`ఆచార్య` షూటింగ్‌లో జాయినైన కాజల్‌.. మెగాస్టార్‌ ఆశీస్సులు తీసుకున్న కొత్త జంట

First Published Dec 15, 2020, 12:56 PM IST

కాజల్‌ `ఆచార్య` సెట్‌లోకి అడుగుపెట్టింది. తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఆమె షూటింగ్‌కి హాజరయ్యింది. ఈ సందర్బంగా చిరంజీవి, `ఆచార్య` చిత్ర బృందాన్ని గౌతమ్‌కి పరిచయం చేయడంతోపాటు, చిరుకి తన భర్తని ఇంట్రడ్యూస్‌ చేసింది. మెగాస్టార్‌ నుంచి ఆశీస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని అక్టోబర్‌ 30న ముంబయిలోని తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌లో ఘనంగా వివాహం చేసుకుంది.

కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది ఇతర ప్రముఖులు వీరి వివాహ వేడుకకి హాజరయ్యారు. ఆ తర్వాత హనీమూన్‌కి వెళ్ళి ఎంజాయ్‌ చేసిన ఈ జంట ఇప్పుడిప్పుడే  పెళ్ళి, హడావుడి నుంచి బయటపడ్డారు.

ఇక తాజాగా మంగళవారం కాజల్‌ తన భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చింది. అంతేకాదు `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొంది.

హైద‌రాబాద్ కోకాపేట లో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం ఉదయం కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లు ఆచార్య సెట్స్ కి విచ్చేసి చిత్ర‌ బృందాన్ని స‌ర్ ప్రైజ్ చేశారు.

కాజ‌ల్ - కిచ్లు జంట‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జంటతో  దండ‌లు మార్పించి కేక్ కట్ చేయించి మెగాస్టార్ చిరంజీవి కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

ఈ సెల‌బ్రేష‌న్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా  చిత్ర దర్శకులు   కొర‌టాల శివ‌, సినిమాటోగ్రాఫ‌ర్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్, సహ నిర్మాత అన్వేష్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

చిరంజీవి, కాజల్‌ జంటగా, కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం రూపొందుతుండగా, ఇందులో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ  ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్‌చరణ్‌, ఎస్. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?