MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?

Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?

Jana Nayagan: చాలా రోజుల ఎదురు చూపుల తరువాత రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది జన నాయగన్ . సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో భారీ అంచనాల నడుమ.. గ్రాండ్ గా మూవీని విడుదల చేశారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం జన నాయగన్ కు గట్టి దెబ్బే తగిలింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 29 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జన నాయగన్ కలెక్షన్స్
Image Credit : Asianet News

జన నాయగన్ కలెక్షన్స్

ఎన్నో రోజుల ఎదురుచూపుల తరువాత.. తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన జననాయగన్ సినిమా అద్భుతంగా ఉందని అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు కానీ.. కమర్షియల్ గా మాత్రం ఈసినిమాకు గట్టి దెబ్బే పడింది. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారని చెబుతున్న ఈ చిత్రం ఆరు రోజుల్లో 246 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించింది. 

వరల్డ్ వైడ్ గా 30 దేశాల్లో రిలీజ్ లైన విజయ్ చివరి చిత్రం 6 రోజు కలెక్షన్స్ చూసుకుంటే ఇండియాలో కేవలం 8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్లు 167 కోట్లు కాగా.. నెట్ కలెక్షన్స్ 147 కోట్లు, ఓవర్ సిస్ లో 78 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయసిన జన నాయగన్ సినిమా 250 కోట్ల కలెక్షన్ మార్క్ కు దగ్గరగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జన నాయగన్ నిరాశపరచడానికి 5 ప్రధాన కారణాలు
Image Credit : Instagram

జన నాయగన్ నిరాశపరచడానికి 5 ప్రధాన కారణాలు

తమిళ సూపర్‌స్టార్ విజయ్ దళపతి చివరి చిత్రంగా భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా, ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల 5 ముఖ్యమైన కారణాలు

Related Articles

Related image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Related image2
Salary: అమెరికాలో నెలకు 5 లక్షల పైన సంపాదిస్తే ఎంత మిగులుతుంది? ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా?
36
జన నాగయగన్ రిలీజ్ లేట్ అవ్వడం..
Image Credit : Instagram

జన నాగయగన్ రిలీజ్ లేట్ అవ్వడం..

విజయ్ సినిమా ప్లాప్ అవ్వడంలో ప్రధాన కారణం..రిలీజ్ లేట్ అవ్వడం. సెన్సార్ వివాదాలు, న్యాయపరమైన చిక్కుల వల్ల విజయ్ జననాయగన్ సినిమా అనుకున్న సమయం కంటే దాదాపు ఏడు నెలలు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సుదీర్ఘ నిరీక్షణ ఆడియన్స్ లో అభిమానుల్లో అంచనాలు పెంచేలా చేసింది. అంతే కాదు విజయ్ పొలిటికల్ హిట్ కంటీన్యూ అవుతున్న టైమ్ లో రిలీజ్ అయ్యి ఉంటే.. కాస్త ప్రభావం కనిపించేది. దళపతి సీఎం అయిన తరువాత ఈ సినిమాను కామన్ ఆడియన్స్ పట్టించుకోవడంలేదు.

46
రిలీజ్ కు ముందే సినిమా లీక్ అవ్వడం..
Image Credit : Instagram

రిలీజ్ కు ముందే సినిమా లీక్ అవ్వడం..

జననాయగన్ కు అతి పెద్ద దెబ్బ విడుదలకు ముందే చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు, లీక్‌ అవ్వడం. సాధారణంగా సినిమా రిలీజ్ కంటే ముందు చిన్న చిన్న ఫోటోలు, సెండ్స్ లో సీన్స్ లీక్ అవ్వడం సహజంగా మారింది. కానీ జన నాయగన్ సగం సినిమాకు పైగా సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సుకతను తగ్గించివేసింది. థియేటర్ కు వెళ్లి చూట్టానికి ఆడియన్స్ ఇష్టపడలేదు.

56
బాలకృష్ణ సినిమాకు రీమేక్ అవ్వడం..
Image Credit : youtube/@KVNProductions

బాలకృష్ణ సినిమాకు రీమేక్ అవ్వడం..

జన నాయగన్ సినిమా ప్లాప్ కి మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అవ్వడం వల్ల కూడా వసూళ్లపై దెబ్బ పడింది. ఈమూవీని ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. తెలుగులో తెలిసిన కథే కావడంతో ఇక్కడ జనాలు థియేటర్లకు వెళ్లరు. కానీ భగవంత్ కేసరి రీమేక్ అని తెలిసిన తరువాత తమిళ ఆడియన్స్ లో కూడా చాలామంది తెలుగు సినిమాను చూసేశారు. దాంతో ఈమూవీ కలెక్షన్స్ పై రీమేక్ ముద్ర ప్రభావం కూడా పడింది.

66
ఆకట్టుకోని కథనం - పొలిటికల్ మోత
Image Credit : Asianet News

ఆకట్టుకోని కథనం - పొలిటికల్ మోత

సినిమాలో కథనం కంటే ఎక్కువగా విజయ్ రాజకీయ ఇమేజ్‌ను ప్రమోట్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కథలో సహజసిద్ధమైన భావోద్వేగాలు తగ్గడం, ప్రతి సన్నివేశంలోనూ సుదీర్ఘమైన రాజకీయ ప్రసంగాలు, సందేశాలు డ్రామాను నీరుగార్చాయి. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగాల్సిన కథనం, బలవంతపు పొలిటికల్ ప్రచారంలా మార్చారన్న విమర్శ ఉంది. దాంతో ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడానికి ఇది ప్రధాన కారణమైంది.

బలహీనమైన ఎమోషనల్ బాండింగ్

ఈ కథకు విజయ్ , మమితా బైజు పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ఎంతో కీలకం. అయితే, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సరిగ్గా పండకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. అలాగే, బాబీ డియోల్ , ప్రకాష్ రాజ్ వంటి ప్రతిభావంతులైన నటులు ఉన్నప్పటికీ, వారి విలన్ పాత్రలను ఎంతో సాధారణంగా, డెప్త్ లేకుండా రూపొందించడం వల్ల కథలో ఘర్షణ పండలేదు. ఇలా మరికొన్ని కారణాల వల్ల జననాయగన్ సినిమా ప్లాప్ అయ్యింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image3
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Related Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Salary: అమెరికాలో నెలకు 5 లక్షల పైన సంపాదిస్తే ఎంత మిగులుతుంది? ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved