై కామెంట్లు చేసిన CJP అధికార ప్రతినిధికి లెప్ట్ అండ్ రౌట్ ఇచ్చిపడేసింది. తన వయసు అనుభవం ముందు అతని స్థాయి ఏ పాటితో తెలిసేలా కామెంట్స్ చేసింది. రీసెంట్ గా కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కంగనా వ్యాఖ్యలను ఆమె సొంత పార్టీ నాయకులే తీవ్రంగా పరిగణించరని ఎద్దేవా చేశారు. యువత గానీ, జెన్ జెడ్ ప్రతినిధులు గానీ ఆమె మాటలను పట్టించుకోరని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన భాష మాట్లాడాలని హితవు పలికారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సౌరవ్ దాస్ పై తీవ్రంగా స్పందించిన కంగనా..
Image Credit : ANI

సౌరవ్ దాస్ పై తీవ్రంగా స్పందించిన కంగనా..

సౌరవ్ దాస్ వ్యాఖ్యలపై విరుచుకుపడింది బాలీవుడ్ నటి. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో కంగనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. "28 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా సౌరవ్ దాస్ ఇంకా తనను తాను విద్యార్థినని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అతను ఉన్న వయస్సులోనే నేను రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు సాధించాను. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నాను" అని గుర్తుచేశారు.

Related Articles

Related image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Related image2
Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?
34
నువ్వొక యూజ్‌లెస్‌.. ముందు పనిచూసుకో..
Image Credit : Instagram

నువ్వొక యూజ్‌లెస్‌.. ముందు పనిచూసుకో..

సౌరవ్ దాస్‌ను "పూర్తిగా పనికిరానివాడు, నిరుద్యోగి" అని ఘాటు కామెంట్స్ చేసిన కంగనా.. తన లైఫ్ గురించి వివరించింది. తాను ఒకే సమయంలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, వ్యాపారవేత్తగా, ఎంపీగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. నిరంతరం కష్టపడే బాధ్యతాయుతమైన జీవితం అంటే ఏమిటో నిరుద్యోగులకు అర్థం కాదని ఎద్దేవా చేశారు.

44
నిరసనకారులకు హెచ్చరిక
Image Credit : Asianet News

నిరసనకారులకు హెచ్చరిక

జెన్ జెడ్ ఆందోళనలపై తను చేసిన మునుపటి వ్యాఖ్యలను కంగనా సమర్థించుకున్నారు. బహిరంగంగా అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారు ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. ఇతరులను దూషించేవారు విమర్శలను తట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కంగనా - సౌరవ్ దాస్ మధ్య నడిచిన ఈ తీవ్రస్థాయి మాటల యుద్ధం ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved