- Home
- Entertainment
- 20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగిన నటి, స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ పెద్ద హీరోల సరసన అవకాశాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మాయమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలెంట్ తో పాటు అదృష్ణం ఉండాలి..
ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ముఖ్యమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. ఎంత టాలెంట్ ఉన్నా.. లక్కు కలిసి రాకపోతే.. అవకాశాలు రావు, స్టార్ డమ్ కూడా సాధించలేము. ఈ విషయాన్ని దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు కొన్ని సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చాలామంది నటీనటులు.. టాలీవుడ్ లో ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. స్టార్ డమ్ కు అడుగు దూరంలోనే ఆగిపోతున్నారు. ఎంత కష్టపడ్డా.. సెకండ్ లైన్ లోనే ఆగిపోతున్నారు. కొందరు మాత్రం తెలివిగా కెరీర్ ఎంపికలు చేసుకుంటూ స్టార్‌డమ్‌ను అందుకుంటే, మరికొందరు మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వెనకబడిపోతుంటారు. అలాంటి హీరోయిన్‌లో రెజీనా కసాండ్రా ఒకరు.
20 ఏళ్లుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో
దాదాపు 20 ఏళ్లుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా టాలీవుడ్‌లో కొనసాగుతున్న రెజీనా, 2005లో సినిమాల్లో అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి ఇప్పటి వరకు 40కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, మంచి పాత్రలు చేసిందన్నది నిజం. అయితే, ఇప్పటి వరకు స్టార్‌డమ్‌ను అందించే బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రం ఆమె కెరీర్‌లో రాలేదు. కొన్ని హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకునే స్థాయి గుర్తింపు మాత్రం దక్కలేదు.
స్టార్ హీరోల సరసన అవకాశాలు రాక
రెజీనా కెరీర్‌లో ఆమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడంతో స్టార్ డమ్ కు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. తమన్నా, రకుల్ లాంటి హీరోయిన్ల కెరీర్ లు కూడా చిన్న హీరోలతోనే స్టార్ట్ అయ్యాయి. కానీ వారికి ఆతరువాత కాలంలో ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ లాంటి స్టార్స్ తో నటించే అవకాశం రావడంతో.. వారు స్టార్స్ అయ్యారు. రెజీనా మాత్రం సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, సుధీర్ బాబు,మంచు మనోజ్ లాంటి చిన్న హీరోలతోనే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.
గ్లామర్ రోల్స్ విషయంలో తగ్గేదే లేదు..
కెరీర్ బిగినింగ్ లో.. గ్లామర్ రోల్స్‌కు వెనకడుగు వేయని ఈ బ్యూటీ, ఇప్పుడు మాత్రం పూర్తిగా కంటెంట్ ఆధారిత సినిమాలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నది. ఈ జర్నీలో రెజీనా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లేడీ విలన్ గా ఆమె చేసిన సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.
బాలీవుడ్ చేరిన రెజీనా..
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సరసన వచ్చిన శివ మనసులో శృతీ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన రెజీనా, ఇప్పుడు విలన్ రోల్స్ వరకూ చేరుకుంది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడి పోరాడిందిం రెజీనా. ఇంకా పట్టుదలతో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కనిపించకుండా పోయింది హీరోయిన్... 2024 లో తెలుగు ప్రాజెక్ట్ లు చేసిన రెజీనా.. ఈ ఏడాది టాలీవుడ్ లొ ఒక్క సినిమా కూడా చేయలేదు. తమిళంతో పాటు.. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తోంది.

