- Home
- Entertainment
- MSG: అనిల్ రావిపూడి చేసిన పనికి చుట్టాల్లో ఇబ్బంది పడ్డ వెంకటేష్ భార్య, చిరంజీవి వద్ద వెంకీ ఆవేదన
MSG: అనిల్ రావిపూడి చేసిన పనికి చుట్టాల్లో ఇబ్బంది పడ్డ వెంకటేష్ భార్య, చిరంజీవి వద్ద వెంకీ ఆవేదన
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో వెంకటేష్ పాత్ర విషయంలో అనిల్ రావిపూడి చేసిన పనికి వెంకీ భార్య నీరజ తమ చుట్టాల్లో ఇబ్బంది పడిందట. ఈ విషయాన్ని చిరంజీవి వద్ద వెంకటేష్ వెల్లడించారు.

బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న మన శంకర వర ప్రసాద్ గారు
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వరప్రసాద్ గారు` మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే రెండు వందల కోట్లు దాటింది. త్వరలోనే అది మూడు వందల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఈ సంక్రాంతి కింగ్‌గా ఈ మూవీ దూసుకుపోతుంది. ఇందులో క్లైమాక్స్ లో వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన విషయం తెలిసిందే. వెంకీ గౌడగా పెద్ద పేరుమోసిన వ్యాపారవేత్తగా ఆయన కనిపించి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నారు. సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు.
వెంకటేష్ భార్య పరువు తీసిన వెంకీ గౌడ పాత్ర
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో వెంకీ గౌడగా వెంకటేష్ కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ పాత్రనే ఇప్పుడు వెంకటేష్ భార్యకి ఇబ్బందిని తెచ్చిపెట్టిందట. అందరిలో పరువు పోయేలా చేసిందట. ముఖ్యంగా చుట్టాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట.
నీరజ గౌడ అని పిలిచి ఎగతాళి చేశారు
వెంకటేష్ భార్య నీరజ ఇటీవల చుట్టాల్లో కలిసిందట. ఏదో అకేషన్‌గా అందరు కలవాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో అంతా నీరజని ఏకంగా నీరజ గౌడ అని పిలిచారట. సినిమాలో వెంకటేష్ నటించిన వెంకీ గౌడని ప్రస్తావిస్తూ, ఆయన భార్యని నీరజ గౌడ అంటూ ఆటపట్టించారట. దీంతో ఆమె అందరిలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యిందట. పరువు పోయినంత పని అయ్యిందని వెంకటేష్ వద్ద ఆమె తన ఆవేదన వ్యక్తం చేసిందట. ఈ విషయాన్ని వెంకటేష్.. చిరంజీవి వద్ద వెల్లడించారు.
చిరంజీవి వద్ద వెంకటేష్ ఆవేదన
చిరంజీవి, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఇటీవల టీమ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అంతా కలిసి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీకి సంబంధించిన చిట్ చాట్ చేశారు. ఇందులో వెంకటేష్ తన పాత్రకు వస్తోన్న స్పందనని పంచుకున్నారు. అందులో భాగంగా తన భార్య నీరజకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. అయితే ఆయన సరదాగా నవ్వుతూ ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. నవ్వుతూ చెబుతూనే, తన భార్య పది మందిలో ఎంబారిజింగ్‌గా ఫీలయ్యిందని చెప్పడం గమనార్హం.
సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ
చిరంజీవి హీరోగా, వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్ లో మెరిసిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేనా, హర్ష వర్థన్, అభినవ్ గోమటం, కేథరిన్ థ్రేస్సా, బుల్లిరాజు(రేవంత్), ఊహా, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది రెండు వందల కోట్లు దాటిందని టీమ్ పోస్టర్లు విడుదల చేయడం విశేషం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

