MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 85000 ఖరీదైన షర్ట్ వేసుకున్న పాన్ ఇండియా తెలుగు హీరో, ఎవరో గుర్తు పట్టారా?

85000 ఖరీదైన షర్ట్ వేసుకున్న పాన్ ఇండియా తెలుగు హీరో, ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో  కనిపిస్తున్న షర్ట్ చుశారా..? చాలా సింపుల్ గా కనిపిస్తున్నా ఈ చొక్కాను ఓ స్టార్ హీరో వేసుకుని ఉన్నాడు. ఆషర్ట్ కాస్ట్ ఎంతుంటుంది. ఓ పాన్ ఇండియా స్టార్ హీరో వేసుకున్నాడంటే ఆ చొక్క రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ షర్ట్ ను ప్రస్తుతం ఆ హీరో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్లాత్ కాస్ట్ కూడా వైరల్ చేస్తున్నారు. ఈ షర్ట్ రేటు ఎంతో తెలుసా.. అక్షరాలా 85000. ఇంతకీ ఈషర్ట్ వేసుకున్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2025, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


స్టార్ హీరోలు కొత్తగా ఏం చేసినా.. అభిమానులకు వింతగానే ఉంటుంది. వెంటనే ఆ విషయాన్ని వైరల్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కాస్ట్లీ ఐటమ్స్ ఏమైనా కొన్నారంటే ఆ విషయాన్ని గొప్పగా చేప్పుకుంటారు ఫ్యాన్స్. షార్ట్స్, షూస్, వాచ్, కార్స్ ఇలా సెలబ్రిటీలు ఎక్కువగా కాస్ట్ పెట్టి కొనేవి ఇవే. వాటిలో తమ హీరో ఏది కొన్నా..దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం కామన్ గా మారింది. ఈ ట్రెండ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ముందున్నారు. 

Also Read: మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆ షర్ట్ ఎన్టీఆర్ దే.గతంలో కొన్ని వస్తువుల కోసం చాలా కాస్ట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యాడు తారక్. రెండు కోట్ల వాచ్, లక్ష రూపాయల షూస్, 20 వేల రూపాయల షర్ట్ ఇలా తారక్ కొన్నవన్నీ చాలా కాస్ట్లీవే. తాజాగా మరోసారి ఇలాంటి వార్తల్లో నిలిచాడు ఎన్టీఆర్. ఈసారి కూడా కాస్ట్లీ షర్ట్ తో కనిపించాడు. తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఫోటోలు కూడా షేర్ చేశారు. 

Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.

35

అయితే ఈ వెకేషన్ లో ఆయన వేసుకున్న డిజైనర్ షర్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ షర్ట్ ను చూసిన వెంటనే దాన్ని గూగుల్ లో సెర్చ్  చేశారు ఫ్యాన్స్. ఆ చొక్క ఖరీదు  85000 అని ఫ్యాన్స్ కనుక్కున్నారు.ఇక తెలిసిన వెంటనే మరింతగా వైరల్ చేయడం  మొదలు పెట్టారు. 

Also Read: విరాట్ కోహ్లీతో రామ్ చరణ్ సెల్ఫీ, ఎప్పుడు కలిశారు? వైరల్ అవుతున్న ఫోటో

45
Prashanth Neel, NTR Jr, kgf

Prashanth Neel, NTR Jr, kgf

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా దేవర. ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రీసెంట్ గా జపాన్ లో కూడా రిలీజ్ అయ్యింది దేవర. ఇక దేవర సెకండ్ పార్ట్ గురించి కూడా చర్చ జరుగుతోంది. దేవర 2 ఆగిపోయిందన్న టాక్ గట్టిగా వినిపించింది. కాని ఆ సినిమా ఆగిపోలేదు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.  సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కలైయరశన్, అజయ్, అభిమన్యు సింగ్ ఇతర పాత్రల్లో నటించారు.

Also Read: ప్రభాస్ ను క్లైమాక్స్ లో చంపబోతున్న డైరెక్టర్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?

55
jr ntr

jr ntr

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమా తరువాత వచ్చిన సినిమా కావడంతో దేవర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఇక దేవర 2 కోసం ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు.

అంతకు ముందు బాలీవుడ్ లో తారక్  హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2 మూవీకూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈక్రమంలో ఎన్టీఆర్ లుక్ కూడా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. చాలావెయిట్ లాస్ అయ్యి.. బక్కగా కనిపిస్తున్నారు తారక్. సినిమా కోసం ఇలా మారినట్టు చెప్పుతున్నారు. కాని నిజంఏంటో తెలియాల్సి ఉంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved