- Home
- Entertainment
- NTR పోలికలు ఉండటం వల్లే జూ ఎన్టీఆర్‌ని తమ ఫ్యామిలీలో కలుపుకున్నారు.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
NTR పోలికలు ఉండటం వల్లే జూ ఎన్టీఆర్‌ని తమ ఫ్యామిలీలో కలుపుకున్నారు.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
NTR: జూ ఎన్టీఆర్.. నందమూరి ఫ్యామిలీలో కలవడానికి సంబంధించిన సీనియర్ నటి కాకినాడ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తారక్‌ని వారి ఫ్యామిలీలో కలవడానికి కారణం ఏంటో ఆమె బయటపెట్టింది.

తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్న ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు. ఆయన నటుడు, రాజకీయ నాయకుడు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కొడుకు అనే విషయం తెలిసిందే. హరికృష్ణ రెండో భార్య షాలిని భాస్కర్ రావులకు ఎన్టీఆర్ జన్మించారు. బాలనటుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పోలికలు ఉండటంతో ఎన్టీ రామారావు తారక్‌కి తన పేరుని నామకరణం చేశారు. అలా జూ ఎన్టీఆర్‌గా రాణిస్తున్నారు తారక్. అంతేకాదు నటుడిగానూ తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు.
నందమూరి ఫ్యామిలీతో జూ ఎన్టీఆర్‌కి గ్యాప్?
ఇదిలా ఉంటే ఇప్పుడు తారక్‌ని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఈ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలోనూ నందమూరి ఫ్యామిలీ తారక్ కుటుంబాన్ని దూరం పెట్టారని అన్నారు. హరికృష్ణ ఉన్నప్పుడు కూడా ఈ వార్తలు వచ్చాయి. కానీ ఆయన చనిపోయినప్పుడు అంతా కలిసిపోయారు. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ మూవీ, కళ్యాణ్ రామ్ చిత్రాలకు గెస్ట్ గా వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో తారక్ స్పందించకపోవడం వీరి మధ్య దూరాన్ని పెంచిందనేది ఇప్పుడు అందరిలోనూ వినిపించే మాట.
ఎన్టీఆర్ పోలికలు ఉండటం వల్లే కుటుంబంలో చేర్చుకున్నారు
పైకి వినిపించే కారణాలు కొన్ని, కానీ లోపల వేరే కారణాలున్నాయని అంటుంటారు. కారణం ఏదైనా ఇప్పుడు మాత్రం నందమూరి ఫ్యామిలీతో, నారా ఫ్యామిలీతో తారక్ కుటుంబానికి కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో సీనియర్ నటి కాకినాడ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేసింది. జూ ఎన్టీఆర్.. రామారావు రూపురేఖలు, ఆ నటనని పునికి పుచ్చుకున్నారని తెలిపింది. `ఆ కుర్రాడు ఎన్టీఆర్ పోలికలు ఉండటం, ఎన్టీఆర్‌లా పేరుతెచ్చుకున్నాడని తమ ఫ్యామిలీలోకి రానిచ్చారు కానీ, మామూలు వాడిని కలవనివ్వరు. కారణాలు చెప్పను, వాళ్ల వాళ్లనే చేర్చుకుంటారు. ఇప్పుడు కలవనివ్వడానికి కారణం నేమ్, ఫేమ్. పొలిటికల్‌గా కూడా రావచ్చు. అది దేవుడి దయ ఉంటే` అని చెప్పింది కాకినాడ శ్యామల. ఆర్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన కాకినాడ శ్యామల
కాకినాడకి చెందిన నటి శ్యామల `మరోచరిత్ర` చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇందులో హీరో కమల్ హాసన్‌కి తల్లిగా నటించింది. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాల్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చింది. కమల్ హాసన్ తోపాటు చిరంజీవి, బాలయ్య, శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీఆర్ ఇలా టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ఆమె దాదాపు 200లకుపైగా చిత్రాల్లో నటించింది. కాకినాడ శ్యామలగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అనాటి విషయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంది.
డ్రాగన్ తో బిజీగా ఉన్నా జూ ఎన్టీఆర్
ఇక ఎన్టీఆర్ చివరగా `వార్ 2` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆడలేదు. దీంతో కొత్తగా చేయాల్సిన మూవీస్ ఆగిపోయాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. 1970 కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్‌లో అప్పటి రాజకీయాలు, మాఫియా అంశాలను బేస్ చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు ప్రశాంత్ నీల్.

