- Home
- Entertainment
- ఏడేళ్ల తర్వాత నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్ రిపీట్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవే
ఏడేళ్ల తర్వాత నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్ రిపీట్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవే
రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం లాంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రం వచ్చింది.

పెద్ది షూటింగ్ తో బిజీగా రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం పుణేలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ 2026 జనవరి వరకు కొనసాగనున్నట్లు సమాచారం.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్
ఇక రామ్ చరణ్ మరో ప్రాజెక్ట్‌కి కూడా అంగీకరించారు, ఆ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ భారీ ప్రాజెక్ట్ 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.పెద్ది షూటింగ్ పూర్తయిన వెంటనే చరణ్ ఈ కొత్త ప్రాజెక్ట్‌లో చేరబోతున్నారని సమీప వర్గాలు తెలిపాయి. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్
రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం (2018) సినిమా అప్పట్లో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఆ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
ఏడేళ్ల తర్వాత రంగస్థలం కాంబినేషన్
ఇప్పుడు ఈ ద్వయం మళ్లీ కలుస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు కూడా సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్నే కొనసాగించనున్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అంటున్నారు. మొత్తంగా ఏడేళ్ల తర్వాత రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
త్వరలోనే ప్రకటన ?
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంటారా అనేది కూడానా ఉత్కంఠగా మారింది.