MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ తో భోజనం అంటే వణికిపోయిన జూనియర్ ఎన్టీఆర్, మలేషియాలో ఏం జరిగిందంటే..?

ప్రభాస్ తో భోజనం అంటే వణికిపోయిన జూనియర్ ఎన్టీఆర్, మలేషియాలో ఏం జరిగిందంటే..?

ప్రభాస్ తో భోజనమా.. అమ్మో అంటూ పారిపోయాడట జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ నే పరుగులు పెట్టించేంతగా ప్రభాస్ ఏం చేశాడు..? కారణం ఏంటి.. మలేషియాలో జరిగిన ఈ కథ మీకు తెలుసా..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2024, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి.. ఆయన పెదనాన్న కృష్ణం రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో వారు ఎంత పెద్ద స్టార్లో.. బయట కూడా అంత మంచి పేరు ఉంది వారికి. ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపిచే సంప్రదాయం వారి ఇంట్లో ఉంది. 

Al So Read: సుకుమార్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రాజుల కుటుంబం కావడంతో ఇంట్లో రోజు రెండు మూడు రకాల నాన్ వెజ్ వంటలు.. లెక్కలేనన్ని వెజ్ వెరైటీలు కామన్ గా ఉండేవట. ఇక ఏదైనా అకేషన్ ఉంటే పదుల సంఖ్యలో వంటలలతో ప్రభాస్ ఇల్లు ఘుమఘుమలాడిపోయేదట.

అంతే కాదు వారు ఏది తింటే..వచ్చే అతిథులకు..ఇంట్లో పనివారిక కూడా అదే భోజనం. వచ్చినవారి రాజుల భోజనం రుచిచూపించడం కృష్ణం రాజుతో పాటు ప్రభాస్ కు కూడా అలవాటు. అందుకే ఇంటికి ఎవరు వచ్చిన వారి కడుపుతో పాటు మనసు నింపి పంపించేవారట. 

Al So Read: పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా తినే ఆంధ్రా ఫుడ్

36

ఈక్రమంలో ప్రభాస్ షూటింగ్స్ లో కూడా ఆయనకు క్యారేజ్ తో పాటు.. యూనిట్ అంతటికి ప్రభాస్ తరపునుంచే భోజనాలు ఉంటాయట. ప్రభాస్ షూటింగ్ ఉందంటే.. యూనిట్ మొత్తానికి పండగే. ప్రోడక్షనర్ భోజనం ఎలా ఉన్నా.. ప్రభాస్ ఇంటి భోజనం కోసం లోట్టలు వేయాల్సిందే ఎవరైనా. 

ఇక ప్రభాస్ కోస్టార్స్  కు కూడా ఆయన నుంచే భోజనం  వస్తుంది. ఇలా ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన బాలీవుడ్ తారలెందరో.. ఇప్పటికీ ఆ విషయం తలుచుకుంటు.. మురిసిపోయి.. ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాగా హీరోలలో కూడా ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన వారు చాలామంది ఉన్నారు. 

Al So Read:పెద్ద వయసు హీరోలను పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు

46

అయితే వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్ తో లంచ్ అంటే భయపడతాడట. వణికిపోతాడట. కారణం ఏంటో తెలుసా..? మలేషియాలో ఓ సందర్భంలో కృష్ణం రాజుతో పాటు.. ప్రభాస్ కూడా తారక్ ను భయపడేలా చేశారట. ఇంతకీ వారిద్దరు కలిసి ఏం చేశారంటే..? 

మలేషియాలో బిల్లా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఎక్కవ శాతం అక్కడే షూటింగ్ జరిగింది. ఈ కథ కూడా అక్కడే నడుస్తుంది. ఈక్రమంలో షూటింగ్ యూనిట్ మొత్తానికి అక్కడే వంటలు ఏర్పాటు చేశారట కృష్ణం రాజు. తమ ఇంటి వంటవారిని అక్కడికి తీసుకెళ్లి.. రోజు యూనిట్  అంతటికి భారీ ఎత్తున వింధు భోజనం పెట్టించారట. 

Al So Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

56

కాగా ఓ రోజు షూటింగ్ లో ఓ అకేషన్ పెట్టుకుని.. దాదాపు 40 రకాల నాన్ వెజ్, వెజ్ వంటకాలతో పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేయించారట కృష్ణ రాజు. కాగా అదే సమయంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా మలేషియాలో ఉండటంతో.. ప్రభాస్ ను కలవడానికి తారక్ అక్కడికి వెళ్ళారట. ఎలాగు లంచ్ టైమ్ కావడంతో అందరు ఓ రూమ్ లో భోజనానికి కూర్చున్నారట. 

ఇక ఎన్టీఆర్ కూర్చున్న 5 నిమిషాలలోనే.. పైకి కూడా లేవకుండా.. చుట్టు.. 40 రకాల నాన్ వెజ్, వెజ్ కూరలు.. బిర్యానీలు.. ఆంధ్ర, ఫారెన్ మిక్స్ వెరైటీలు ఎన్నో తీసుకువచ్చి పెట్టేశారట. అవన్నీ చూసి ఎన్టీఆర భయపడిపోయారట. ఇవన్నీ తినాలా ఇప్పుడు. అమ్మే అనుకున్నారట. అంతే కాదు ప్రభాస్, కృష్ణం రాజును ఉద్దేశించి  ఓ మాట కూడా అన్నారట. 

Al So Read:బిగ్ బాస్ తెలుగు విన్నర్ ఎవరో తెలుసా...?

66

అమ్మో ఇన్ని ఐటమ్స్ ఆ... ఎరక్కపోయి ఇరుక్కున్నాను.. ఇక్కడ కూడా ఇన్ని ఐటమ్స్ ఆ.. భోజనంతో చంపేసేలా  ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా  అంటూ గట్టిగా నవ్వేశారట. ఇక అప్పటి  నుంచి ప్రభాస్ తో లంచ్ అంటే.. అమ్మో అంటూ నవ్వేస్తారట తారక్. ఈ విషయం గురించి చాలా రోజులు చెప్పుకుని నవ్వుకున్నారట కూడా. 

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, సినిమాలతో పాటు హను రాఘవపూడి సినిమా కూడా చేయాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ దేవర ఈ నెలాకరున 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాక్ ఇచ్చిన దశరథ- కొత్త సీఈఓగా దీప- పారుపై కార్తీక్ డౌట్
Recommended image3
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved