- Home
- Entertainment
- ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వివాహం, పెళ్లి కూతురు విక్టరీ వెంకటేష్ కి బంధువే.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వివాహం, పెళ్లి కూతురు విక్టరీ వెంకటేష్ కి బంధువే.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. శివాని తాళ్లూరి అనే అమ్మాయితో అతడి పెళ్లి జరిగింది. శివాని తాళ్లూరికి, విక్టరీ వెంకటేష్ కి ఉన్న బంధుత్వం ఏంటి ? ఆమె ఎవరు అనే వివరాలు వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ పెళ్లి వేడుక
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నె నితిన్ వివాహ వేడుక శుక్రవారం రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహిత సినీ ప్రముఖుల నడుమ పెళ్లి ఘనంగా జరిగింది. హీరో నార్నె నితిన్. లక్ష్మీ శివాని తాళ్లూరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. బావమరిది వివాహ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు.
టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు
జూనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి వివాహ వేడుక ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. నార్నె నితిన్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడే నితిన్. అతడి తండ్రి నార్నె శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త. రాజకీయాల్లో సైతం ఉన్నారు. స్టూడియో ఎన్ ఛానెల్ ని స్థాపించింది ఆయనే. నార్నె నితిన్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో గుర్తింపు పొందారు.
పెళ్లి కూతురు బ్యాగ్రౌండ్ ఇదే
నార్నె నితిన్ కి మరిన్ని చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇక పెళ్లి కూతురు లక్ష్మి శివాని తాళ్లూరి విషయానికి వస్తే ఆమెది కూడా పారిశ్రామికవేత్త కుమార్తె కావడం విశేషం. ఆమె తండ్రి తాళ్లూరి కృష్ణ ప్రసాద్, తల్లి పేరు స్వరూప. వీరి ఫ్యామిలీకి దగ్గుబాటి ఫ్యామిలీ విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు లతో బంధుత్వం ఉంది. తరతరాలుగా వస్తున్న బంధుత్వం అని తెలుస్తోంది. శివాని తాళ్లూరి దగ్గుబాటి రామానాయుడు గారికి మనవరాలి వరుస అవుతుందట.
కనుల పండుగలా వివాహం
మొత్తంగా నార్నె నితిన్, శివాని తాళ్లూరి వివాహ వేడుక కనుల పండుగలా సాగింది. వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. పెళ్లి కూతురు శివాని తాళ్లూరి చిరునవ్వులు చిందిస్తూ అందంగా మెరిసింది. వీరిద్దరి నిశ్చితార్థం గత ఏడాది జరగగా పెళ్లి ముహూర్తం ఇప్పుడు కుదిరింది. మొత్తంగా నార్నె నితిన్ ఓ ఇంటివాడు అయ్యారు.
పెళ్ళిలో సినీ ప్రముఖుల సందడి
వివాహ వేడుకకి ఎన్టీఆర్ ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ హాజరైనట్లు తెలుస్తోంది. నటుడు రాజీవ్ కనకాల కూడా పెళ్ళికి హాజరయ్యారట. రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. అదే విధంగా కొరటాల శివ కూడా హాజరయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన నార్నె నితిన్, శివాని లకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.