- Home
- Entertainment
- క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్, తారక్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టిన నటి ఎవరు?
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్, తారక్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టిన నటి ఎవరు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకున్నారని మీకు తెలుసా? తను ఓ స్టార్ హీరో అని మర్చిపోయి, బాధలో ఉన్న ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకుని సపర్యలు చేశారని తెలుసా? తారక్ మంచి మనసు గురించి ఆ నటి ఇంకా ఏమన్నారంటే?

జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసు
స్టార్ హీరోలు మాట్లాడితే చాలు, వారికి ఎదురుపడితే చాలు అనుకునే ఆర్టిస్ట్ లు ఉన్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో. కొంత మందికి అయితే హీరోలను కలిసే ఛాన్స్ కూడా రాదు. వారి పాత్రేదో వారు చేసుకుని వెళ్లిపోతుంటారు. అటువంటి వారు ఉన్న ఇండస్ట్రీలో, కొంత మంది హీరోలు మాత్రం ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి అందరిలో కలిసిపోతుంటారు. అలాంటివారి పేరు సినిమా చరిత్రలో నిలిచిపోతుంటుంది. మంచి వాడు అన్న పేరు కూడా అలా ఉండిపోతుంది. అలాంటి పేరునే సంపాదించుకుంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్ గురించి వెల్లడించిన నటి
చిన్నా పెద్దా ఆర్టిస్ట్ లతో కలుపుగోలుగా ఉంటూ, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ , అన్నింటికి అండగా ఉంటున్నాడు తారక్. ఈ విషయంలో ఒక ఉదాహరణ కూడా ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ చూసిన ఓ నటి, ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. ఎన్టీఆర్ మంచితనం గురించి ఆమె చెప్పిన షాకింగ్ విషయాలు అభిమానులతో పాటు అందరిని షాక్ కు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పిన నటి ఎవరో తెలుసా?
పాన్ ఇండియా హీరోగా ఎదిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే కాదు, నిజజీవితంలో కూడా తన వినయంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనతో పనిచేసిన సినీ ప్రముఖులు తారక్ మంచితనం చూసి, తరచూ ఎన్టీఆర్ ప్రవర్తన గురించి మాట్లాడుతుంటారు. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా, తారక్ నడవడిక గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మూడు తరాల హీరోలతో నటించిన సుధ
స్టార్ నటిగా దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లోని అనేక పాత్రల్లో కనిపించిన సుధా, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి బాద్షా లాంటి మరికొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సీనియర్ స్టార్స్ సినిమాల్లో నటించిన సుధ, ఆతరువాత జనరేషన్ అయిన బాలయ్య, నాగార్జున సినిమాల్లోను మెప్పించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగచైతన్య, అఖిల్ సినిమాల్లో కూడా నటించి మూడు జనరేషన్ స్టార్స్ తో నటించిన అరుదైన నటిగా పేరు తెచ్చుకున్నారు.
సుధ కాలు పట్టుకుని సపర్యలు చేసిన తారక్
ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటనలో తారక్ ఎంతో వినయంగా ఎలా స్పందించాడో ఆమె వివరించారు. సుధ ఏమన్నారంటే? "బాద్షా సినిమా సమయంలో ఓ పాట షూటింగ్ లో పాల్గొన్నాను.
ఆ సీన్‌లో నేను డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నా కాలు జారి తడబడిపోయాను. వెంటనే ఎన్టీఆర్ పరిగెత్తి వచ్చి నా కాలు పట్టుకుని – 'ఏం కాలేదే కదా అమ్మ' అంటూ నన్ను ఓదార్చాడు. స్ప్రే తెప్పించి కాలుకు స్వయంగా సపర్యలు చేశాడు.
ఈ రోజుల్లో ఇంత పెద్ద హీరో అయినా ఇంతగా మర్యాదగా ఉండడం నిజంగా ఆశ్చర్యం. అలా ఎంత మంది ఉంటారు. అతను ఉన్న స్టార్ డమ్ కు నా కాలు గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఒక వేళ నా కాలుకి దెబ్బ తగిలినా కూడా వేరే వాళ్లకు చూడండయ్య అని చెప్పవచ్చు.
కానీ ఎన్టీఆర్ అలా కాదు. ఆయన మర్యాధ, వినయం వేరు. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు, ఇప్పుడు కూడా అనుకుంటే అల్లరి చేస్తాడు. కానీ ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటాడు." అని అన్నారు సుధ
ఎన్టీఆర్ గురించి చెపుతూ ఎమోషనల్ అయిన సుధ
ఈ సంఘటన బాద్షా సినిమా టైమ్ లో జరిగింది. ఈ విఫయాన్ని గతంలో సుధ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అంతే కాదు అప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ సుధా ఎమోషనల్ అయ్యారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని మరింతగా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా గ్రూప్స్ లో కూడా వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మంచితనం, గొప్పతనం వ్యక్తిత్వాన్ని గురించి మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. దేవర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తారక్.. ఆతరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అయిపోగానే దేవర 2 షూటింగ్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు యంగ్ టైగర్. ఇక ఈసినిమాలతో పాటు త్రివిక్రమ్ తో కూడా నందమూరి హీరో మూవీ చేయాల్సి ఉంది.