- Home
- Entertainment
- TV
- Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంటోంది. మరో రెండు వారాల్లో ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. విన్నర్ కళ్యాణ్ కానీ, తనూజా కానీ అవుతారా అని అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. సడెన్ గా ఈ విన్నర్ రేసులోకి మరొకరు వచ్చారు.

Bigg Boss 9
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రియాల్టీ షోలో బిగ్ బాస్. గత 9 సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం సీజన్ 9 నడుస్తోంది. ఈ సీజన్ కూడా మరో రెండు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. వారిలో ఈ వీక్ ఇద్దరు ఎలిమేట్ అవుతారని, మిగిలిన ఐదుగురు టాప్-5 కి వెళ్తారని తెలుస్తోంది.
అయితే... ఈ వీకెండ్ లో ఒకేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేయకుండా.. మిడ్ వీక్ లోనే ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టికెట్ టూ ఫినేల్ లో గెలిచి ఇప్పటికే కళ్యాణ్ ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ‘ఇది ఫెయిర్ కాదు’ అనే థీమ్ లో టీమ్ కి కొన్ని గేమ్స్ పెట్టి ఆడిస్తున్నారు. ఈ గేమ్ లో గెలిచిన వారు సెకండ్ ఫైనలిస్ట్ గా సెలక్ట్ అవుతారు. ప్రస్తుతం లీడర్ బోర్డ్ లో చివరలో ఉన్న సుమన్ ఇప్పటికే ఈ రేసు నుంచి అవుట్ అయ్యాడు. మిగిలిన వాళ్లు పోటీ పడుతున్నారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్..
నిజానికి ఈ వారం మిడ్ వీక్ లో సుమన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమన్ తర్వాత.. వీకెండ్ నాగార్జున వచ్చిన తర్వాత... సంజనా ని ఎలిమినేట్ చేస్తారని అనుకున్నారు. కానీ, ఈ వారం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. గేమ్ లో భాగంగా అందరూ కలిసి సంజనా ని టార్గెట్ చేశారు. ప్రతి గేమ్ లోని ఆమెను ఆడనివ్వకుండా చేశారు. వీరి కారణంగా ఆమె జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇమ్మాన్యుయల్ కూడా సంజన కి సపోర్ట్ చేయలేదు.. దీంతో... ఆమె పట్ల ఆడియల్స్ లో సింపతీ ఎక్కువగా పెరిగింది. ఫలితంగా.... సంజనాకి ఓట్లు ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది.
టాప్ రేసులోకి సంజన..
నిజానికి ఈ వారం సంజన ఎలిమినేట్ అవ్వాల్సింది కాస్త... ఇప్పుడు టాప్ లో దూసుకుపోతోంది. ఇమ్మాన్యుయల్ కంటే కూడా ఎక్కువ ఓట్లు సంజనాకి పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కంటిన్యూ అయితే... చివరి వారంలో కూడా సంజానికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు టైటిల్ రేసులో తనూజ, కళ్యాణ్ పోటీ పడుతున్నారు. వీరిద్దరూ ఒకటి, రెండు స్థానాల కోసం పోటీ పడుతుంటే...మూడు, నాలుగు స్థానాల కోసం డీమాన్ పవన్, ఇమ్మూ పోటీ పడుతున్నారు. ఇప్పుడు వీరికి పోటీ చేస్తూ సంజన టాప్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి.. ఎవరు విన్నర్ అవుతారో తెలియంటే మరో వారం రోజులు ఆగితే సరిపోతుంది. ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బీబీ జోడి మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రోమో విడుదల అయ్యింది.

